hyderabadupdates.com Gallery CM Chandrababu: విశాఖను ముంబై తరహాలో అభివృద్ధి చేస్తాం – సీఎం చంద్రబాబు

CM Chandrababu: విశాఖను ముంబై తరహాలో అభివృద్ధి చేస్తాం – సీఎం చంద్రబాబు

CM Chandrababu: విశాఖను ముంబై తరహాలో అభివృద్ధి చేస్తాం – సీఎం చంద్రబాబు post thumbnail image

 
 
ముంబయి తరహాలో విశాఖపట్నం అభివృద్ధి చెందుతోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గూగుల్‌, టీసీఎస్‌ వంటి దిగ్గజ సంస్థల రాకతో విశాఖ నగరం ఐటీ హబ్‌ గా మారుతోందని చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ కు చాలా చేసామని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే… దానిని మూతపడకుండా చేయగలిగామని చెప్పారు. ఏపీ కేబినెట్‌ భేటీ‌లో ఆయన మాట్లాడారు. స్టీల్ ప్లాంట్‌‌ను నష్టాల నుంచి బయటకు తీసుకురాగలిగామని పేర్కొన్నారు. వైజాగ్‌కు రైల్వే జోన్, గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టులను తీసుకువచ్చామని పేర్కొన్నారు. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు.
వెస్ట్‌ లో ముంబై… ఈస్ట్‌ లో విశాఖ
ఆర్సెలార్‌ మిత్తల్‌ ప్లాంట్‌కు త్వరలో శంకుస్థాపన చేయబోతున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. విశాఖను ముంబై లాగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. పంచాయితీ రాజ్‌లో పంచాయతీలు రేషనలైజేషన్ చేసి రూరల్, అర్బన్ పంచాయితీలుగా చేయాలని తెలిపారు. 2028 నాటికి వైజాగ్ దేశంలో ఒక ప్రత్యేక సిటీగా ఉండబోతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఐటీ రంగంలో లక్షలాది ఉద్యోగాలు రాబోతున్నాయని పేర్కొన్నారు. వెస్ట్‌లో ముంబై తరహాలో ఈస్ట్‌లో విశాఖ అభివృద్ధి చెందబోతుందన్నారు. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్‌లో 4 లక్షల 70 వేల మంది ఆంధ్రాలో పని చేస్తున్నారని తెలిపారు. దీనిని 10 లక్షలకు పెంచాలని అధికారులకు చెప్పినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.
 
ఈ సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మంత్రులు, సెక్రటరీలకు చెప్పినప్పటికీ శాఖను నడిపించాల్సిన బాధ్యత మంత్రులదే అని తెలిపారు. శాఖలో పని చేయకపోతే వారిని పిలిచి మందలించాల్సింది మంత్రులే అని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాల్సింది మంత్రులే కానీ అధికారులు కాదు అనే విషయం గుర్తు పెట్టుకోవాలని సీఎం చెప్పారు. తన 15 ఏళ్ల సీఎం ప్రస్థానంలో ఎప్పుడూ ఇన్ని పెట్టుబడులు రాలేదని చంద్రబాబు వివరించారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. గూగుల్ డేటా సెంటర్ మనకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెద్ద ఎత్తున రావడంపై పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.
 
నందగోకులంలో లైఫ్‌ స్కూల్‌ ప్రారంభించిన చంద్రబాబు
 
నందగోకులంలో పశువుల పరిరక్షణ, లైఫ్‌ స్కూల్, ఇథనాల్ ప్లాంట్‌ను ప్రారంభించడం తనకు కొత్త ఎక్స్‌పీరియన్స్‌ అని చంద్రబాబు తెలిపారు. 15,000 టన్నుల ధాన్యం నూకలతో ఇథనాల్ తయారు చేస్తున్నారని పేర్కొన్నారు. దీని ద్వారా రైతులకి ఆదాయం పెరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు. సమాజంలో పైకి వచ్చిన ప్రతి ఒక్కరూ సమాజానికి తిరిగి ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా ఈదగాలిలో విశ్వసముద్ర గ్రూప్ ఆధ్వర్యంలో నిర్మించిన నందగోకులం లైఫ్ స్కూల్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా తరగతి గదులను పరిశీలించి… కంప్యూటర్ ల్యాబ్ లో విద్యార్థులతో ముచ్చటించారు సీఎం. అనంతరం విశ్వసముద్ర బయో ఎనర్జీ ఇథనాల్‌ ప్రాంట్‌ను సందర్శించారు. అలాగే… విశ్వసముద్ర గ్రూప్‌ ప్రాజెక్ట్‌లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.
 
