BRS : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత ఎంపికలో బిగ్‌ట్విస్ట్ చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ వారసుడిని తానేనంటూ తారక్ ప్రద్యుమ్న తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాశారు. ఆ లేఖలో ‘తన తల్లి మాలినీ దేవిని హిందూ వివాహ చట్ట ప్రకారం… మాగంటి గోపీనాథ్ పెళ్లి చేసుకున్నారు. గోపీనాథ్ భార్య అంటూ సునీత తప్పుడు సమాచారం ఇస్తున్నారు. సునీత అఫిడవిట్‌ను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ఇప్పటికే మాగంటి సునీత నామినేషన్‌కు ఈసీ ఆమోదం తెలిపింది. మరోవైపు షేక్‌పేట్ ఆర్వో కార్యాలయానికి మాగంటి సునీత (Maganti Sunitha) వచ్చారు. నామినేషన్‌లో తాను పేర్కొన్న అంశాలన్నీ సరైనవేనంటూ ఎన్నికల అధికారులకు డిక్లరేషన్ ఫారమ్ అందజేశారు.
BRS – ‘జూబ్లీహిల్స్’పై నేడు కేసీఆర్ దిశానిర్దేశం
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజక వర్గ ఉపఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో బీఆర్‌ఎస్ పార్టీ (BRS) ప్రచారపర్వంపై దృష్టి కేంద్రీక రించింది. ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురువారం కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఎర్రవల్లి నివాసంలో జరిగే ఈ భేటీకి రావాల్సిందిగా పార్టీ అభ్యర్థితోపాటు పార్టీ డివిజన్ ఇన్ చార్జ్‌లు, స్టార్ క్యాంపెయినర్లు, ప్రచారంలో పాల్గొంటున్న కీలక నేతలు, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లకు ఆహ్వానం అందింది. గురువారం జరిగే భేటీలో పార్టీ ప్రచార వ్యూహం, సమన్వయం, ప్రచార ఎజెండాపై కేసీఆర్ దిశానిర్దే శం చేస్తారని బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావు బుధవారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉపఎన్నికలో అనుసరించాల్సిన ప్రచార వ్యూహంతోపాటు క్షేత్ర స్థాయిలో నెలకొన్న రాజకీయ స్థితిగతులు, ఓటరు మనోగతం తదితరాలపై చర్చించినట్టు సమాచారం. బీఆర్‌ఎస్ పట్ల ఉన్న సానుకూలతను ఓట్ల రూపంలో మలుచుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో కసరత్తు జరిగినట్టు తెలిసింది.
బహిరంగ సభకు విముఖత: ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ బాకీ కార్డులను పంపిణీ చేస్తూ బీఆర్‌ఎస్ ప్రచారం చేస్తోంది. ప్రచారానికి కేవలం 15 రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో విస్తృత ప్రచారానికి అవలంబించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దృష్టి సారించారు. నగరంలో ఉండే ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని భారీ సభలు, సమావేశాల జోలికి వెళ్లకుండా డివిజన్ల వారీగా హాల్ మీటింగ్స్, కార్నర్ సమావేశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది. ఓటర్లకు చేరువయ్యేందుకు ఉదయం, సాయంత్రం వేళల్లో పార్టీ బృందాలు ప్రతీ ఇంటిని సందర్శించేలా షెడ్యూల్ రూపొందించాలని కేసీఆర్ ఆదేశించారు. ప్రచారం చివరిదశలో జరిగే రోడ్ షోలో కేసీఆర్ పాల్గొనే అవకాశమున్నట్టు బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.
Also Read : Minister Vivek: వివేక్, హరీశ్ రావుల మధ్య మాటల యుద్ధం
The post BRS: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధికి బిగ్ షాక్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
BRS: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధికి బిగ్ షాక్
Categories: