hyderabadupdates.com Gallery CM Chandrababu: సీఐఐ సదస్సుకు విశాఖ చేరుకున్న సీఎం చంద్రబాబు

CM Chandrababu: సీఐఐ సదస్సుకు విశాఖ చేరుకున్న సీఎం చంద్రబాబు

CM Chandrababu: సీఐఐ సదస్సుకు విశాఖ చేరుకున్న సీఎం చంద్రబాబు post thumbnail image

 
 
ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖ వేదికగా జరగనున్న సీఐఐ సమ్మిట్ లో పాల్గొనడానికి ఏపీ సీఎం చంద్రబాబు విశాఖ చేరుకున్నారు. వాయుమార్గం ద్వారా విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాష్ట్ర ముఖ్య‌మంత్రికి స్థానిక నేత‌లు మరియు అధికారులు ఘ‌న స్వాగ‌తం పలికారు. ముఖ్యమంత్రి కి ఘన స్వాగతం పలికిన వారిలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి డా.డోలా శ్రీ‌ బాల వీరాంజనేయ స్వామి, హోం శాఖామంత్రి వంగలపూడి అనిత, ఎక్సైజ్ శాఖ మాత్యులు కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యులు ఎమ్. శ్రీ భరత్, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, ప్ర‌భుత్వ విప్ గ‌ణ‌బాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు, శాసనసభ్యులు పల్లా శ్రీనివాస‌రావు, బండారు సత్యనారాయణమూర్తి, వంశీకృష్ణ శ్రీనివాస్, వెలగపూడి రామకృష్ణ బాబు, గంటా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్, మరియు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, పోలీస్ క‌మిష‌న‌ర్ శంఖ‌బ్ర‌త బాగ్చీ, విఎంఆర్డిఏ చైర్మన్ ప్రణవ గోపాల్ ఇతర అధికారులు. పుష్పగుచ్చాలు అంద‌జేసి ఘన స్వాగ‌తం ప‌లికారు.
సీఐఐ సమ్మిట్ నేపథ్యంలో విశాఖ నగరం కొత్త శోభను సంతరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న భాగస్వామ్య పెట్టుబడుల సదస్సు కోసం నగరం ముస్తాబైంది. విశాఖలోని ప్రధాన మార్గాలన్నీ విద్యుత్తు దీప కాంతులతో కొత్తదనాన్ని సంతరించుకున్నాయి. కూడళ్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆకర్షణీయ ఫౌంటెన్‌లు, ఇతర అలంకరణ వస్తువులు కనువిందు చేస్తున్నాయి. విద్యుద్దీపాలలో బీచ్ రోడ్ అంతా మెరుస్తోంది. భాగస్వామ్య సదస్సు కోసం వచ్చే ప్రతినిధుల కోసం ఇప్పటికే హోటల్ గదులు సిద్ధం చేశారు. విదేశీ అతిథులు ప్రత్యేకంగా బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు. గూగుల్ డేటా సెంటర్ రాక సూచికగా వైజాగ్‌లో చివరి G అక్షరం పెద్దగా గూగుల్ ఫాంట్‌తో ప్రతి దగ్గర దర్శనమిస్తూ అందరిని అకట్టుకుంటోంది.
ఈ నెల 14, 15 తేదీల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ మైదానంలో జరగనున్న ఈ సదస్సుకు ఏర్పాట్లు తది దశకు వచ్చాయి. 40 దేశాల నుంచి 3వేల మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రధాన వేదికతోపాటు, ప్రత్యేక ప్రాంగణాలు సిద్ధం చేస్తున్నారు. సీఎంతోపాటు గవర్నర్, ఉప రాష్ట్రపతి ఆయా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉండడంతో భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
 
చంద్రబాబుతో భేటీ అయిన భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కల్యాణి
ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖ వేదికగా జరగనున్న సీఐఐ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించడానికి ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుతో భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కల్యాణి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో ఉన్న వివిధ అవకాశాలను భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కల్యాణికి ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై ముఖ్యమంత్రితో ఆయన చర్చించారు. రాష్ట్రంలో షిప్ బిల్డింగ్, ఎలక్ట్రానిక్స్ రంగంలో అడ్వాన్స్ ఉత్పత్తులపై భారత్ ఫోర్జ్ సంస్థ వైస్ చైర్మెన్ ఆశక్తి వ్యక్తం చేసారు. పర్యాటక రంగంలో గండికోట వద్ద రివర్ క్రూయిజ్ ప్రాజెక్టును చేపట్టేందుకు ఆసక్తి చూపారు. షిప్ బిల్డింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ లో విస్తృతమైన అవకాశాలను వినియోగించు కోవాలని సీఎం స్పష్టం చేసారు. గండికోట, పాపికొండలు, అరకు వ్యాలీ లాంటి చోట టూరిజం ప్రాజెక్టులు చేపట్టేందుకు ఆస్కారం ఉందని వెల్లడించారు. గ్లోబల్ బ్రాండ్ గా అరకు కాఫీ మారిందని భారత్ ఫోర్జ్ వైస్ ఛైర్మన్ కు ముఖ్యమంత్రి వివరించారు.
 
