hyderabadupdates.com Gallery Bomb Threat: ఆరు ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు

Bomb Threat: ఆరు ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు

Bomb Threat: ఆరు ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు post thumbnail image

 
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేళుళ్ళతో దేశం అట్టుడుకుతున్న వేళ… పలు ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. బుధవారం గురుగ్రామ్‌లోని ఇండిగో ప్రధాన కార్యాలయానికి దుండగులు బాంబు బెదిరింపు మెయిళ్లు పంపారు. అందులో దిల్లీ, కోల్‌కతా, తిరువనంతపురం నుంచి నడుస్తున్న పలు విమానాల్లో బాంబు అమర్చినట్లు బెదిరింపులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన ఎయిర్‌లైన్స్‌ అధికారులు ఆయా విమానాశ్రయాల అధికారులను అలర్ట్‌ చేశారు. దీంతో ఎయిర్ పోర్టు భద్రత దళాలు తనిఖీలు చేపట్టాయి. ఆరు ఎయిర్ పోర్టుల్లో బాంబు స్వ్కాడ్ విస్తృత తనిఖీలు చేస్తున్నాయి.
186 మంది ప్రయాణికులతో కోల్‌కతా నుంచి ముంబయికి వెళ్లనున్న ఇండిగో విమానంలో బాంబు పెట్టినట్లు బెదిరింపు రావడంతో ప్రయాణికులను కిందకు దించేసి, విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. దిల్లీ, తిరువనంతపురం విమానాశ్రయాల్లో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసినట్లు తెలుస్తోంది. బాంబు స్క్వాడ్‌ బృందాలతో ఇండిగో విమానాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టామన్నారు. తాజాగా దేశరాజధానిలో పేలుడు సంభవించడంతో దిల్లీ విమానాశ్రయంలో భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు పేర్కొన్నారు. బెదిరింపు మెయిళ్లు పంపిన వారిని గుర్తించడానికి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
 
ఢిల్లీలో పేలుడు ఘటనతో అంతటా అలర్ట్‌ ప్రకటించగా రెండు కేసుల్లో మూలాలను వెతికిపట్టుకునేందుకు ఢిల్లీ పోలీస్, ఎన్‌ఐఏ, నిఘా ఏజెన్సీల బృందాలు దేశవ్యాప్తంగా దర్యాప్తు కోసం బయల్దేరాయి. మంగళవారం కశ్మీర్‌లో నలుగురు అనుమానితులను అరెస్ట్‌చేశారు. ఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్లు, బస్‌ టర్మినళ్ల వద్ద కట్టుదిట్ట భద్రత కొనసాగుతోంది. భారతావని ఉలిక్కిపడేలా చేసిన కారు పేలుడు ఘటనను ఉగ్రవాద దుశ్చర్యగా కేంద్ర దర్యాప్తు సంస్థలు అనధికారికంగా ప్రకటించాయి. ఉగ్ర వైద్యుడు డాక్టర్‌ ఉమర్‌ మొహమ్మద్‌ నబీ అత్యంత విస్ఫోటక స్వభావమున్న అమ్మోనియం నైట్రేట్‌ ఫ్యూయల్‌ ఆయిల్‌ (ఏఎన్‌ఎఫ్‌ఓ)తో నిండిన కారును ఎర్రకోట సమీపంలో నడిరోడ్డుపై పేల్చేశాడని తొలుత వార్తలొచ్చాయి.
అయితే ఆరుబయట అధిక వేడిమి, ఒత్తిడి కారణంగా అమ్మోనియం నైట్రేట్‌ పేలిపోయి ఉంటుందని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఐ20 కారును జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా లీథ్‌పురాకు చెందిన ఉమర్‌ నబీ నడిపినట్లు సమీప సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. దీంతో కారులో ఉన్నది అతనేనా కాదా అనేది శాస్త్రీయంగా నిర్ధారించేందుకు ఉమర్‌ తల్లి షమీమా బానో నుంచి డీఎన్‌ఏ శాంపిళ్లను సేకరించారు.
ఇప్పటికే ఆమెతోపాటు ఉమర్‌ సోదరులు ఆషిక్‌ అహ్మద్, జహూర్‌ అహ్మద్‌లను పోలీసులు అరెస్ట్‌ చేసి ప్రశ్నిస్తున్నారు. పుల్వామాలోని ఉమర్‌ ఇంట్లో సోదాలుచేసి కీలక డాక్యుమెంట్లు, ఎల్రక్టానిక్‌ పరికరాలను స్వాదీనం చేసుకున్నారు. కారు పేలినప్పుడు అందులో ఉమర్‌ ఒక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. చికిత్స చెందుతున్న క్షతగాత్రులు ముగ్గురు మంగళవారం ప్రాణాలు కోల్పోవడంతో సోమవారం నాటి పేలుడు ఘటనలో మరణాల సంఖ్య 12కు పెరిగింది.
The post Bomb Threat: ఆరు ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

పోరాడ‌ట‌మే త‌ప్పా పొత్తులంటూ ఉండ‌వుపోరాడ‌ట‌మే త‌ప్పా పొత్తులంటూ ఉండ‌వు

చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్రంలో రాజకీయాలు మ‌రింత ఆస‌క్తిని రేపుతున్నాయి. టీవీకే పార్టీ ద‌ళ‌ప‌తి విజ‌య్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ పార్టీ ఒంట‌రిగానే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఏ పార్టీతో తాము పొత్తు పెట్టుకునే ప్ర‌స‌క్తి

Gujarat Cabinet: గుజరాత్ మంత్రుల మూకుమ్మడి రాజీనామాGujarat Cabinet: గుజరాత్ మంత్రుల మూకుమ్మడి రాజీనామా

Gujarat Cabinet : గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మిగిలిన మంత్రులందరూ తమ పదవులకు రాజీనామా చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు మార్గం సుగమం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, మరికాసేపట్లో

ఒక రోజు ముందుగానే పేద‌ల‌కు పెన్ష‌న్లు పంపిణీఒక రోజు ముందుగానే పేద‌ల‌కు పెన్ష‌న్లు పంపిణీ

అమ‌రావ‌తి : ఏపీలో త‌మ ప్ర‌భుత్వం ఒక రోజు ముందుగానే పేద‌ల‌కు పెన్ష‌న్లు పంపిణీ చేయ‌డం జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర హొం శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంద‌న్నారు. శ‌నివారం ఎన్టీఆర్ భరోసా