hyderabadupdates.com Gallery CM Siddaramaiah: ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి దంపతులపై సీఎం ఆగ్రహం

CM Siddaramaiah: ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి దంపతులపై సీఎం ఆగ్రహం

CM Siddaramaiah: ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి దంపతులపై సీఎం ఆగ్రహం post thumbnail image

CM Siddaramaiah : కర్ణాటకలో జరుగుతున్న సోషల్ అండ్ ఎడ్యుకేషన్ సర్వే కు దూరంగా ఉండాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి, రచయిత్రి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధామూర్తి నిర్ణయం తీసుకోవడంపై ముఖ్యమంత్రి సిద్ధారామయ్య (CM Siddaramaiah) ఘాటుగా స్పందించారు. తాము చేపట్టినది వెనుకబడిన తరగతుల సర్వే కాదని, జనగణన అని చెప్పారు. ‘అది వాళ్లకే వదిలిపెట్టాను. ఇది వెనుకబడిన తరగతుల సర్వే కాదు. వాళ్లకి అర్థం కాకపోతే నేను ఏం చేయగలను? ఇన్ఫోసిస్‌లో ఉన్నంత మాత్రానా వాళ్లు సర్వజ్ఞులా. ఇదెంత మాత్రం వెనుకబడి తరగతుల సర్వే కాదని 20 సార్లు చెప్పాం. ఇది మొత్తం జనాభాను లెక్కించే సర్వే’ అని సిద్ధరామయ్య (CM Siddaramaiah) తెలిపారు.
CM Siddaramaiah Slams
ఈ సందర్భంగా సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) మాట్లాడుతూ… ‘‘ఇది వెనకబడిన తరగతుల సర్వే కాదు. ఏడు కోట్ల జనాభా సర్వే అని 20 సార్లు చెప్పాం. వాళ్లు ఏది కావాలంటే అది రాసుకోనివ్వండి. ఈ సర్వే దేని గురించి అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. వాళ్లు (నారాయణమూర్తి దంపతులు) అర్థం చేసుకోలేకపోతే నేనేం చేయాలి’’ అని సిద్ధరామయ్య (CM Siddaramaiah) పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆర్థికంగా వెనకబడిన మహిళలకు నెలకు రూ.2 వేల ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. అయితే, ఈ పథకాల్లో అగ్రవర్ణ మహిళలు, దారిద్ర్యరేఖకు ఎగువన ఉన్న మహిళలు లేరా ? అని సీఎం ప్రశ్నించారు. ఈ సర్వేపై మంత్రులు అనేకసార్లు స్పష్టమైన ప్రకటనలు చేసినప్పటికీ వారికి అపోహలు తొలగిపోలేదన్నారు. ఇప్పుడు కేంద్రం కూడా కుల గణనతో ముందుకు వస్తోందని, అప్పుడు వాళ్లు (మూర్తి దంపతులు) ఏం సమాధానం చెబుతారని అన్నారు. వాళ్ల దగ్గర తప్పుడు సమాచారం ఉందని భావిస్తున్నానని చెప్పారు.
రాష్ట్రంలో నాయకత్వం మారే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయని అడిగిన ప్రశ్నకు సీఎం బదులిచ్చారు. మార్పు అనేది విప్లవం కాదన్నారు. సందర్భం లేకుండా ఎప్పుడూ ఇటువంటి వాదనలు వస్తూనే ఉంటాయని, వాటిని పట్టించుకోవద్దన్నారు. ఇక ప్రభుత్వ స్థలాలు, పాఠశాలలు, కాలేజీల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాలను నిషేధిస్తూ కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని సీఎం సమర్థించారు. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థ గురించి కాదని, ఇటువంటివి నిర్వహించుకోవాలంటే ఏ సంస్థ అయినా ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు.
కర్ణాటక వెనుకబడి తరగతుల కమిషన్ చేపట్టిన ‘సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ సర్వే’లో పాల్గొన రాదని నారాయణ మూర్తి దంపతులు నిర్ణయం తీసుకున్నారు. ఎన్యూమరేషన్‌ కోసం ఆ దంపతుల ఇంటికి వెళ్లినప్పుడు తమకు సర్వే అక్కర్లేదని చెప్పినట్టు అధికారులు తెలిపారు. తాము వెనుకబడిన తరగతులకు చెందిన వారముకాదని, ఆ సామాజిక వర్గం కోసం నిర్వహిస్తున్న సర్వే కావడంతో తాను ఇందులో పాలుపంచుకోవడం లేదని నారాయణ మూర్తి దంపతులు తెలిపారు. తమ విషయంలో సర్వేకు ఎలాంటి ఔచిత్యం లేదని ప్రకటిస్తూ సర్వే ఫారంపై సుధామూర్తి సంతకం చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రక్రియకు దూరంగా ఉంటున్నట్టు పేర్కొంటూ మూర్తి దంపతులు డిక్లరేషన్ కూడా ఇచ్చారు.
మేము ఎవ్వరినీ బలవంతం పెట్టడం లేదు – డీకే
ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి దంపతులు సోషల్ అండ్ ఎడ్యుకేషన్ సర్వేకు దూరంగా ఉండాలని తీసుకున్న నిర్ణయంపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ, సర్వేలో పాల్గొనమని తాము ఎవరినీ బలవవంత పెట్టడం లేదని, ఐచ్ఛికంగా సర్వేలో పాల్గొనవనచ్చని చెప్పారు. కాగా, ఇన్ఫోసిస్ మాజీ సీఈవో మోహన్‌దాస్ పాయ్ సైతం కులసమీకరణపై విమర్శలు గుప్పించారు. ‘ఉద్యోగులకు లభిస్తున్న పెద్ద పేమెంట్లు, ప్రయోజనాలతో పోల్చుకుంటే ఇది చాలా చిన్నది. కర్ణాటకలో మంత్రలకు మంచి ఉద్యోగాలు, టక్నాలజీ, అభివృద్ధి కంటే కులం, కుల సర్వేలు, బుజ్జగింపులపైనే ఎక్కువ ఆసక్తి ఉంది’ అని అన్నారు. కర్ణాటక హైకోర్టు కూడా ఇటీవల తమ ఉత్తర్వుల్లో సోషియో-ఎకానమిక్, ఎడ్యుకేషన్ సర్వే తప్పనిసరి కాదని బహిరంగంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వివరాలపై సర్వేయర్లు పట్టుబట్ట రాదని, సేకరించిన సమాచారం మొత్తం బీసీ కమిషన్‌కు మినహా పూర్తి కాన్ఫిడెన్సియల్‌గా ఉంచాలని ఆదేశాలిచ్చింది. వెనుకబడిన తరగతుల వారికి ప్రయోజనాలు చేకూర్చేందుకు ఉద్దేశించిన సర్వేలోని సమాచారం పౌరుల హక్కులను ఉల్లంఘించేలా ఉండరాదని పేర్కొంది.
అక్టోబర్ 19 వ‌ర‌కు స‌ర్వే
కాగా, కర్ణాటక రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ (KSCBC) చేప‌ట్టిన సెప్టెంబర్ 22న సామాజిక స‌ర్వే, కులగణన అక్టోబర్ 19 వ‌ర‌కు కొన‌సాగుతుంది. ₹420 కోట్ల అంచనా వ్య‌యంతో చేప‌ట్టిన‌ ఈ సర్వేలో 60 ప్రశ్నలు ఉన్నాయి. ఈ సంవత్సరం చివరి నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి స‌ర్వే నివేదిక అందుతుంద‌ని భావిస్తున్నారు. సంక్షేమ పథకాలను మెరుగ్గా అమలు చేయడానికి.. బలహీన వర్గాలకు మరింత సమర్థవంతంగా సాధికారత కల్పించడంలో ఈ డేటా సహాయపడుతుందని ప్ర‌భుత్వం చెబుతోంది.
Also Read : Priyank Kharge: ఆర్ఎస్ఎస్‌పై నిప్పులు చెరిగిన ప్రియాంక్ ఖర్గే
The post CM Siddaramaiah: ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి దంపతులపై సీఎం ఆగ్రహం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Red Fort: ఉగ్రవాదుల అసలు టార్గెట్ ఎర్రకోట ?Red Fort: ఉగ్రవాదుల అసలు టార్గెట్ ఎర్రకోట ?

