hyderabadupdates.com Gallery CM Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

CM Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

CM Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం post thumbnail image

 
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లాల్లో అదనపు కలెక్టర్లని ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్లుగా నియమిస్తూ రేవంత్‌రెడ్డి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. జాయింట్ కలెక్టర్ పదవి రద్దు చేసి.. కొత్త బాధ్యతలని అదనపు కలెక్టర్లకు అప్పగించింది. ఈ క్రమంలో అడవి భూసర్వే, హక్కుల నిర్ధారణ, సెటిల్‌మెంట్ పనులు వీరి పరిధిలోకి రానున్నాయి. 1967 ఫారెస్ట్ యాక్ట్ కింద ఉత్తర్వులు జారీ చేసింది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ పర్యవేక్షణలో అమలు చేయనుంది. అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించింది.
 
ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ ! ఏఐసీసీ కీలక నేతలతో భేటీ !
 
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ నూతన కార్యాలయం ఇందిరా భవన్‌లో ఏఐసీసీ కీలక నేతలతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొననున్నారు. భేటీలో డీసీసీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనున్నారు. ఇప్పటికే జిల్లాల వ్యాప్తంగా పర్యటించిన ఏఐసీసీ పరిశీలకులు.. కార్యకర్తల అభిప్రాయాలు తీసుకొని నివేదిక సిద్ధం చేశారు. ఒక్కో జిల్లా నుంచి వివిధ సామాజికవర్గాల నుంచి ముగ్గురు పేర్లతో నివేదికను ఏఐసీసీకి అందజేశారు. పరిశీలకులు అందజేసిన నివేదికపై ఇవాళ కీలక చర్చ జరుగనుంది. నవంబర్ మొదటి వారంలో డీసీసీల జాబితాను కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేయనుంది
The post CM Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

India Alliance: ఇండియా కూటమిలో చీలికలు ?India Alliance: ఇండియా కూటమిలో చీలికలు ?

      బిహార్‌ ఎన్నికల సంగ్రామంలో ఓ అనూహ్య మలుపు చోటుచేసుకుంది. విపక్ష ఇండియా కూటమి ‘మహాగఠ్‌బంధన్‌’లో చీలిక ఏర్పడింది. సీట్ల సర్దుబాటులో ఏకాభిప్రాయం కుదరక 10 సీట్లలో కూటమి ఐక్యతను పక్కనపెట్టి, తమ అభ్యర్థులను ఆయా పార్టీలు రంగంలోకి