హైదరాబాద్ : ప్రపంచ ఆర్థిక ఫోరం వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్‌లోని దావోస్ పర్యటనకు బయలు దేరనుంది. సోమవారం మేడారంలో పునర్నిర్మించిన సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద ముఖ్యమంత్రి పూజలు నిర్వహిస్తారు.