    చరిత్రాత్మక ఎర్రకోట వద్ద ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం రోజు పెను విధ్వంసానికి పాల్పడాలని డాక్టర్‌ ముజమ్మిల్‌ గనయీ పదేపదే ప్రయత్నం చేశాడా? అప్పటికే అక్కడ గట్టి బందోబస్తు ఉండటంతో ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయా?.. దీంతో వచ్చే నెల

Trishul: గుజరాత్‌ తీరంలో త్రివిధ దళాల ‘త్రిశూల్‌’ విన్యాసాలుTrishul: గుజరాత్‌ తీరంలో త్రివిధ దళాల ‘త్రిశూల్‌’ విన్యాసాలు

    భారత త్రివిధ దళాలు సంయుక్తంగా తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాయి. ఎక్సర్‌సైజ్‌ త్రిశూల్‌ పేరిట భారత సైన్యం, నావికా దళం, వైమానిక దళం గురువారం గుజరాత్‌ లోని సౌరాష్ట్ర సముద్ర తీరంలో కలిసికట్టుగా విన్యాసాలు నిర్వహించాయి. దాదాపు గంటపాటు

Pawan Kalyan Visits Kakinada, Promises Aid to FisherfolkPawan Kalyan Visits Kakinada, Promises Aid to Fisherfolk

Kakinada: Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan visited the Kakinada Collectorate to engage with fishing community representatives from Uppada and state officials. During the meeting, fishermen highlighted the adverse