ప్రకృతి పరిరక్షణకి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలని అందిపుచ్చుకున్నారని చెప్పారు. ఎద్దులతో విద్యుత్తు ఉత్పత్తి చేయడం ఎక్కడా లేదని చెప్పారు. పవర్ ఆఫ్ బుల్స్ చాటుతూ.. 5 యూనిట్లు విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారని చంద్రబాబు వివరించారు. నందగోకులం సేవ్ ది బుల్ అనే నినాదం ఎంతో విశిష్టమైందని చంద్రబాబు గుర్తు చేశారు. నందగోకులం లైఫ్ స్కూల్లో పేద పిల్లలకి చదువులు చెబుతున్నారని చెప్పారు. సామాన్య పిల్లలని అనితరసాధ్య వ్యక్తులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయడం గొప్ప విషయమని కొనియాడారు. సమాజం వల్ల పైకొచ్చిన వారు సమాజానికి డబ్బు ఇవ్వడం కాదు. పిల్లలకి అన్ని సదుపాయాలు కల్పించి, బెస్ట్ సిటిజన్స్‌లా తయారు చేయాలని ఆయన సూచించారు.
 
P4 మోడల్లో చింతా శశిధర్ ఫౌండేషన్ ది బెస్ట్ స్కూల్ నడుపుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. దగదర్తిలో ఎయిర్ పోర్టు, కృష్ణపట్నంకి సీ పోర్టు, నేషనల్ హైవే, రైల్వే కనెక్టవిటీలు వస్తాయని స్పష్టం చేశారు. 2047లో ప్రపంచంలోనే మనదేశం ఒక శక్తిగా ఎదగబోతుందని ధీమా వ్యక్తం చేశారు. అందులో మన ఏపీ మరింత శక్తిగా ఎదుగుతుందని వివరించారు. విశాఖలో రూ.87వేల కోట్లతో ఆర్టిఫిషియల్ సెంటర్ రాబోతుందని చెప్పారు. పేదలని బయటకి తీసుకువచ్చే బాధ్యత అందరూ తీసుకోవాలని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
The post CM Chandrababu: విశాఖను ముంబై తరహాలో అభివృద్ధి చేస్తాం – సీఎం చంద్రబాబు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Yatindra Siddaramaiah: మా నాన్న రాజకీయంగా చివరి దశలో ఉన్నారు – యతీంద్ర సిద్ధరామయ్యYatindra Siddaramaiah: మా నాన్న రాజకీయంగా చివరి దశలో ఉన్నారు – యతీంద్ర సిద్ధరామయ్య

Yatindra Siddaramaiah : కర్ణాటకలో నాయకత్వ మార్పుపై జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్న సమయంలో సీఎం సిద్దరామయ్య కుమారుడు, ఎమ్మెల్సీ యతీంద్ర సిద్దరామయ్య (Yatindra Siddaramaiah) సంచలన వ్యాఖ్యలు చేసారు. మా నాన్న, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రస్తుతం రాజకీయ జీవిత చరమాంకంలో

Prashant Kishore: ప్రశాంత్ కిశోర్‌పై కోడ్ ఉల్లంఘన కేసుPrashant Kishore: ప్రశాంత్ కిశోర్‌పై కోడ్ ఉల్లంఘన కేసు

    ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణపై జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ పై వైశాలి జిల్లాలోని రఘోపూర్ లో కేసు నమోదైంది. రఘోపూర్ ప్రాంతంలో ప్రశాంత్ కిషోర్ శనివారంనాడు ఎన్నికల ప్రచారం ప్రారంభించిన అనంతరం ఆయనపై