hyderabadupdates.com Gallery Cloud Seeding: ఢిల్లీలో క్లౌడ్‌ సీడింగ్‌ ఫెయిల్‌

Cloud Seeding: ఢిల్లీలో క్లౌడ్‌ సీడింగ్‌ ఫెయిల్‌

Cloud Seeding: ఢిల్లీలో క్లౌడ్‌ సీడింగ్‌ ఫెయిల్‌ post thumbnail image

Cloud Seeding : ఢిల్లీలో క్లౌడ్‌ సీడింగ్‌ కు బ్రేక్‌ పడింది. కాలుష్య రాజధానిగా మారిన ఢిల్లీలో వాయు కాలుష్య భూతాన్ని తరిమికొట్టాలని రేఖా గుప్తా సారథ్యంలోని ఢిల్లీ (Delhi) రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన క్లౌడ్‌ సీడింగ్‌ (Cloud Seeding) ఫెయిల్‌ అయ్యింది. మేఘాలను చల్లబరిచి వర్షింపజేసే రసాయనాలను చల్లే విమానాలను రంగంలోకి దింపింది. ఐఐటీ–కాన్పూర్‌ సహకారం, సమన్వయంతో మంగళవారం రాజధానిలో మేఘావృత గగనతలంలో మేఘమథన క్రతువుకు శ్రీకారం చుట్టింది. మరికొన్ని రోజుల పాటు ఈ విమానాలు రసాయనాలను వెదజల్లే ప్రక్రియ కొనసాగుతుందని కూడా ప్రభుత్వం వెల్లడించింది. అయితే, మేఘాల్లో తగినంత తేమ లేకపోవడంతో వర్షం కురవలేదు. దీంతో ఈ ప్రక్రియను రాష్ట ప్రభుత్వం నిలిపివేసింది.
Cloud Seeding Failure in Delhi
ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. వర్షించని మేఘాల నుంచి చినుకులు కురిసేలా చేసే ఈ ప్రక్రియను సాధారణంగా క్లౌడ్‌–సీడింగ్‌ అంటారు. ఇందుకోసం ప్రభుత్వం సుమారు రూ.3.21 కోట్లు కేటాయించింది. అయితే, ఇది వాయు కాలుష్యానికి తాత్కాలిక ఉపశమనంగా పనిచేస్తుందని, ఖరీదైన ఈ ప్రక్రియను శాశ్వత పరిష్కారంగా భావించకూడదని పలువురు పర్యావరణవేత్తలు అంటున్నారు. ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ మనీంద్ర అగర్వాల్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ… క్లౌడ్ సీడింగ్ ప్రయోగం ద్వారా కృత్రిమ వర్షం రాలేదు కానీ భవిష్యత్తు ప్రయత్నాలకు ముఖ్యమైన సమాచారం లభించిందని తెలిపారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన 15 మానిటరింగ్ స్టేషన్ల ద్వారా సేకరించిన డేటా ప్రకారం, PM 2.5, PM 10 మలినాల స్థాయిల్లో 6–10 శాతం తగ్గుదల కనిపించిందని ఆయన చెప్పారు.
కాగా, ఢిల్లీ స్థానిక ప్రాంతాలను కృత్రిమ వర్షాలతో తడిసి ముద్దచేసేందుకు ప్రత్యేక విమానాలు మంగళవారం(అక్టోబర్‌ 28) కాన్పూర్‌ నుంచి బయల్దేరాయి. ఢిల్లీలోని బురారీ, నార్త్‌ కరోల్‌ బాగ్, మయూర్‌ విహార్‌ వంటి ప్రాంతాల మీది మేఘాలపై ఈ విమానాలు సిల్వర్‌ అయోడైడ్, సోడియం క్లోరైడ్‌ మిశ్రమాలను చల్లాయి. దాదాపు 20 శాతం తేమ ఉన్న మేఘాలను కృత్రిమ వర్షాల కోసం ఎంపిక చేశారు. సెస్నా రకం విమానం ఒక్కోటి 2–2.5 కేజీల బరువైన రసాయన మిశ్రమాన్ని వేర్వేరు చోట్ల వెదజల్లింది. దాదాపు 8 ప్రాంతాల్లో క్లౌడ్‌–సీడింగ్‌ను చేపట్టారు.
Also Read : Donald Trump: ప్రధాని మోదీపై ట్రంప్‌ ప్రశంసల వర్షం
The post Cloud Seeding: ఢిల్లీలో క్లౌడ్‌ సీడింగ్‌ ఫెయిల్‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

DGP Shivadhar Reddy: తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్ట్ అగ్రనేత బండి ప్రకాశ్‌ సరెండర్‌DGP Shivadhar Reddy: తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్ట్ అగ్రనేత బండి ప్రకాశ్‌ సరెండర్‌

DGP Shivadhar Reddy : మావోయిస్ట్ పార్టీ కీలక నేత బండి ప్రకాష్ తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి (DGP Shivadhar Reddy) సమక్షంలో లొంగిపోయారు. ఆశన్న లొంగుబాటు సమయంలోనే ప్రకాశ్‌ కూడా లొంగిపోతారనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. బండి ప్రకాశ్‌

CM Siddaramaiah: ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి దంపతులపై సీఎం ఆగ్రహంCM Siddaramaiah: ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి దంపతులపై సీఎం ఆగ్రహం

CM Siddaramaiah : కర్ణాటకలో జరుగుతున్న సోషల్ అండ్ ఎడ్యుకేషన్ సర్వే కు దూరంగా ఉండాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి, రచయిత్రి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధామూర్తి నిర్ణయం తీసుకోవడంపై ముఖ్యమంత్రి సిద్ధారామయ్య (CM Siddaramaiah) ఘాటుగా స్పందించారు.

Bus Accident: కర్నూలులో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు దగ్దం ! 20 మందికి పైగా మృతి !Bus Accident: కర్నూలులో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు దగ్దం ! 20 మందికి పైగా మృతి !

Bus Accident : కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది (Bus Accident). హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. కర్నూలు శివారు చిన్నటేకూరులో జాతీయ రహదారి 44పై శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన