hyderabadupdates.com Gallery CM Revanth Reddy: తెలంగాణా అభివృద్ధి నిరోధకులు కిషన్‌రెడ్డి, కేటీఆర్ – సీఎం రేవంత్

CM Revanth Reddy: తెలంగాణా అభివృద్ధి నిరోధకులు కిషన్‌రెడ్డి, కేటీఆర్ – సీఎం రేవంత్

CM Revanth Reddy: తెలంగాణా అభివృద్ధి నిరోధకులు కిషన్‌రెడ్డి, కేటీఆర్ – సీఎం రేవంత్ post thumbnail image

 
 
‘కేంద్రానికి రూ.43 వేల కోట్లతో మెట్రో విస్తరణ ప్రతిపాదనలను ఇస్తే కిషన్‌రెడ్డి, కేటీఆర్‌ అడ్డుకున్నారు. రీజినల్‌ రింగురోడ్డు, 20 టీఎంసీల గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టులకు సైతం అడ్డుపడుతున్నారు. వీళ్లిద్దరి సమన్వయం ప్రాజెక్టులను ఆపడానికా? తెలంగాణపై ఎందుకింత కక్ష? వారిద్దరూ అభివృద్ధి నిరోధకులు’ అని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఉప ఎన్నిక నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని తన కార్యాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మహమ్మద్‌ అజారుద్దీన్, ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌లతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ… ‘‘2004-14 వరకు పదేళ్లు రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉంది. 2014-23 వరకు రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నాయి. ఈ రెండు దశాబ్దాల పాలనను పోల్చిచూడండి. హైదరాబాద్‌ సహా తెలంగాణ అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందో మీకే అర్థమవుతుంది. హైదరాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైలు, నాలెడ్జ్‌ సెంటర్స్, ఐటీ, ఫార్మా పరిశ్రమల వృద్ధి.. ఇలా అన్ని రంగాల అభివృద్ధికి బీజం వేసిందే కాంగ్రెస్‌. రాష్ట్ర ప్రజలకు మోదీ, కేసీఆర్, కిషన్‌రెడ్డి, కేటీఆర్‌ ఏమైనా చేశారా? రాష్ట్రానికి ఏఐబీపీ ప్రాజెక్టులు రాకుండా అడ్డుకున్నది.. ఐటీఐఆర్‌ రానీయకుండా చేసింది భారత రాష్ట్ర సమితి, భాజపా కాదా? మూడేళ్లు మెట్రో రైలు ప్రాజెక్టును ఆపి.. ఎల్‌అండ్‌టీ నష్టపోవడానికి కారణం కేసీఆర్, కేటీఆర్‌ కాదా? వరదల్లో హైదరాబాద్‌ మునిగిపోతే కేంద్రం నుంచి చిల్లిగవ్వ కూడా కిషన్‌రెడ్డి ఎందుకు తీసుకురాలేదు’’ అని సీఎం రేవంత్‌రెడ్డి.. భారత రాష్ట్ర సమితి, బీజేపీలపై విరుచుకుపడ్డారు.
కేసీఆర్‌ సేద తీరడానికే విలాసవంతంగా ప్రగతి భవన్‌
‘‘భారత రాష్ట్ర సమితి పాలనలో రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్ల ఆదాయం వస్తే.. కేసీఆర్‌ వేటి కోసం ఖర్చుపెట్టారు? పైగా రూ.8.11 లక్షల కోట్ల అప్పుతో మాకు రాష్ట్రాన్ని అప్పగించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సేవలందించిన సచివాలయ భవనాలు మరో వందేళ్లు ఉండాల్సినవి. కేవలం కుమారుడిని సీఎం చేయాలనే కారణంతో.. వాస్తు నెపంతో ఆ భవనాలను కూల్చేసి, రూ.2వేల కోట్లతో కొత్త సచివాలయాన్ని కట్టారు. పాత సచివాలయంలో దేవాలయాన్ని, మసీదును కూలగొడితే కిషన్‌రెడ్డి ఎందుకు మాట్లాడలేదు? విలాసవంతంగా నిర్మించిన ప్రగతి భవన్‌ కేసీఆర్‌ సేదతీరడానికి ఉపయోగపడింది తప్ప.. రాష్ట్ర ప్రజలకు ఏమైనా ప్రయోజనం ఉందా?
70 శాతం జీసీసీలు తెలంగాణకే
దేశంలో గత ఏడాదిన్నరలో వచ్చిన జీసీసీల్లో 70 శాతం తెలంగాణకు వచ్చేలా కృషి చేశాం. రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి తెచ్చాం. 70 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగుల ఆశలు తీర్చాం. అహ్మదాబాద్‌లో సబర్మతీ, దిల్లీలో యమునా, ఉత్తర్‌ప్రదేశ్‌లో గంగానది ప్రక్షాళన జరగొచ్చు కానీ మూసీ ప్రక్షాళన మనకు వద్దా అని కిషన్‌రెడ్డిని సూటిగా అడుగుతున్నా. కేటీఆర్, కిషన్‌రెడ్డి జోక్యం చేసుకోకుండా ఉన్న ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చాం.
పేదలు కుంటల్లో ఇళ్లు కట్టుకుంటే సానుభూతితో న్యాయం చేస్తాం
పేదలు ఎవరైనా చెరువులు, కుంటల్లో ఇళ్లు కట్టుకుంటే.. సానుభూతితో చూసి, న్యాయం చేస్తాం. హైడ్రా, ఈగల్‌పై అసెంబ్లీలో చర్చకు సిద్ధం. గతంలో చిన్న వర్షం వస్తే హైదరాబాద్‌ మునిగిపోయేది. ఈసారి ఎన్నిసార్లు వర్షాలు కురిసినా.. ఏ కాలనీ అయినా ముంపునకు గురైందా? డ్రగ్స్‌ చట్టంలో సవరణలు చేయాలి. మద్యం తాగి డ్రైవింగు చేసే వారిని జైలుకు పంపుతుంటే.. గంజాయి, కొకైన్‌ వాడిన వారికి బాధితుల కింద బెయిల్‌ ఇవ్వడమేంటి? వచ్చే శాసనసభ సమావేశాల్లో దీనిపై చర్చిస్తాం. డ్రగ్స్‌ చట్టంలో సవరణ చేయాలి.
భారత రాష్ట్ర సమితి, బీజేపీలది ఫెవికాల్‌ బంధం
 
గవర్నర్‌ అనుమతి లేకుండా ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌ను అరెస్టు చేస్తే 10నిమిషాల్లో బయటకొస్తారు. నేషనల్‌హెరాల్డ్‌ ట్రస్ట్‌ పేర్లు మారితేనే సోనియా, రాహుల్‌గాంధీని విచారించారు. మరి సీబీఐ ఎప్పటిలోగా కాళేశ్వరంపై కేసీఆర్‌ను విచారిస్తుంది? కాళేశ్వరం ఏటీఎంలా మారిందని, అవినీతికి పాల్పడ్డారని మోదీ, అమిత్‌షాలు పలుమార్లు చెప్పారు. కాళేశ్వరం అవినీతిలో ఎవరు ఉన్నారో తేల్చి శిక్షించమని సెప్టెంబరు 1న కేసును సీబీఐకి అప్పగించాం. ఈ కేసు ముందుకు కదలడం లేదంటే భారత రాష్ట్ర సమితి, భాజపాలది ఫెవికాల్‌ బంధమనేగా? ఈ కేసును కిషన్‌రెడ్డి కప్పిపుచ్చుతున్నారు.ట్యాపింగ్‌ అంశం కోర్టులో ఉంది. సుప్రీంకోర్టులో స్టే ఎత్తివేతకు మేం ప్రయత్నిస్తున్నాం.
జీరో పెట్టుబడితో రూ.35 వేల కోట్ల ఆస్తులు
వచ్చే మార్చి 31లోగా కొనుగోలు ఒప్పందాలు పూర్తయితే.. మెట్రో ప్రభుత్వం సొంతమవుతుంది. ఊహించని ఈ పరిణామానికి కేటీఆర్, కిషన్‌రెడ్డి గందరగోళంలో పడ్డారు. కేంద్రం గ్యారంటీ ఇస్తే 2 శాతం కంటే తక్కువ వడ్డీకే రుణాలు వస్తాయి. గతంలో కేసీఆర్‌ 11.50 శాతం వడ్డీకి అప్పులు తెచ్చారు. ప్రభుత్వంపై భారం పడకుండా ఉండాలని కేంద్రం ఆమోదానికి ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం మెట్రోకు ఉన్న రూ.35 వేల నుంచి రూ.40 వేల కోట్ల వరకు ఉన్న ఆస్తులను రూ.15 వేల కోట్లకే రాష్ట్ర ప్రభుత్వానికి సాధించి పెట్టాం. మెట్రోకు ఉన్న 200 ఎకరాల భూములు వెనక్కి వస్తే.. వాటిని అమ్మేస్తే రూ.15 వేల కోట్లు వెనక్కి వస్తాయి. అంటే జీరో పెట్టుబడికి రూ.35 వేల కోట్ల ఆస్తులు నేను తెచ్చిపెట్టినట్లు.
కేసీఆర్‌ విధేయులను బయటికి పంపిస్తున్న హరీశ్‌రావు
చెల్లెలికి వాటా ఇవ్వాల్సి వస్తుందని కవితను కేటీఆర్‌ ఇంటి నుంచి బయటికి తరిమేశారు. కేసీఆర్‌కు విధేయులుగా ఉన్న వారిని ఒక్కొక్కరిని హరీశ్‌రావు బయటకు పంపిస్తున్నారు. కేటీఆర్, కవితల పంచాయితీని హరీశ్‌రావు అనుకూలంగా మలచుకుంటున్నారు. అజారుద్దీన్‌ను మంత్రిని చేస్తే కూడా మీకు కడుపుమంటా? రేవంత్‌రెడ్డి సచివాలయానికి వస్తున్నారా అంటున్నారు. కమాండ్‌ కంట్రోలు రూంను క్యాంప్‌ ఆఫీస్‌లా వాడుకుంటున్నా. కొవిడ్‌ సమయంలో వచ్చిన విరాళాల్లో, యాదగిరిగుట్ట దేవాలయ నిర్మాణంలోనూ అవినీతి జరిగింది. కనకదుర్గ ముక్కుపుడక మొక్కు తీర్చడానికి కూడా కేసీఆర్‌ ప్రభుత్వ సొమ్ము వాడుకున్నారు’’ అని సీఎం రేవంత్‌ ఆరోపించారు.
కిషన్‌రెడ్డి పూర్తిగా భారత రాష్ట్ర సమితికి మద్దతిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 8 సీట్లలో భారత రాష్ట్ర సమితి డిపాజిట్‌ కోల్పోయి బీజేపీను గెలిపించింది. ఇప్పుడు దానికి ‘థ్యాంక్స్‌ గివింగ్‌’ విధానంలో భారత రాష్ట్ర సమితికి కిషన్‌రెడ్డి మద్దతిస్తున్నారు. మాగంటి గోపీనాథ్‌ మరణాన్ని మేము రాజకీయంగా వివాదం చేయదల్చుకోలేదు. దీనిపై గోపీనాథ్‌ తల్లి మాట్లాడడాన్ని టీవీలో చూశాను. ఈ విషయంపై బండి సంజయ్‌ పోలీసులకు ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం విచారణ జరిపిస్తుంది. మోదీ కూడా గతంలో ముస్లిం టోపీ పెట్టుకున్నారు. మొదట ఆయన విధానమేమిటో చెప్పాలి. ముస్లింలు ఈ దేశంలో ఉండవద్దు అంటే.. బండి సంజయ్‌ ఆలోచనల్లోనే లోపమున్నట్లు. సర్వమత సమ్మేళనమే మా ప్రభుత్వ విధానం. 14న వెలువడే జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫలితాల్లో భాజపాకు డిపాజిట్‌ కూడా రాకపోతే.. హిందువులంతా ఆ పార్టీని వ్యతిరేకిస్తున్నట్లా? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
The post CM Revanth Reddy: తెలంగాణా అభివృద్ధి నిరోధకులు కిషన్‌రెడ్డి, కేటీఆర్ – సీఎం రేవంత్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Pawan Kalyan: మంగళంలోని ఎర్రచందనం గోదాములో డిప్యూటీ సీఎం పవన్‌ తనిఖీPawan Kalyan: మంగళంలోని ఎర్రచందనం గోదాములో డిప్యూటీ సీఎం పవన్‌ తనిఖీ

    తిరుపతి జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పర్యటించారు. మామండూరు అటవీ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతో పాటు శేషాచలంలో మాత్రమే కనిపించే అరుదైన మొక్కలు పరిశీలించి