hyderabadupdates.com Gallery CM Chandrababu: మొంథా తుపానుతో ఏపీకి రూ.5,265 కోట్ల నష్టం

CM Chandrababu: మొంథా తుపానుతో ఏపీకి రూ.5,265 కోట్ల నష్టం

CM Chandrababu: మొంథా తుపానుతో ఏపీకి రూ.5,265 కోట్ల నష్టం post thumbnail image

 
 
‘మొంథా’ తుపాను వల్ల రాష్ట్రానికి రూ.5,265 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వ్యవసాయ రంగానికి రూ.829 కోట్లు, ఆర్‌అండ్‌బీకి రూ.2,079 కోట్ల మేర నష్టం వాటిల్లిందని చెప్పారు. తుపాను వల్ల ఎవరూ ప్రాణాలు కోల్పోలేదన్న ఆయన.. 120 పశువులు మృత్యువాత పడినట్లు పేర్కొన్నారు. నీటిపారుదల శాఖకు సంబంధించి ఈసారి నష్టం తక్కువే ఉందన్నారు. తుపాను నష్టంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నష్టం వివరాలను అధికారులు ఆయనకు వివరించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. మొంథా తుపాను బీభత్సాన్ని ముందుగానే అంచనా వేశామని, అందుకే నష్టం తగ్గిందన్నారు.
‘‘ప్రతి కుటుంబాన్ని, ఇంటినీ జియోట్యాగింగ్‌ చేయగలిగాం. తుపాను వల్ల మారుతున్న పరిణామాలకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకున్నాం. గతంలో విద్యుత్‌ సరఫరా ఆగితే 10 గంటల వరకు వచ్చేది కాదు. ప్రస్తుతం విద్యుత్‌ సరఫరా ఆగినా 3 గంటల్లోనే పునరుద్ధరణ జరిగింది. అందరూ నిబద్ధతతో పని చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఓ వైపు వర్షం పడుతున్నా.. కూలిన చెట్లను ఎప్పటికప్పుడు తొలగించి ఇబ్బందులు లేకుండా చేశారు. గతంలో చెట్లు కూలితే.. తొలగించేందుకు వారం పట్టేది. ప్రకృతి విపత్తులను ఎవరూ ఆపలేరు.. ముందస్తు చర్యల వల్ల నష్టాన్ని తగ్గించవచ్చు’’ అని చంద్రబాబు తెలిపారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో రోడ్డుప్రమాదం ! 16 మంది శ్రీకాకుళం జిల్లావాసులకు గాయాలు !
 
ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 16 మందికి గాయాలయ్యాయి. వారణాసి నుంచి అయోధ్య దర్శనానికి వెళ్తుండగా జౌన్‌పుర్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను కోటబొమ్మాళి, బ్రాహ్మణతర్ల, పలాస ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. స్థానికులు వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈమేరకు సమాచారం అందుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు.. బాధితులను ఫోన్‌లో పరామర్శించారు. జౌన్‌పుర్‌ కలెక్టర్‌, వారణాసి విమానాశ్రయ అధికారులు, వైద్యులతో మాట్లాడారు. బాధితులకు అన్ని విధాలా అండగా ఉండాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రమాదం ఎలా జరిగిందో వివరాలు తెలియాల్సి ఉంది.
 
ఉత్తరప్రదేశ్ ప్రమాదంపై స్పందించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
 
ఉత్తరప్రదేశ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన శ్రీకాకుళం జిల్లా వాసుల పరిస్థితిపై తక్షణమే స్పందించి వారికి మెరుగైన వైద్యం అందేలా చొరవ చూపారు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జాన్పుర్ జాతీయ రహదారి వద్ద గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా పలాస, కోటబొమ్మాళి, బ్రాహ్మణతర్ల ప్రాంతాలకి చెందిన పదహారు మంది వాసులు గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తక్షణ చర్యలు ప్రారంభించారు.గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి, జాన్పూర్ కలెక్టర్, వారణాశి అధికారులకు మరియు సంబంధిత ఆసుపత్రి వైద్యులకు ఎయిర్పోర్ట్ అధారిటీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డిల్లీ లో ఉన్న రామ్మోహన్ నాయుడు.. క్షతగాత్రుల ఆరోగ్యం పట్ల స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదించడంతో పాటు.. క్షతగాత్రులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. అత్యవసర వైద్య సహాయం అందించడంతో గాయపడిన వారి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. క్షతగాత్రులను సురక్షితంగా స్వస్థలాలకు తరలించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు.
The post CM Chandrababu: మొంథా తుపానుతో ఏపీకి రూ.5,265 కోట్ల నష్టం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Konda Surekha: సీఎం రేవంత్‌ రెడ్డితో కొండా దంపతుల భేటీKonda Surekha: సీఎం రేవంత్‌ రెడ్డితో కొండా దంపతుల భేటీ

Konda Surekha : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తో మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీ భేటీ అయింది. ఈ దీపావళి పండుగ సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసానికి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి వెళ్లారు. పీసీసీ

Mahagathbandhan: ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం – మహాగఠ్‌బంధన్‌ మ్యానిఫెస్టోMahagathbandhan: ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం – మహాగఠ్‌బంధన్‌ మ్యానిఫెస్టో

Mahagathbandhan: బిహార్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో విపక్ష కూటమి మహాగఠ్‌బంధన్‌ (Mahagathbandhan) మ్యానిఫెస్టో విడుదల చేసింది. ‘తేజస్వీ ప్రతిజ్ఞా ప్రణ్‌’ పేరుతో

Indigo: ఇండిగో విమానంలో గుండెపోటుతో వ్యక్తి మృతిIndigo: ఇండిగో విమానంలో గుండెపోటుతో వ్యక్తి మృతి

Indigo : జెడ్డా నుంచి శంషాబాద్‌ వస్తున్న విమానంలో ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. జెడ్డా నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వస్తున్న 6ఈ68 ఇండిగో విమానం(6E68 Indigo flight)లో నగరంలోని అంబర్‌పేటకు చెందిన మహ్మద్‌ ఖాసీం(79)కు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. మరికొద్ది