hyderabadupdates.com Gallery Bengaluru: బెంగుళూరు ఏటీఎం క్యాష్ వెహికల్ దోపిడీ కేసును చేధించిన పోలీసులు

Bengaluru: బెంగుళూరు ఏటీఎం క్యాష్ వెహికల్ దోపిడీ కేసును చేధించిన పోలీసులు

Bengaluru: బెంగుళూరు ఏటీఎం క్యాష్ వెహికల్ దోపిడీ కేసును చేధించిన పోలీసులు post thumbnail image

 
బెంగళూరు ఏటీఎం వ్యాన్‌ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఏపీలోని కుప్పంలో తనిఖీలు నిర్వహించిన కర్ణాటక పోలీసులు… కూర్మానీపల్లెలో రూ. 7.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. నవీన్‌ అనే యువకుడి ఇంట్లో నగదు పట్టుకున్నారు. గత రెండు రోజులుగా నిందితులు నగదును ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారుస్తూ.. పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా కుప్పంలో నగదును మారుస్తున్న క్రమంలో ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) అధికారులమంటూ ఏటీఎం కరెన్సీ వ్యాన్‌ సిబ్బందిని నమ్మించి ఏకంగా రూ.7.5 కోట్ల కరెన్సీ కట్టలను దోచుకెళ్లిన ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో పట్టపగలే చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బుధవారం(నవంబర్‌ 19) మధ్యాహ్నం 12.24 గంటలకు జేపీ నగర్‌ హెచ్‌డీఎఫ్‌సీ కరెన్సీ చెస్ట్‌ నుంచి రూ.7.5 కోట్ల విలువైన కరెన్సీ కట్టలను తీసుకుని వేర్వేరు ఏటీఎంలలో నింపేందుకు బయల్దేరిన సీఎంఎస్‌ ఇన్నో సిస్టమ్స్‌ వారి ఏటీఎం క్యాష్‌వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అశోకా పిల్లర్‌ వద్ద అడ్డగించారు.
ప్రభుత్వ స్టిక్టర్‌ అంటించి ఉన్న ఖరీదైన ఎస్‌యూవీ వాహనంలో దిగిన ఆ దొంగలు తాము ఆర్‌బీఐ ఉన్నతాధికారులమంటూ నమ్మబలికారు. డాక్యు మెంట్లను వెంటనే క్షుణ్ణంగా తనిఖీ చేయాలంటూ కస్టోడియన్‌ అఫ్తాబ్, గన్‌మెన్‌ రాజన్న, తమ్మయ్యలనూ తమ వాహనంలోకి ఎక్కించుకున్నారు. తమ వాహనాన్ని అనుసరించాలని ఏటీఎం క్యాష్‌ వాహన డ్రైవర్‌కు సూచించారు. డైరీ సర్కిల్‌ ఫ్లైఓవర్‌ వద్దకు రాగానే పిస్టల్‌ చూపించి డ్రైవర్‌ను బెదిరించి కరెన్సీ కట్టలు తీసుకుని ఉడాయించారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ కేసును కర్ణాటక పోలీసులు ఇవాళ ఛేదించారు.
The post Bengaluru: బెంగుళూరు ఏటీఎం క్యాష్ వెహికల్ దోపిడీ కేసును చేధించిన పోలీసులు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Suresh Kumar: ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ గా మారిన బీజేపీ ఎమ్మెల్యేSuresh Kumar: ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ గా మారిన బీజేపీ ఎమ్మెల్యే

    బీజేపీ సీనియర్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సురేష్‌ కుమార్‌ మంగళవారం ట్రాఫిక్‌ పోలీస్‌ అవతారమెత్తారు. బెంగుళూరు నగరంలోని భాష్యం సర్కిల్‌ దగ్గర రెండు గంటలపాటు ట్రాఫిక్‌ పోలీస్‌గా విధులు నిర్వహించారు. బెంగళూరు ట్రాఫిక్‌ పోలీసులు ప్రారంభించిన ‘ట్రాఫిక్‌ కాప్‌

ఇరాన్ ఎయిర్ స్పేస్ మూసి వేత ఫ్లైట్స్ ర‌ద్దుఇరాన్ ఎయిర్ స్పేస్ మూసి వేత ఫ్లైట్స్ ర‌ద్దు

న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియా బిగ్ షాక్ ఇచ్చింది ప్ర‌యాణీకుల‌కు. ప్ర‌స్తుతం ఇరాన్ ప్ర‌భుత్వం త‌మ గ‌గ‌న త‌లాన్ని మూసి వేస్తున్న‌ట్లు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. దీంతో అమెరికాతో పాటు ఇత‌ర దేశాల‌కు ప్ర‌యాణం చేసే, ముంద‌స్తు బుకింగ్ చేసుకున్న ట్రావెల‌ర్స్

వ్యవసాయ యాంత్రీకరణకు అధిక ప్రాధాన్య‌తవ్యవసాయ యాంత్రీకరణకు అధిక ప్రాధాన్య‌త

అమ‌రావ‌తి : వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు యాంత్రీకరణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 2014–2019 మధ్య తెదేపా హయాంలో 3.24 లక్షల మంది రైతులకు రూ.987.71 కోట్ల సబ్సిడీతో 50% రాయితీపై వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు వ్యక్తిగతంగా అందించామని