hyderabadupdates.com Gallery Children Hostage: ముంబైలో పిల్లల కిడ్నాప్‌ కథ సుఖాంతం !

Children Hostage: ముంబైలో పిల్లల కిడ్నాప్‌ కథ సుఖాంతం !

Children Hostage: ముంబైలో పిల్లల కిడ్నాప్‌ కథ సుఖాంతం ! post thumbnail image

Children Hostage : ముంబైలో 20మంది పిల్లల కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. ఆడిషన్స్‌ పేరుతో కిడ్నాప్‌ కు గురైన 20మంది పిల్లల్ని పోలీసులు కాపాడారు. కిడ్నాపర్‌ ను అదుపులోకి తీసుకున్నారు. గన్‌ తో పాటు పలు రసాయనాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో నిందితుడు హతమయ్యాడు. రెస్క్యూ ఆపరేషన్‌ సమయంలో నిందితుడు కాల్పులు జరిపాడని, దీంతో ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు వెల్లడించారు. తీవ్ర గాయాలైన అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయినట్లు సమాచారం. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
Children Hostage News Update
సినిమా,డైలీ సీరియల్స్‌,వెబ్‌ సిరీస్‌లో బాల నటీనటులు కావాలంటూ ముంబయి పవయీ ప్రాంతంలోని ఆర్‌ఏ యాక్టింగ్‌ స్టూడియోలో రోహిత్ ఆర్య అనే వ్యక్తి ఓ యాడ్‌ ఇచ్చాడు. ఆ యాడ్‌ చూసిన 100 మంది పిల్లలు మహారాష్ట్ర రాజధాని ముంబైలో (Mumbai) ఉన్న ఆర్‌ఏ స్టూడియోకు తరలివచ్చారు. 8-14 ఏళ్ల వయసులోపు ఉన్న 100 మంది చిన్నారులు స్టూడియోకు వచ్చారు. కొంత సమయం తర్వాత చిన్నారులను బయటకు పంపించిన రోహిత్‌.. కొంత మందిని మాత్రం బంధించాడు. అయితే పిల్లల్ని బంధించిన అనంతరం ఓ వీడియోను విడుదల చేశాడు. ఆ వీడియోలో కిడ్నాపర్‌ రోహిత్‌ ఆర్య మాట్లాడుతూ… ‘నావి మామూలు డిమాండ్లే. నేను కొంతమందిని ప్రశ్నించాలని అనుకుంటున్నాను. వాళ్ల నుంచి నాకు జవాబు కావాలి. నేను ముందుగా సూసైడ్‌ చేసుకోవాలనుకున్నాను. కానీ ప్లాన్‌ మార్చి పిల్లల్ని కిడ్నాప్‌ చేశా. ఈ వీడియో చూసిన తర్వాత పిల్లల్ని రక్షించాలని పోలీసులు ఏదైనా ప్రయోగం చేస్తే ఈ ప్రదేశాన్ని తగలబెడతా. డబ్బును ఆశించడం లేదు. అలాగని ఉగ్రవాదిని కూడా కాదు’ అంటూ బెదిరింపులకు దిగాడు.
ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ముంబై (Mumbai) పోలీసులు అప్రమత్తమయ్యారు. స్టూడియో పరిసర ప్రాంతాల్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నిందితుడి చెరలో ఉన్న పిల్లలకు ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చాకచక్యంగా వ్యహరించారు. నిందితుడికి సర్దిచెప్పేందుకు పోలీసులు ప్రయత్నాలు చేసినప్పటికీ వారిని విడిచి పెట్టేందుకు అతడు నిరాకరించాడు. చిన్నారులకు హాని కలిగిస్తానని బెదిరించడంతో అప్రమత్తమైన రెస్క్యూ బృందం… బాత్‌రూమ్‌ ద్వారా లోనికి ప్రవేశించి 17 మంది చిన్నారులు సహా 19 మందిని సురక్షితంగా రక్షించింది. ఆ సమయంలోనే నిందితుడు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి ఎయిర్‌గన్‌, కొన్ని రసాయనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నిందితుణ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో రోహిత్‌ ఆర్య మానస్థిక స్థితి సరిగా లేదని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read : Harinarayan Singh: పదిసార్లు ఎమ్మెల్యేగా హరినారాయణ్‌ సింగ్‌ చరిత్ర సృష్టించేనా?
The post Children Hostage: ముంబైలో పిల్లల కిడ్నాప్‌ కథ సుఖాంతం ! appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

శెభాష్ లోకేష్.. మంచి మాట ఎవ్వరు చెప్పినా..శెభాష్ లోకేష్.. మంచి మాట ఎవ్వరు చెప్పినా..

మంచి మాట ఎవ్వరు చెప్పినా వినాలంటారు పెద్దలు. నాకు తోచింది మాత్రమే చేసుకుంటూ పోతాననే మోనార్క్ పోకడలు లేకుండా.. పెద్దా చిన్నా స్థాయీ భేదాలను ఎంచకుండా మంచి సలహా ఎవ్వరు చెప్పినా సరే.. విని, ఆచరించడానికి పూనుకున్నప్పుడే.. పాలకులు కూడా న్యాయం

Mid Day Meal: న్యూస్‌ పేపర్‌లో పిల్లలకు మధ్యాహ్న భోజనం !Mid Day Meal: న్యూస్‌ పేపర్‌లో పిల్లలకు మధ్యాహ్న భోజనం !

  మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు న్యూస్‌ పేపర్‌ ముక్కల్లో మధ్యాహ్న భోజనం తింటున్న ఓ వీడియోను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎక్స్‌లో షేర్‌ చేశారు. షియోపూర్‌ జిల్లా హల్పూర్‌ గ్రామంలోని ఓ మాధ్యమిక పాఠశాలలో ఈ ఘటన