hyderabadupdates.com Gallery Car Accident: పెళ్లి బృందంపై దూసుకెళ్లిన కారు ! నలుగురు మృతి !

Car Accident: పెళ్లి బృందంపై దూసుకెళ్లిన కారు ! నలుగురు మృతి !

Car Accident: పెళ్లి బృందంపై దూసుకెళ్లిన కారు ! నలుగురు మృతి ! post thumbnail image

 
 
బీహార్‌ లోని బెట్టియా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లౌరియా-బాగా ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన ఒక కారు వివాహ అతిథుల బృందంపైకి దూసుకెళ్లడంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ దుర్ఘటనలో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.
వివాహ కార్యక్రమం ముగించుకుని తిరిగివస్తున్న అతిథులు రోడ్డు పక్కన నిలుచుని ఉండగా, అటుగా వచ్చిన ఒక కారు అదుపుతప్పి వారిని ఢీకొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ఆర్తనాదాలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారందరినీ లౌరియా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మరణించగా, చికిత్స పొందుతూ ఒక యువకుడు మృతి చెందాడు. బాధితుల్లో చాలా మందిని గుర్తించడం కష్టతరంగా మారిందని తెలుస్తోంది.
తీవ్రంగా గాయపడిన మొత్తం 16 మందికి తొలుత ప్రథమ చికిత్స అందించి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం బెట్టియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకుని, తదుపరి దర్యాప్తు ప్రారంభించారు. నార్కటియాగంజ్‌లోని మాల్దహియా పోఖారియా నుండి బిషున్‌పూర్వాకు ఈ వివాహ అతిథుల బృందం వచ్చినట్లు సమాచారం. పెళ్లి వేడుకలు పూర్తయిన తర్వాత, పలువురు అతిథులు రోడ్డు పక్కన గుమిగూడి ఉండగా, అదుపు తప్పిన ఒక కారు వారిపైకి దూసుకెళ్లడం ఈ విషాదానికి కారణంగా నిలిచింది. కారు అతివేగమే ఈ ఘోర ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.
The post Car Accident: పెళ్లి బృందంపై దూసుకెళ్లిన కారు ! నలుగురు మృతి ! appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సంద‌ర్శించిన బిల్ గేట్స్ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సంద‌ర్శించిన బిల్ గేట్స్

అమ‌రావ‌తి : ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి సోమ‌వారం సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించారు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్. పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలించారు. రియల్ టైమ్ గవర్నెన్సు ద్వారా పౌర సేవల్ని వేగంగా అందిస్తున్న తీరు, ఫలితాలను గేట్స్‌కు

PM Narendra Modi: నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్-1 ప్రారంభించిన మోదీPM Narendra Modi: నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్-1 ప్రారంభించిన మోదీ

    నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్-1 ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. అదానీ ఎయిర్‌పోర్ట్స్, సిడ్కో మధ్య పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో రూ.19,650 కోట్లతో దీనిని నిర్మించారు. దీని వార్షిక ప్రయాణికుల సామర్థ్యం 9 కోట్లు.

Chinna Srisailam Yadav: కుమారుడి గెలుపుపై చిన్న శ్రీశైలం యాదవ్‌ సంచలన కామెంట్స్Chinna Srisailam Yadav: కుమారుడి గెలుపుపై చిన్న శ్రీశైలం యాదవ్‌ సంచలన కామెంట్స్

  అమెరికాలో బాత్రూంలు కడిగి వచ్చినోనికి హైదరాబాద్‌ లో రౌడీలకు, పహిల్వాన్లకు తేడా తెల్వదని నవీన్‌యాదవ్‌ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ విమర్శించారు. కుమారుడి గెలుపు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రచారం సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నవీన్‌ యాదవ్‌పైనా,