hyderabadupdates.com Gallery CM Chandrababu: రేపు యూఏఈకి సీఎం చంద్రబాబు

CM Chandrababu: రేపు యూఏఈకి సీఎం చంద్రబాబు

CM Chandrababu: రేపు యూఏఈకి సీఎం చంద్రబాబు post thumbnail image

 
విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వ ప్రతినిధుల్ని ఆహ్వానిస్తోంది. ఈ మేరకు సింగపూర్ దేశంలో గతంలో పర్యటించిన ముఖ్యమంత్రి బృందం… ఇప్పుడు యూఏఈకి వెళ్లనుంది. నవంబరు 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు కోసం సీఎం దుబాయ్ లో రోడ్ షో నిర్వహించనున్నారు. అలాగే పర్యటన చివరి రోజున దుబాయ్ లో AP NRT ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయ్ సహా వివిధ దేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలను, కంపెనీలను, ప్రభుత్వ ప్రతినిధులను విశాఖలో జరగనున్న పెట్టుబడుల సదస్సుకు ముఖ్యమంత్రి ఆహ్వానించనున్నారు.
ఈ నేపథ్యంలో అక్టోబరు 22 తేదీన ఉదయం హైదరాబాద్ కు 10 గంటలకు చేరుకుని… అక్కడి నుంచి నేరుగా దుబాయ్ కు వెళ్లనున్నారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంటారు. దుబాయ్ చేరుకున్న తొలి రోజు నుంచే ముఖ్యమంత్రి వివిధ పారిశ్రామిక వేత్తలతో భేటీలు నిర్వహించనున్నారు. సీఎం పర్యటించే మూడు రోజుల్లో వీలైనంత మంది పారిశ్రామికవేత్తలను కలిసేలా యూఏఈ పర్యటన ఉండబోతోంది. ప్రభుత్వ ప్రతినిధులతో 3, పారిశ్రామిక వేత్తలతో 14 వన్ టు వన్, రౌండ్ టేబుల్ సమావేశాలు, 2 సైట్ విజిట్స్ 2, మీడియా ఇంటర్వ్యూలు 2, సీఐఐ పీఎస్ రోడ్ షో 1, తెలుగు డయాస్పోరా 1 సహా మొత్తం మూడు రోజుల పాటు 25 సమావేశాల్లో పాల్గొననున్నారు. ఇక ప్రతి రోజూ ఐదారు సమావేశాలు ఉండేలా ముఖ్యమంత్రి యూఏఈ పర్యటన ఉండబోతోంది.
 
తొలిరోజు పర్యటనలో భాగంగా ఐదు కంపెనీలకు చెందిన పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ కానున్నారు. శోభా గ్రూప్, షరాఫ్ డీజీ, ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, లూధా గ్రూప్, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం అవుతారు. వీరితో వన్ టు వన్ సమావేశాలు నిర్వహిస్తారు. వీరితో జరిపే వేర్వేరు భేటీల్లో ఇండస్ట్రీయల్, ఐటీ పార్కులు, లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్ సదుపాయాలు, పోర్టులు-షిప్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో పెట్టుబడులపై ఆయా సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. తొలి రోజు పర్యటనలో ముఖ్యమంత్రి బృందం పలు ప్రాంతాలను సందర్శించనుంది. మ్యూజియం సందర్శనలో భాగంగా జర్నీ టూ 2071 థీమ్ తో ఉండే స్పేస్ ట్రావెల్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను సీఎం పరిశీలిస్తారు. అలాగే ఇదే మ్యూజియంలో ఏర్పాటు చేసిన భవిష్యత్ టెక్నాలజీ సొల్యూషన్స్ అనే అంశంపైనా సీఎం అధ్యయనం చేయనున్నారు.
 
