hyderabadupdates.com Gallery CM Nitish Kumar: మొదటి సారి మీడియా మందుకు నితీష్ కుమార్ వారసుడు

CM Nitish Kumar: మొదటి సారి మీడియా మందుకు నితీష్ కుమార్ వారసుడు

CM Nitish Kumar: మొదటి సారి మీడియా మందుకు నితీష్ కుమార్ వారసుడు post thumbnail image

 
 
బిహార్ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో పదోసారి ప్రమాణ స్వీకారం చేశారు ఎన్డీయే భాగస్వామి, జనతాదళ్ యునైటెడ్ అధినేత నితీష్ కుమార్‌. అయితే, సాక్షాత్తూ సీఎం తనయుడైనప్పటికీ ఎప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉండే నితీష్ కుమార్ ఏకైక కుమారుడు నిషాంత్ కుమార్ ఇవాళ ఆశ్చర్యకర రీతిలో మీడియా ముందుకొచ్చారు. ఒక మీడియా ఛానల్‌‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.
 
ఈ సందర్భంగా నిషాంత్ కుమార్ మీడియాతో అరుదైన మాటలు మాట్లాడారు. ‘పితాజీ పదవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సందర్భంగా ఆయనకు నా అభినందనలు. అందరూ పితాజీని అభినందిస్తున్నారు. బిహార్ ప్రజలు ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చారు. నేను వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాన్న ఆరోగ్యం బాగుంది. బిహార్ అభివృద్ధికి ఇంకా చాలా చేయాలని ఉత్సాహంగా ఉన్నారు’ అని నిషాంత్ చెప్పారు.
నిషాంత్, ఈ సారి తండ్రి ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యారు. స్టేజ్ వెనుక నుంచి ప్రధాని మోదీ, అమిత్ షా, ఇతర నాయకులతో నిషాంత్ సంభాషించారు. బిహార్ రాజకీయాల్లో నితీష్ వారసత్వం గురించి ఎప్పుడు మీడియా ప్రశ్నించినా నిషాంత్, ‘నేను రాజకీయాల్లోకి రాను, పితాజీ ఏం చేస్తున్నారో ఆయనకు తెలుసు’ అని స్పష్టం చేసేవారు.
బిహార్‌కు పదవ సారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఈ రోజు ఎన్డీఏతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 2025 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సరికొత్త రాజకీయ వ్యూహాన్ని అమలు చేశారు నితీష్ కుమార్. ఇవాళ ఆయన తనయుడు మీడియాకు ఇచ్చిన ఈ చిన్న ఇంటర్వ్యూ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
The post CM Nitish Kumar: మొదటి సారి మీడియా మందుకు నితీష్ కుమార్ వారసుడు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Azam Khan: ఎస్పీ నేత ఆజంఖాన్‌కు ఏడేళ్ల జైలుAzam Khan: ఎస్పీ నేత ఆజంఖాన్‌కు ఏడేళ్ల జైలు

    డబుల్‌ పాన్‌ కార్డు కేసులో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) సీనియర్‌ నేత ఆజంఖాన్‌, ఆయన కుమారుడు అబ్దుల్లా ఆజంలను ప్రత్యేక ప్రజా ప్రతినిధుల కోర్టు దోషులుగా తేల్చింది. అబ్దుల్లా ఆజం అసలు పుట్టిన తేదీ 1993 జనవరి 1వ

ఓటు ప్ర‌క్షాళ‌న వెనుక భారీ కుట్ర : రేవంత్ రెడ్డిఓటు ప్ర‌క్షాళ‌న వెనుక భారీ కుట్ర : రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కార్య‌క‌ర్త‌ల గెలుపు కోసం తాను గ‌ల్లీ గ‌ల్లీ కాదు ఇంటింటికీ వెళ్లి ప్ర‌చారం చేస్తాన‌ని అన్నారు. 140 కోట్ల జనాభా కలిగిన దేశంలో లో 80 శాతం మహాత్మా

Justice Suryakant: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్Justice Suryakant: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్

Justice Suryakant : సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 24వ తేదీన జస్టిస్ సూర్యకాంత్ (Justice Suryakant) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు