hyderabadupdates.com Gallery CJI BR Gavai: పూర్తి సంతృప్తితో వెళ్తున్నా – సీజేఐ జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌

CJI BR Gavai: పూర్తి సంతృప్తితో వెళ్తున్నా – సీజేఐ జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌

CJI BR Gavai: పూర్తి సంతృప్తితో వెళ్తున్నా – సీజేఐ జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ post thumbnail image

 
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రజలకు తన వంతు సేవలు అందించానని, పూర్తి సంతృప్తితో పదవీ విరమణ చేయబోతున్నానని సీజేఐ జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ పేర్కొన్నారు. న్యాయవాదిగా, న్యాయమూర్తిగా నాలుగు దశాబ్దాల ఈ ప్రస్థానం తనకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. న్యాయరంగ విద్యారి్థగానే తన ప్రయాణానికి ము గింపు పలుకబోతున్నానని తెలిపారు. జస్టిస్‌ గవాయ్‌ ఈ నెల 23వ తేదీన పదవీ విరమణ చేయబోతున్నారు.
శుక్రవారం చివరి పని దినం పూర్తిచేసుకున్నారు. ఆనవాయితీ ప్రకారం సుప్రీంకోర్టులో సెర్మోనియల్‌ బెంచ్‌ నిర్వహించారు. జస్టిస్‌ గవాయ్‌తోపాటు బెంచ్‌ సభ్యులైన జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ కె.వినోద్‌ చంద్రన్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది జస్టిస్‌ గవాయ్‌కి ఘనంగా వీడ్కోలు పలికారు. పూర్తి సంతృప్తి, సంతోషంతో సుప్రీంకోర్టును వీడుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. దేశానికి తాను చేయగలిగినదంతా చేశానని ఉద్ఘాటించారు.
పదవిని సేవగానే భావించాలి
ప్రతి న్యాయమూర్తి, ప్రతి న్యాయవాది, ప్రతి ఒక్కరూ రాజ్యాంగ సూత్రాలకు లోబడి పనిచేయాలని జస్టిస్‌ గవాయ్‌ సూచించారు. సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వాన్ని భారత రాజ్యాంగం బోధిస్తోందని గుర్తుచేశారు. రాజ్యాంగానికి కట్టుబడి తన విధులను చిత్తశుద్ధితో నిర్వ ర్తించడానికి కృషి చేశానని పేర్కొన్నారు. 1985లో ‘స్కూల్‌ ఆఫ్‌ లా’లో ప్రవేశించానని, తద్వారా న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టానని గుర్తుచేసుకున్నారు. ఈరోజు న్యాయరంగ విద్యార్థిగానే పదవీ విరమణ చేస్తున్నానని తెలిపారు.
రికార్డుకెక్కిన జస్టిస్‌ గవాయ్
జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ ఈ ఏడాది మే 14న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఆరు నెలలకుపైగా సేవలందించారు. రెండో దళిత సీజేఐగా, మొదటి బౌద్ధ మతస్తుడైన సీజేఐగా ఆయన రికార్డుకెక్కారు. వీడ్కోలు కార్యక్రమంలో జస్టిస్‌ సూర్యకాంత్, అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, సీనియర్‌ లాయర్‌ కపిల్‌ సిబల్‌ తదితరులు మాట్లాడారు. జస్టిస్‌ గవాయ్‌ మహోన్నతమైన సేవలందించారని కొనియాడారు.
ఒక సామాన్యుడు నిరంతర కృషితో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని నిరూపించారని ప్రశంసించారు. సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన మరో వీడ్కోలు కార్యక్రమంలోనూ జస్టిస్‌ గవాయ్‌ పాల్గొన్నారు. షెడ్యూల్డ్‌ కులాల్లో(ఎస్సీ) క్రీమీలేయర్‌పై ఇచ్చిన తీర్పుతో సొంత సామాజికవర్గం నుంచి ఆగ్రహం ఎదుర్కొన్నానని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగాల్లో క్రీమీలేయర్‌ వర్గానికి రిజర్వేషన్లు కల్పించకూడదని తాను ఇచ్చిన తీర్పు ఎస్సీలో చాలామందికి నచ్చలేదని అన్నారు.
The post CJI BR Gavai: పూర్తి సంతృప్తితో వెళ్తున్నా – సీజేఐ జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CM Revanth Reddy: తెలంగాణా అభివృద్ధి నిరోధకులు కిషన్‌రెడ్డి, కేటీఆర్ – సీఎం రేవంత్CM Revanth Reddy: తెలంగాణా అభివృద్ధి నిరోధకులు కిషన్‌రెడ్డి, కేటీఆర్ – సీఎం రేవంత్

    ‘కేంద్రానికి రూ.43 వేల కోట్లతో మెట్రో విస్తరణ ప్రతిపాదనలను ఇస్తే కిషన్‌రెడ్డి, కేటీఆర్‌ అడ్డుకున్నారు. రీజినల్‌ రింగురోడ్డు, 20 టీఎంసీల గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టులకు సైతం అడ్డుపడుతున్నారు. వీళ్లిద్దరి సమన్వయం ప్రాజెక్టులను ఆపడానికా? తెలంగాణపై ఎందుకింత కక్ష?

MLA Harishrao: జోర్డాన్‌లో చిక్కుకున్న తెలంగాణ కార్మికులతో మాట్లాడిన హరీశ్‌రావుMLA Harishrao: జోర్డాన్‌లో చిక్కుకున్న తెలంగాణ కార్మికులతో మాట్లాడిన హరీశ్‌రావు

  ఉపాధి కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్లి జోర్డాన్‌లో చిక్కుకున్న గల్ఫ్ కార్మికుల తో ఫోన్‌లో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు మాట్లాడారు. ఆందోళన పడకండి… బీఆర్ఎస్ అండగా ఉంటుందని కార్మికులకు ఆయన ధైర్యం చెప్పారు. జోర్డాన్‌లో

Kerala Government Honours Mohanlal for Dadasaheb Phalke AwardKerala Government Honours Mohanlal for Dadasaheb Phalke Award

Veteran actor Mohanlal was felicitated by the Kerala government in a grand ceremony held at the Central Stadium in Thiruvananthapuram, following his recent recognition with the prestigious Dadasaheb Phalke Award.