hyderabadupdates.com Gallery CM Chandrababu: డేటా ఆధారిత పాలనసై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం

CM Chandrababu: డేటా ఆధారిత పాలనసై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం

CM Chandrababu: డేటా ఆధారిత పాలనసై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం post thumbnail image

 
డేటా డ్రైవెన్‌ గవర్నెన్స్‌పై సీఎం చంద్రబాబు నాయుడు గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలు పాల్గొనగా… జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుని పౌరులకు సుపరిపాలన అందించాలని అన్నారు. అదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని.. దానికి అనుగుణంగానే విజన్ ప్రణాళికలను రూపొందించామని వెల్లడించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే లక్ష్యం కావాలని సూచించారు. గ్రామ సచివాలయాన్ని విజన్ యూనిట్‌గా మార్చుకుని సమర్ధంగా ఆ విభాగాన్ని వినియోగించుకుందామని అధికారులకు తెలిపారు. అంతా కలిసి కట్టుగా పనిచేసి ఇటీవల వచ్చిన తుఫానును టెక్నాలజీ వినియోగంతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని బాగా తగ్గించగలిగామని సీఎం అన్నారు.
 
రాష్ట్రస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకూ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసి ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించగలిగామన్నారు. డేటా ఆధారిత పాలన అనేది ఇప్పుడు అత్యంత కీలకమైన అంశంగా మారిందని చెప్పుకొచ్చారు. క్వాంటం కంప్యూటర్‌ను వచ్చే జనవరి నుంచే అమరావతిలో ప్రారంభించబోతున్నామని తెలిపారు. సీఎఫ్ఎంఎస్ వ్యవస్థ ద్వారా సమర్ధంగా వనరుల్ని వినియోగించగలుగుతున్నామని అన్నారు. గత ప్రభుత్వ చేసిన విధ్వంసాన్ని చక్కదిద్దుతూ ఉన్న సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని సీఎం తెలిపారు.
 
2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని కోరుతున్నామని అన్నారు. నెలవారీ, త్రైమాసిక లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ఫలితాలను సాధించాలని సూచించారు. నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగానే ప్రభుత్వం పౌరసేవలు అందించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రతీ నియోజకవర్గానికి ఓ సీనియర్ అధికారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి విజన్ ప్లాన్ అమలు చేస్తామన్నారు. ఆర్టీజీఎస్ ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి ఆయా శాఖలకు అప్పగిస్తున్నామని.. దానికి అనుగుణంగానే నిర్ణయాలు వేగంగా తీసుకోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి వెల్లడించారు.
 
ప్రస్తుతం రియల్ టైమ్ గవర్నెన్స్ కాలం నడుస్తోందని.. సిటిజెన్ డేటా అంతా క్రోడీకరించామని సీఎం తెలిపారు. అంగన్‌వాడీల స్థాయి నుంచే విద్యార్ధుల డేటా అనుసంధానం కావాలని అధికారులకు సూచించారు. అవేర్ ద్వారా విస్తృతమైన డేటాను సమన్వయం చేసుకుని వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన సమాచారం ఒక్క చోటే క్రోడీకరించి నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని వెల్లడించారు. ఈ డేటా ద్వారా రియల్ టైమ్‌లోనే అనలటిక్స్ చేసి వాటి ద్వారా తక్షణ నిర్ణయాలు తీసుకునేందుకు ఆస్కారం ఉందని చెప్పుకొచ్చారు. ప్రిడిక్టివ్ అనలటిక్స్‌కు కూడా టెక్నాలజీ ద్వారా సాధ్యం అవుతోందన్నారు. ప్రజల సంక్షేమం కోసం, పాలన కోసం భారీస్థాయిలో బడ్జెట్ వ్యయం చేస్తున్నామని.. నిధులు వ్యయం సమర్ధంగా జరగాలని సూచనలు చేశారు.
 
ప్రస్తుతం ఇ-ఫైల్స్ కూడా అందరికీ అందుబాటులో ఉన్నాయని.. ఎంత వేగంగా నిర్ణయం తీసుకుంటున్నారన్నదే ప్రశ్న అని అన్నారు. గతంలో ఒక్క చదువుకే కులం, స్థానికత, ఆదాయం ఇలా వేర్వేరు ధృవపత్రాలు 10 రోజులు ఆఫీసుల చుట్టూ తిరిగి తీసుకోవాల్సి వచ్చేదని గుర్తుచేశారు. ఈ పరిస్థితి అంతా మారిపోవాలని… కేంద్రం తీసుకొచ్చిన డీజీ లాకర్‌ను సమర్ధంగా వినియోగించాలని ఆదేశించారు. అందరూ అన్ని శాఖలలోని సమాచారాన్ని తెలుసుకుని దానిని గుర్తించి పనిచేయాలని ముఖ్యమంత్రి సూచనలు చేశారు.
 
ఇటీవల జరిగిన బస్సు ప్రమాదాల వల్ల చాలా ప్రాణాలు పోయాయని అన్నారు. శ్రీకాకుళంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాటి ప్రమాదం జరిగిందని.. ఒక సంఘటన తర్వాత ఆయా తప్పులు దిద్దుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఎస్ఓపీ ఉన్నా దానిని ఎందుకు పాటించలేకపోతున్నాని ప్రశ్నించారు. పీపుల్స్ పాజిటివ్ పర్సెప్షన్‌కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. గత పాలకుల హయాంలో ఎక్సైజ్‌లో తీవ్రమైన అవకతవకలు జరిగాయని విమర్శించారు. వాటన్నింటినీ సరిచేస్తుంటే మళ్లీ ప్రభుత్వంపైనే బ్లేమ్ గేమ్ వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. పారదర్శకత పాటించటంతో పాటు దానిని ప్రజలకు కూడా సరిగ్గా చెప్పుకోవాలని తెలిపారు. పోలీసు విభాగానికి సంబంధించిన వివరాలు కూడా డేటా లేక్‌కు అనుసంధానం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
The post CM Chandrababu: డేటా ఆధారిత పాలనసై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

అంగ‌రంగ వైభ‌వం విశాఖ ఉత్స‌వంఅంగ‌రంగ వైభ‌వం విశాఖ ఉత్స‌వం

విశాఖ‌ప‌ట్నం : ఏపీ స‌ర్కార్ ఆధ్వ‌ర్యంలో అంగ‌రంగ వైభ‌వోపేతంగా విశాఖ ఉత్స‌వం కొన‌సాగుతోంది. రుషికొండ బీచ్ వద్ద పర్యాటకులకు అద్భుత అనుభూతిని అందించే హెలికాప్టర్ రైడ్‌ను రాష్ట్ర సాంస్కృతిక‌, ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ‘సిటీ ఆఫ్ డెస్టినీ’

మాజీ మంత్రి అతి.. కేసులో చిక్కుకోక తప్పదా?మాజీ మంత్రి అతి.. కేసులో చిక్కుకోక తప్పదా?

అనుచరుడిని విచారణ కోసం పోలీసులు స్టేషన్‌కు పిలిస్తే మాజీ మంత్రి అక్కడకు వచ్చి నానా హడావుడి చేశారు. అనుచరులందరినీ గుంపులుగా వెంటబెట్టుకొచ్చి పోలీసు అధికారుల విధులకు ఆటంకం కలిగించారు. వారిని బెదిరించారు. విచారణ కోసం పిలిపించిన నిందితుడిని పోలీసులు అనుమతి లేకుండా

Harinarayan Singh: పదిసార్లు ఎమ్మెల్యేగా హరినారాయణ్‌ సింగ్‌ చరిత్ర సృష్టించేనా?Harinarayan Singh: పదిసార్లు ఎమ్మెల్యేగా హరినారాయణ్‌ సింగ్‌ చరిత్ర సృష్టించేనా?

Harinarayan Singh : అత్యధిక సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్లడం అనేది ప్రత్యేకమే. మన దేశంలో ఇలా 10 కంటే ఎక్కువ సార్లు శాసనసభ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలున్నారు. బిహార్‌లోనూ అలాంటి సీనియర్‌ మోస్ట్‌ నేతలు ఉన్నప్పటికీ… ఇంతవరకూ ఎవరూ