CBI : పంజాబ్ పోలీస్ శాఖలో పని చేస్తున్న డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ హర్‌చరణ్ సింగ్ బుల్లర్ అవినీతి కేసులో గురువారం అరెస్ట్ అయ్యారు. ది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అధికారులు ఆయన్ని మొహాలి ఆఫీస్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే కేసుకు సంబంధించి మరో వ్యక్తిని కూడా సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం…
CBI Arrest
డీఐజీ బుల్లర్ ప్రతీ నెల 4 లక్షల రూపాయల లంచం తీసుకుంటున్నారు. ఫతేహ్‌పూర్‌కు చెందిన ఓ స్క్రాప్ డీలర్ బుల్లర్ పై ఇచ్చిన ఫిర్యాదుతో సీబీఐ అధికారులు రంగంలోకి దిగారు. గురువారం బుల్లర్ ఆఫీసుతో పాటు ఆయన ఇళ్లు, మొహాలి,పంచ్‌కులలోని ఇతర ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే బుల్లర్‌ను అరెస్ట్ చేశారు.
కాగా, హర్‌చరణ్ సింగ్ పంజాబ్ మాజీ డీజీపీ మెహల్ సింగ్ బుల్లర్ కొడుకు కావటం గమనార్హం. హర్‌చరణ్ సింగ్ గత సంవత్సరం నవంబర్ నెలలో రోపర్ రేంజ్ డీఐజీగా బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు పటియాలా రేంజ్ డీఐజీగా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వార్ ఎగైనెస్ట్ డ్రగ్స్’ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు.
Also Read : Maoist Asanna: మావోయిస్టు అగ్రనేత ఆశన్న లొంగుబాటు
The post CBI: అవినీతి కేసులో పంజాబ్ డీఐజీ హర్‌చరణ్ సింగ్ అరెస్ట్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
CBI: అవినీతి కేసులో పంజాబ్ డీఐజీ హర్‌చరణ్ సింగ్ అరెస్ట్
Categories: