hyderabadupdates.com Gallery CM Nitish Kumar: కోటి ఉద్యోగాల కల్పనకు నితీశ్ క్యాబినెట్ నిర్ణయం

CM Nitish Kumar: కోటి ఉద్యోగాల కల్పనకు నితీశ్ క్యాబినెట్ నిర్ణయం

CM Nitish Kumar: కోటి ఉద్యోగాల కల్పనకు నితీశ్ క్యాబినెట్ నిర్ణయం post thumbnail image

 
 
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం అనంతరం నితీశ్ కుమార్ మంత్రివర్గం మంగళవారంనాడు తొలిసారి సమావేశమైంది. నితీశ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాబోయే ఐదేళ్లలో రాష్ట్ర యువతకు కోటి ఉద్యోగాలు కల్పించాలని, ‘ఈస్ట్రన్ ఇండియా టెక్ హబ్’గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని నిర్ణయించారు. సమావేశానంతరం బిహార్ చీఫ్ సెక్రటరీ ప్రత్యయ్ అమ్రిత్ ఆ వివరాలను మీడియాకు తెలిపారు. విస్తృత ఉద్యోగావకాశాల కల్పన, పారిశ్రామిక అభివృద్ధిపై సమావేశంలో కీలకంగా చర్చ జరిగినట్టు ఆయన చెప్పారు.
 
డిఫెన్స్ కారిడార్, సెమీకండక్టర్ తయారీ పార్క్, గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు, మెగా టెక్ సిటీ, ఫిట్‌నెస్ సిటీ ఏర్పాటుతో బీహార్‌ను ఈస్ట్రన్ ఇండియా టెక్ హబ్‌గా తయారు చేయాలని సమావేశంలో నిర్ణయించినట్టు సీఎస్ తెలిపారు. న్యూఏజ్ ఎకానమీ కింద రాబోయే ఐదేళ్లలో గ్లోబల్ వర్క్‌ప్లేస్‌గా బీహార్‌ను అభివృద్ధి చేయనున్నామని, ఈ లక్ష్య సాధనకు డెడికేటెడ్ కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. స్టార్టప్ డొమైన్‌లో రాష్ట్రంలోని ప్రతిభావంతులు, యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా ప్రణాళికలు రూపొందించేందుకు ఒక కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేశామని తెలిపారు. ఏఐ డొమైన్‌లో కూడా బీహార్‌ను లీడింగ్ స్టేట్‌గా తీర్చిదిద్దనున్నామని, ఇందుకు అవసరమైన ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ మిషన్‌కు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపిందని సీఎస్ తెలిపారు.
సోనెపూర్, సీతామర్హితో సహా 12 సిటీల్లో గ్రీన్‌ఫీల్డ్ టౌన్‌షిప్ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మూతపడిన 9 చక్కెర మిల్లులను పునరుద్ధరించాలని, 25 కొత్త మిల్లలను ఏర్పాటు చేయాలని కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని చీఫ్ సెక్రటరీ వివరించారు.
The post CM Nitish Kumar: కోటి ఉద్యోగాల కల్పనకు నితీశ్ క్యాబినెట్ నిర్ణయం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CM Chandrababu: లండన్ లో పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశంCM Chandrababu: లండన్ లో పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశం

  రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ వివిధ పారిశ్రామిక వేత్తలతో సీఎం చంద్రబాబు సోమవారం లండన్ లో భేటీ అయ్యారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి లండన్ వెళ్లినా… రాష్ట్రంలో పెట్టుబడులు, విశాఖలో ఈ నెల 14,15 తేదీల్లో జరగనున్న

Rolex: తమిళనాడు అటవీశాఖ చేతికి చిక్కిన ‘రోలెక్స్‌’Rolex: తమిళనాడు అటవీశాఖ చేతికి చిక్కిన ‘రోలెక్స్‌’

Rolex : రోలెక్స్‌… ఈ పేరు చాలా ఫేమస్‌. విక్రమ్ సినిమా ఎండ్ టైటిట్ కార్డు పడేటప్పుడు… ఆ సినిమా సీక్వెల్ కు హింట్ ఇస్తూ… రోలెక్స్ పాత్రలో సూర్య కనిపిస్తారు. కేవలం కొన్ని సెకన్లు మాత్రమే ఈ రోలెక్స్ (Rolex)