మరోవైపు 30వ సిఐఐ భాగస్వామ్య సదస్సు కు జీవీఎంసీ విస్తృత ఏర్పాట్లు చేసిందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ బుధవారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. పరిశుభ్రత ప్రాధాన్యత దిశగా దేశంలోనే మొట్టమొదటి జీరో వేస్ట్ మోడల్ కార్యక్రమంగా ఈ సదస్సు నిర్వహించబడుతుందన్నారు. దేశ, విదేశాల నుండి పారిశ్రామికవేత్తలు, అతిథులు, ప్రతినిధులు ఈ పెట్టుబడుల సదస్సుకు విచ్చేయుచున్నందున వారిని ఆకట్టుకునేలా విశాఖ నగరాన్ని దీర్ఘకాలిక పద్ధతిలో మరింత అభివృద్ధి పరుస్తూ, సుందరీకరణ పనులతో తీర్చిదిద్దడం జరిగినదన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిత్యం స్వచ్ఛతకు, పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తున్నారని, ఆ దిశగా ఆయన ఆదేశాల మేరకు విశాఖ నగరంలో ప్రతిష్టాత్మకంగా జరుగుచున్న ఈ సదస్సును “జీరో వేస్ట్ మోడల్ ” కార్యక్రమంగా శ్రీకారం చుట్టి దేశంలోనే మొట్టమొదటి కార్యక్రమంగా చేపడుతున్నామని, ఉత్పత్తి అయ్యే అన్ని రకాల వ్యర్థాలను 100 శాతం రీసైకిల్ చేసి పునర్వినియోగం చేయనున్నామని, అలాగే ప్రాంగణం సమీపంలో ఆన్ సైట్ కంపోస్ట్ యూనిట్ ను కూడా ఏర్పాటు చేస్తున్నామని అలాగే ఈ కార్యక్రమం దేశంలో మొట్టమొదటి కార్యక్రమంగా విశాఖ నగరంలో జరుగుచున్నదని, ఇకపై విశాఖ నగరంలో జరుగబోయే అన్ని కార్యక్రమాలు జీరో వేస్ట్ కార్యక్రమాలుగా ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.
 
 
The post CM Chandrababu: సీఐఐ సదస్సుకు విశాఖ చేరుకున్న సీఎం చంద్రబాబు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

టాక్సిక్ సెన్సేష‌న్ గీతూ మోహ‌న్ దాస్ వైరల్టాక్సిక్ సెన్సేష‌న్ గీతూ మోహ‌న్ దాస్ వైరల్

బెంగ‌ళూరు : ఎవ‌రీ గీతూ మోహ‌న్ దాస్ అనుకున్నారా. త‌ను ఇప్పుడు ఇంట‌ర్నెట్ ను షేక్ చేస్తోంది. సోష‌ల్ మీడియాలో టాప్ లో కొన‌సాగుతోంది. దీనికి కార‌ణం త‌ను పాన్ ఇండియా స్టార్ హీరో య‌శ్ తో మూవీ తీస్తోంది. ఆ

Indian Navy: ఆపరేషన్‌ సిందూర్‌పై నేవీ ‘కసమ్‌ సిందూర్‌కి’ పాటIndian Navy: ఆపరేషన్‌ సిందూర్‌పై నేవీ ‘కసమ్‌ సిందూర్‌కి’ పాట

Indian Navy : ప్రధాని నరేంద్రమోదీ సోమవారం గోవా తీరంలో నౌకాదళ సిబ్బందితో దీపావళి వేడుకలు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నౌకాదళ సిబ్బంది ఆపరేషన్‌ సిందూర్‌పై రాసిన ఓ పాటను ప్రధాని ఎదుట పాడారు. దానికి సంబంధించిన వీడియోను