hyderabadupdates.com Gallery CJI BR Gavai: పూర్తి సంతృప్తితో వెళ్తున్నా – సీజేఐ జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌

CJI BR Gavai: పూర్తి సంతృప్తితో వెళ్తున్నా – సీజేఐ జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌

CJI BR Gavai: పూర్తి సంతృప్తితో వెళ్తున్నా – సీజేఐ జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ post thumbnail image

 
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రజలకు తన వంతు సేవలు అందించానని, పూర్తి సంతృప్తితో పదవీ విరమణ చేయబోతున్నానని సీజేఐ జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ పేర్కొన్నారు. న్యాయవాదిగా, న్యాయమూర్తిగా నాలుగు దశాబ్దాల ఈ ప్రస్థానం తనకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. న్యాయరంగ విద్యారి్థగానే తన ప్రయాణానికి ము గింపు పలుకబోతున్నానని తెలిపారు. జస్టిస్‌ గవాయ్‌ ఈ నెల 23వ తేదీన పదవీ విరమణ చేయబోతున్నారు.
శుక్రవారం చివరి పని దినం పూర్తిచేసుకున్నారు. ఆనవాయితీ ప్రకారం సుప్రీంకోర్టులో సెర్మోనియల్‌ బెంచ్‌ నిర్వహించారు. జస్టిస్‌ గవాయ్‌తోపాటు బెంచ్‌ సభ్యులైన జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ కె.వినోద్‌ చంద్రన్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది జస్టిస్‌ గవాయ్‌కి ఘనంగా వీడ్కోలు పలికారు. పూర్తి సంతృప్తి, సంతోషంతో సుప్రీంకోర్టును వీడుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. దేశానికి తాను చేయగలిగినదంతా చేశానని ఉద్ఘాటించారు.
పదవిని సేవగానే భావించాలి
ప్రతి న్యాయమూర్తి, ప్రతి న్యాయవాది, ప్రతి ఒక్కరూ రాజ్యాంగ సూత్రాలకు లోబడి పనిచేయాలని జస్టిస్‌ గవాయ్‌ సూచించారు. సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వాన్ని భారత రాజ్యాంగం బోధిస్తోందని గుర్తుచేశారు. రాజ్యాంగానికి కట్టుబడి తన విధులను చిత్తశుద్ధితో నిర్వ ర్తించడానికి కృషి చేశానని పేర్కొన్నారు. 1985లో ‘స్కూల్‌ ఆఫ్‌ లా’లో ప్రవేశించానని, తద్వారా న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టానని గుర్తుచేసుకున్నారు. ఈరోజు న్యాయరంగ విద్యార్థిగానే పదవీ విరమణ చేస్తున్నానని తెలిపారు.
రికార్డుకెక్కిన జస్టిస్‌ గవాయ్
జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ ఈ ఏడాది మే 14న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఆరు నెలలకుపైగా సేవలందించారు. రెండో దళిత సీజేఐగా, మొదటి బౌద్ధ మతస్తుడైన సీజేఐగా ఆయన రికార్డుకెక్కారు. వీడ్కోలు కార్యక్రమంలో జస్టిస్‌ సూర్యకాంత్, అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, సీనియర్‌ లాయర్‌ కపిల్‌ సిబల్‌ తదితరులు మాట్లాడారు. జస్టిస్‌ గవాయ్‌ మహోన్నతమైన సేవలందించారని కొనియాడారు.
ఒక సామాన్యుడు నిరంతర కృషితో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని నిరూపించారని ప్రశంసించారు. సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన మరో వీడ్కోలు కార్యక్రమంలోనూ జస్టిస్‌ గవాయ్‌ పాల్గొన్నారు. షెడ్యూల్డ్‌ కులాల్లో(ఎస్సీ) క్రీమీలేయర్‌పై ఇచ్చిన తీర్పుతో సొంత సామాజికవర్గం నుంచి ఆగ్రహం ఎదుర్కొన్నానని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగాల్లో క్రీమీలేయర్‌ వర్గానికి రిజర్వేషన్లు కల్పించకూడదని తాను ఇచ్చిన తీర్పు ఎస్సీలో చాలామందికి నచ్చలేదని అన్నారు.
The post CJI BR Gavai: పూర్తి సంతృప్తితో వెళ్తున్నా – సీజేఐ జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బ తీసింది – పవన్Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బ తీసింది – పవన్

    గత టీటీడీ బోర్డు పరిపాలనా వైఫల్యం, అనైతిక చర్యలు తిరుమల పవిత్రతను దెబ్బ తీశాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆ నమ్మక ద్రోహం ప్రస్తుత టీటీడీ బోర్డుకు ఒక లోతైన పాఠంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

Trishul: గుజరాత్‌ తీరంలో త్రివిధ దళాల ‘త్రిశూల్‌’ విన్యాసాలుTrishul: గుజరాత్‌ తీరంలో త్రివిధ దళాల ‘త్రిశూల్‌’ విన్యాసాలు

    భారత త్రివిధ దళాలు సంయుక్తంగా తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాయి. ఎక్సర్‌సైజ్‌ త్రిశూల్‌ పేరిట భారత సైన్యం, నావికా దళం, వైమానిక దళం గురువారం గుజరాత్‌ లోని సౌరాష్ట్ర సముద్ర తీరంలో కలిసికట్టుగా విన్యాసాలు నిర్వహించాయి. దాదాపు గంటపాటు

Minister Kishanreddy: వాదనలు వినిపించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం – కిషన్‌రెడ్డిMinister Kishanreddy: వాదనలు వినిపించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం – కిషన్‌రెడ్డి

    బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు వినిపించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ‘‘ కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి ఉన్నంత మాత్రాన రిజర్వేషన్ల విషయంలో ఏం చేయగలడు. సుప్రీంకోర్టు తీర్పునకు