hyderabadupdates.com Gallery Bengaluru: బెంగుళూరు ఏటీఎం క్యాష్ వెహికల్ దోపిడీ కేసును చేధించిన పోలీసులు

Bengaluru: బెంగుళూరు ఏటీఎం క్యాష్ వెహికల్ దోపిడీ కేసును చేధించిన పోలీసులు

Bengaluru: బెంగుళూరు ఏటీఎం క్యాష్ వెహికల్ దోపిడీ కేసును చేధించిన పోలీసులు post thumbnail image

 
బెంగళూరు ఏటీఎం వ్యాన్‌ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఏపీలోని కుప్పంలో తనిఖీలు నిర్వహించిన కర్ణాటక పోలీసులు… కూర్మానీపల్లెలో రూ. 7.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. నవీన్‌ అనే యువకుడి ఇంట్లో నగదు పట్టుకున్నారు. గత రెండు రోజులుగా నిందితులు నగదును ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారుస్తూ.. పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా కుప్పంలో నగదును మారుస్తున్న క్రమంలో ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) అధికారులమంటూ ఏటీఎం కరెన్సీ వ్యాన్‌ సిబ్బందిని నమ్మించి ఏకంగా రూ.7.5 కోట్ల కరెన్సీ కట్టలను దోచుకెళ్లిన ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో పట్టపగలే చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బుధవారం(నవంబర్‌ 19) మధ్యాహ్నం 12.24 గంటలకు జేపీ నగర్‌ హెచ్‌డీఎఫ్‌సీ కరెన్సీ చెస్ట్‌ నుంచి రూ.7.5 కోట్ల విలువైన కరెన్సీ కట్టలను తీసుకుని వేర్వేరు ఏటీఎంలలో నింపేందుకు బయల్దేరిన సీఎంఎస్‌ ఇన్నో సిస్టమ్స్‌ వారి ఏటీఎం క్యాష్‌వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అశోకా పిల్లర్‌ వద్ద అడ్డగించారు.
ప్రభుత్వ స్టిక్టర్‌ అంటించి ఉన్న ఖరీదైన ఎస్‌యూవీ వాహనంలో దిగిన ఆ దొంగలు తాము ఆర్‌బీఐ ఉన్నతాధికారులమంటూ నమ్మబలికారు. డాక్యు మెంట్లను వెంటనే క్షుణ్ణంగా తనిఖీ చేయాలంటూ కస్టోడియన్‌ అఫ్తాబ్, గన్‌మెన్‌ రాజన్న, తమ్మయ్యలనూ తమ వాహనంలోకి ఎక్కించుకున్నారు. తమ వాహనాన్ని అనుసరించాలని ఏటీఎం క్యాష్‌ వాహన డ్రైవర్‌కు సూచించారు. డైరీ సర్కిల్‌ ఫ్లైఓవర్‌ వద్దకు రాగానే పిస్టల్‌ చూపించి డ్రైవర్‌ను బెదిరించి కరెన్సీ కట్టలు తీసుకుని ఉడాయించారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ కేసును కర్ణాటక పోలీసులు ఇవాళ ఛేదించారు.
The post Bengaluru: బెంగుళూరు ఏటీఎం క్యాష్ వెహికల్ దోపిడీ కేసును చేధించిన పోలీసులు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

జ‌న‌రంజకంగా ప్ర‌జా పాల‌న : రాజ నర‌సింహ‌జ‌న‌రంజకంగా ప్ర‌జా పాల‌న : రాజ నర‌సింహ‌

ఆందోల్ – జోగిపేట : రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ న‌ర‌సింహ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జా ప్ర‌భుత్వం అన్ని వ‌ర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తోంద‌ని చెప్పారు. ఇప్ప‌టికే ఇచ్చిన అన్ని హామీల‌ను అమ‌లు చేయ‌డం

నాద‌ర్ గుల్ భూముల క‌బ్జాలో మంత్రికి సంబంధం లేదునాద‌ర్ గుల్ భూముల క‌బ్జాలో మంత్రికి సంబంధం లేదు

హైద‌రాబాద్ : నాద‌ర్ గుల్ భూముల వ్య‌వ‌హారం రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. రూ. 7,000 కోట్ల స్కాం చోటు చేసుకుంద‌ని మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీష్ రావు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. దీనిపై కోహినూర్ గ్రూప్ స్పందించింది. ఈ మేర‌కు

DGP Shivadhar Reddy: కానిస్టేబుల్‌ హత్య కేసు నిందితుడు రియాజ్ ఎన్ కౌంటర్DGP Shivadhar Reddy: కానిస్టేబుల్‌ హత్య కేసు నిందితుడు రియాజ్ ఎన్ కౌంటర్

DGP Shivadhar Reddy : నిజామాబాద్‌ లో కానిస్టేబుల్‌ను హతమార్చిన (Conistable Death) వాహనాల దొంగ రియాజ్‌ (24) పోలీసు కాల్పుల్లో మృతిచెందాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్‌… కానిస్టేబుల్‌ నుంచి తుపాకీ లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆత్మరక్షణ కోసం