ఇక రాత్రికి సీఐఐ భాగస్వామ్య సదస్సుకు సంబంధించిన రోడ్ షోకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. ఈ రోడ్ షోలో పాల్గొని వివిధ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు. అలాగే విశాఖలో వచ్చే నెల 14,15వ తేదీల్లో జరగబోయే పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానించనున్నారు. చంద్రబాబుతో పాటు మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్థన్ రెడ్డి, సీఎం సెక్రటరీ కార్తికేయ మిశ్రా, ఇండస్ట్రీస్ సెక్రటరీ యువరాజ్, ఏపీ ఇడిబి సీఈఓ సాయికాంత్ వర్మ, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ ధాత్రిరెడ్డి దుబాయ్ పర్యటనలో పాల్గొననున్నారు.
 
కోనసీమ పేలుడు ఘటన మృతుల కుటుంబాలకు 15 లక్షల పరిహారం
 
అంబేద్కర్ కోనసీమ జిల్లా పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. సచివాలయంలో సీఎం చంద్రబాబుతో భేటీ అయిన హోం మంత్రి అనిత, అధికారులు సురేష్, ఆకే రవికృష్ణ బాణసంచా పేలుడు ఘటనకు సంబంధించిన నివేదికను సీఎంకు అందించారు.
 
ఒకే షెడ్డులో ఒకే చోట 14 మంది కార్మికులు మెటిరీయల్ మాన్యుఫాక్చరింగ్ చేశారని, హార్డ్ మెటీరియల్ వాడటం వల్లే స్పార్క్ వచ్చి, మాన్యుఫాక్చరింగ్ జరుగుతున్న ప్రాంతంపై పడిందని నివేదికలో అధికారులు పేర్కొన్నారు. ఏ మాత్రం నిబంధనలు పాటించలేదని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నివేదికను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, లైసెన్సు ఇచ్చే ముందు నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది అధికారులు నిరంతరం తనిఖీలు చేయాలని సూచించారు. తయారీ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు.
ఎక్స్ ప్లోజివ్ మెటీరియల్ పై నియంత్రణ కోసం ఇక నుంచి ఆన్ లైన్ ద్వారానే కొనుగోళ్లు జరిగేలా చూడాలన్న ముఖ్యమంత్రి బాణసంచా కోసం ఉపయోగించే పదార్ధాల కొనుగోళ్లు, తయారీపై పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం లేని తయారీ కేంద్రాలను, ఆథరైజేషన్ లేని వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించొద్దని సీఎం పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పీడీ యాక్ట్ కేసులు పెట్టి కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు. బాణసంచా తయారీ కేంద్రాలన్నీ నిబంధనల ప్రకారమే ఉండాలన్నారు. అలాగే, పనిచేసే వారికి వ్యక్తిగత బీమా ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
The post CM Chandrababu: రేపు యూఏఈకి సీఎం చంద్రబాబు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Operation Chhatru: జమ్మూకశ్మీర్‌ లో ఆపరేషన్‌ ఛత్రు ! ముగ్గురు ఉగ్రవాదులు హతం !Operation Chhatru: జమ్మూకశ్మీర్‌ లో ఆపరేషన్‌ ఛత్రు ! ముగ్గురు ఉగ్రవాదులు హతం !

    జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు బుధవారం ఆపరేషన్‌ ఛత్రును చేపట్టాయి. కిష్తివాడ్‌ జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులు దాక్కున్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఉగ్రవాదులను చుట్టుముట్టాయి. దీంతో సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కిష్తివాడ్‌లోని ఛత్రు

TG Panchayat Elections: తెలంగాణాలో పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసిందిTG Panchayat Elections: తెలంగాణాలో పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది

    తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్‌ విడుదల అయింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ రాణి కుమిదిని మంగళవారం సాయంత్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ‘తెలంగాణలో కోటి 66 లక్షలకు

Minister Nara Lokesh: ముగిసిన నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనMinister Nara Lokesh: ముగిసిన నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన

    రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ చేపట్టిన ఆస్ట్రేలియా పర్యటన నేటితో ముగిసింది. ఏడు రోజుల పాటు ఆస్ట్రేలియాలో పర్యటించిన లోకేష్.. వివిధ సంస్థలు, యూనివర్సిటీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటూ ఆహ్వానించారు.