వచ్చే ఎన్నికల నాటికి.. రాష్ట్రంలో రాజకీయాలు మారుతాయా? బీజేపీ-జనసేన- టీడీపీ కూటమి మాదిరిగా మరో కూటమి ఆవిర్భవించే అవకాశం ఉందా? అంటే.. ఔననే అంటున్నారు కొందరు పరిశీలకులు. చిన్నా చితకా పార్టీలను కలుపుకొని.. మరో మహాకూటమి ఏర్పాటయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.