hyderabadupdates.com Gallery Bomb Blasts: బాంబులతో దద్దరిల్లిన ఢాకా

Bomb Blasts: బాంబులతో దద్దరిల్లిన ఢాకా

Bomb Blasts: బాంబులతో దద్దరిల్లిన ఢాకా post thumbnail image

 
 
2024 మారణహోమం కేసుకు సంబంధించి ఇంటర్ నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా కేసులో తుది తీర్పును ఈ రోజు (సోమవారం) వెలువరించనుంది. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీనితో బంగ్లాదేశ్ వరుస నాటు బాంబు దాడులతో దద్దరిల్లుతోంది. దేశ రాజధాని ఢాకాలో నిన్న (ఆదివారం) పలుచోట్ల నాటు బాంబు దాడులు జరిగాయి. రాత్రి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు బాంబు దాడులకు పాల్పడ్డారు. పోలీస్ స్టేషన్‌ కాంప్లెక్స్‌లోకి నాటు బాంబు విసిరారు. అంతటితో ఆగకుండా ప్రభుత్వ అధికారి ఇంటి బయట కూడా నాటు బాంబులు వేశారు. ఇంటర్ నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా కేసులో తుది తీర్పును ఈ రోజు (సోమవారం) వెలువరించనుంది.
 
ఈ నేపథ్యంలోనే గత కొద్దిరోజుల నుంచి ఢాకాలో హింసాత్మక ఘటనలు ఎక్కువైపోయాయి. నవంబర్ 10వ తేదీన కూడా వరుస నాటు బాంబు దాడులు జరిగాయి. మీర్పూర్‌లోని గ్రామీణ బ్యాంక్ హెడ్ క్వాటర్స్‌పై గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడి చేశారు. గ్రామీణ బ్యాంక్‌కు చెందిన చాలా బ్రాంచ్‌లపై కూడా పెట్రోల్ బాంబు దాడులు జరిగాయి. గత వారం పెద్ద సంఖ్యలో బస్సులను సైతం దుండగులు తగలబెట్టారు. ఓ బస్సులో నిద్రిస్తున్న డ్రైవర్ చనిపోయాడు. మాజీ ప్రధాని హసీనాకు మరణ శిక్ష విధిస్తారనే ప్రచారం బాగా జరుగుతోంది.
హసీనా కొడుకు సజీబ్ వాజెద్ తన తల్లికి మరణ శిక్ష విధించే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. యూనస్ ప్రభుత్వం తన తల్లిని టార్గెట్ చేసిందని, దోషిగా తేల్చబోతోందని అన్నాడు. 2024 మారణహోమం కేసుకు సంబంధించి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు హోమ్ మినిస్టర్ అసదుజ్జమాన్ ఖాన్ కమల్, మాజీ పోలీస్ చీఫ్ అబ్దుల్ అల్ మామూన్ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. షేక్ హసీనా, అసదుజ్జమాన్ ఖాన్ కమల్ బంగ్లాదేశ్‌లో లేరు. అప్రూవల్‌గా మారిన అబ్దుల్ ఒక్కరే విచారణకు హాజరుకానున్నారు.
The post Bomb Blasts: బాంబులతో దద్దరిల్లిన ఢాకా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

జగన్ బుర్రలో లాజిక్ లు పనిచేయవా?జగన్ బుర్రలో లాజిక్ లు పనిచేయవా?

ఇదే వ్యవహారం సినిమాల్లో జరిగితే గనుక.. ‘ఆడికి చిప్ దొబ్బింది రా’ అనే డైలాగు వస్తుంది. ఇది రాజకీయరంగం గనుక, పైగా జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గనుక అలాంటి డైలాగు అంటే.. నొచ్చుకునే వాళ్లు ఎక్కువగానే ఉండొచ్చు. కానీ, ఒక్క