hyderabadupdates.com Gallery CP Sajjanar: చాదర్‌ఘాట్ కాల్పులపై స్పందించిన వీసీ సజ్జనార్

CP Sajjanar: చాదర్‌ఘాట్ కాల్పులపై స్పందించిన వీసీ సజ్జనార్

CP Sajjanar: చాదర్‌ఘాట్ కాల్పులపై స్పందించిన వీసీ సజ్జనార్ post thumbnail image

 
చాదర్‌ఘాట్ (Chaderghat) విక్టోరియా గ్రౌండ్‌లో  మొబైల్ దొంగపై డీసీపీ చైతన్య కాల్పులు జరిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ క్రమంలో సంఘటనా స్థలాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పరిశీలించారు. ఇందుకు గల కారణాలను పోలీసు అధికారులని అడిగి సజ్జనార్ తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఆత్మరక్షణలో భాగంగా డీసీపీ కాల్పులు జరిపారని చెప్పుకొచ్చారు.
 
శనివారం సాయంత్రం 5 గంటలకు చాదర్‌ఘాట్ విక్టోరియా ప్లేగ్రౌండ్ వద్ద ఈ ఘటన జరిగిందని వివరించారు. రౌడీ షీటర్, మొబైల్స్ స్నాచర్ ఇద్దరూ స్నాచింగ్ చేస్తుండగా డీసీపీ చైతన్య పట్టుకునే ప్రయత్నం చేశారని తెలిపారు. రౌడీషీటర్ మహ్మద్ ఉమర్ అన్సారీపై 20కి పైగా కేసులు ఉన్నాయని వెల్లడించారు. ఉమర్‌పై కాలాపత్తర్ పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్ ఓపెన్ అయిందని పేర్కొన్నారు. నిందితుడిపై రెండు పీడీ యాక్ట్‌లు నమోదు అయ్యాయని.. రెండు సంవత్సరాలు మహ్మద్ ఉమర్ అన్సారీ జైల్లో కూడా ఉన్నారని తెలిపారు సజ్జనార్.
దొంగను ఛేజ్ చేస్తూ పట్టుకునేందుకు డీసీపీ, తన సిబ్బందితో వచ్చారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో డీసీపీ గన్‌మెన్‌పై దొంగ కత్తితో దాడి చేశాడని వెల్లడించారు. వెంటనే డీసీపీ చైతన్య అప్రమత్తమై రెండు రౌండ్లు దొంగపై కాల్పులు జరిపారని తెలిపారు. దొంగకు చేతిపై.. కడుపులో గాయాలయ్యాయని వివరించారు. దొంగని మలక్‌పేట యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. పరారీలో ఉన్న మరో దొంగ కోసం గాలిస్తున్నామని చెప్పుకొచ్చారు సజ్జనార్.
ఈ ఘటనలో డీసీపీ చైతన్య స్వల్ప అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. గాయలైన ఇద్దరు కానిస్టేబుళ్లు ఆస్పత్రిలో క్షేమంగా ఉన్నారని వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు చేస్తామని ఉద్ఘాటించారు. మహ్మద్ ఉమర్ అన్సారీపై ఉన్న కేసులు, నేరాలు, అతనికి సహకరిస్తున్న వారిని గుర్తిస్తామని పేర్కొన్నారు. రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతామని వీసీ సజ్జనార్ హెచ్చరించారు.
The post CP Sajjanar: చాదర్‌ఘాట్ కాల్పులపై స్పందించిన వీసీ సజ్జనార్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

అగ్నిప్రమాదాల పట్ల అప్రమత్తత అవసరంఅగ్నిప్రమాదాల పట్ల అప్రమత్తత అవసరం

హైద‌రాబాద్ : వేసవి కాలం ఆరంభ‌మైందని, నిప్పు రగిల్తే పెను ముప్పు తప్పదని, ఇలాంటి తరుణంలో అగ్నిప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చ‌రించారు. బాచుప‌ల్లి ప్ర‌ధాన ర‌హ‌దారిలో రాత్రి జ‌రిగిన అగ్ని ప్ర‌మాదంలో ద‌గ్ధ‌మైన ఫ‌ర్నీచ‌ర్

P Chidambaram: ఆపరేషన్ బ్లూస్టార్ పై చిదంబరం సంచలన వ్యాఖ్యలుP Chidambaram: ఆపరేషన్ బ్లూస్టార్ పై చిదంబరం సంచలన వ్యాఖ్యలు

    మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో పంజాబ్‌లోని స్వర్ణదేవాలయంలో 1984లో జరిపిన ఆపరేషన్‌ బ్లూ స్టార్‌ పై ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోంమంత్రి పి.చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వర్ణ దేవాలయాన్ని తిరిగి స్వాధీనం

Uttarakhand: కేదార్‌నాథ్‌, యమునోత్రి ఆలయాల మూసివేతUttarakhand: కేదార్‌నాథ్‌, యమునోత్రి ఆలయాల మూసివేత

Uttarakhand : శీతాకాలం రావడంతో హిమాలయాల్లోని పవిత్ర పుణ్యక్షేత్రాలైన కేదార్‌నాథ్‌, యమునోత్రి ఆలయాలను ఉత్తరాఖండ్‌ (Uttarakhand) అధికారులు మూసివేశారు. ఈ సందర్భంగా గురువారం ముగింపు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రుద్రప్రయాగ్‌ నుంచి కేదార్‌నాథుడి పల్లకి ఊరేగింపు ఆర్మీ మేళతాళాలు, సుమారు పది