hyderabadupdates.com Gallery Chirag Paswan: మాకు నవంబర్‌ 14న దీపావళి పండుగ – చిరాగ్‌ పాసవాన్‌

Chirag Paswan: మాకు నవంబర్‌ 14న దీపావళి పండుగ – చిరాగ్‌ పాసవాన్‌

Chirag Paswan: మాకు నవంబర్‌ 14న దీపావళి పండుగ – చిరాగ్‌ పాసవాన్‌ post thumbnail image

 
 
బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వాడీవేడిగా ఉంది. ఈ తరుణంలో లోక్‌ జన్‌శక్తి పార్టీ (రాంవిలాస్‌) చీఫ్ చిరాగ్ పాసవాన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము నవంబర్ 14న దీపావళి చేసుకుంటామని మీడియాతో వ్యాఖ్యానించారు.
 
‘‘ఎన్డీయేలో సీట్ల ఎంపిక, అభ్యర్థుల ఖరారు విషయంలో ఎన్ని ఊహాగానాలు వచ్చినా.. అన్నీ సజావుగా జరుగుతాయని నేను పదేపదే చెప్తున్నాను. మహాగఠ్‌బందన్ ఒక గందరగోళ కూటమి. చరిత్రాత్మక విజయం దిశగా ఎన్డీయే ముందుకువెళ్తోందని నేను ధీమాగా చెప్తున్నాను. ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ నేతృత్వంలో మేం ఎన్నికల్లో పోటీపడుతున్నాం. నాకు కూటమిలోని ఏ ఒక్క పార్టీతో ఒక్క శాతం వివాదం కూడా లేదు. నవంబర్ 14న మేం దీపావళి చేసుకుంటాం’’ అని పాసవాన్ విజయంపై ధీమా వ్యక్తంచేశారు.
బిహార్‌ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే (NDA) కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జేడీ(యూ) చెరో 101 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. 243 స్థానాలు ఉన్న అసెంబ్లీలో లోక్‌జన్‌ శక్తి (రాంవిలాస్‌) 29 చోట్ల, హిందుస్థాన్‌ అవాం మోర్చా (హెచ్‌ఏఎం) ఆరుచోట్ల, రాష్ట్రీయ లోక్‌మోర్చా (ఆర్‌ఎల్‌ఎం) ఆరుచోట్ల బరిలో దిగేలా సీట్ల సర్దుబాటు కుదిరిందని జేడీయూ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్‌కుమార్‌ ఝా, ఉప ముఖ్యమంత్రి సామ్రాట్‌ చౌధరీ (భాజపా), కేంద్ర మంత్రి చిరాగ్‌ పాస్వాన్‌ (ఎల్‌జేపీ-ఆర్‌) తమతమ ‘ఎక్స్‌’ ఖాతాల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే.
 
దీపావళి సందర్భంగా ఉద్యోగులకు 51 కార్లు
 
హరియాణాలో పంచకులా కేంద్రంగా నడుస్తున్న ఔషధ తయారీ సంస్థ ‘మిట్స్‌ నేచురా లిమిటెడ్‌’ యజమాని ఎం.కె.భాటియా దీపావళి సందర్భంగా ఎప్పటిలా తన ఉద్యోగులకు విశేష కానుకలు అందించారు. ఈ సారి 51 మందికి కొత్త కార్ల తాళాలు అందజేశారు. ఉద్యోగులు ఆనందంతో కార్ల ర్యాలీ నిర్వహించారు. భాటియా గత రెండేళ్లుగా దీపావళి సందర్భంగా ఉద్యోగులకు ఇలా కొత్త కార్లను కానుకగా ఇస్తున్నారు. ఈ ఏడాది ఆ సంఖ్య హాఫ్‌ సెంచరీ దాటింది. దీనిపై భాటియా మాట్లాడుతూ… ‘‘ఉద్యోగుల కష్టం, నిజాయతీ, నిబద్ధతే మిట్స్‌ నేచురా విజయానికి పునాది. బృంద స్ఫూర్తిని పెంపొందించి, అందరినీ ప్రోత్సహించేందుకే ఈ కానుకలు’’ అని చెప్పారు.
The post Chirag Paswan: మాకు నవంబర్‌ 14న దీపావళి పండుగ – చిరాగ్‌ పాసవాన్‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Minister Kolusu Parthasarathi: బాలకృష్ణపై జగన్ వ్యాఖ్యలు సరికాదు – మంత్రి పార్థసారథి Minister Kolusu Parthasarathi: బాలకృష్ణపై జగన్ వ్యాఖ్యలు సరికాదు – మంత్రి పార్థసారథి 

    వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొలుసు పార్థసారథి స్పందించారు. జగన్ మోహన్ రెడ్డి

ప్రశాంత్‌ వర్మకే ఫిక్స్‌!ప్రశాంత్‌ వర్మకే ఫిక్స్‌!

కన్నడ హీరో,  డైరెక్టర్ రిషబ్ శెట్టి ‘కాంతార చాప్టర్ 1’తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆయన నటనకు మరియు దర్శకుడిగా చూపిన ప్రతిష్టకు ప్రేక్షకులు చాలా మెచ్చుతున్నారు. ఈ సినిమా సంబంధిత పనులు పూర్తయిన తర్వాత రిషబ్ ప్రస్తుతం పూర్తి