hyderabadupdates.com Gallery Cyclone Senyar: ఏపీకి ‘సెనియార్‌’ తుపాను ముప్పు

Cyclone Senyar: ఏపీకి ‘సెనియార్‌’ తుపాను ముప్పు

Cyclone Senyar: ఏపీకి ‘సెనియార్‌’ తుపాను ముప్పు post thumbnail image

 
 
మోంథా తుఫాన్ నుండి కోలుకుంటున్న ఏపీకు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ప్రస్తుత ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారానికి దక్షిణ అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఇది 24వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా, 26, 27 తేదీల్లో తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. తుపానుగా మారిన తర్వాత దీనికి సెనియార్‌ అని పేరు పెట్టనున్నారు (యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌–యూఏఈ ఈ పేరు పెట్టనుంది).
ఈ తుపాను ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ బంగ్లాదేశ్‌ తీరానికి చేరే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ ప్రస్తుతం అంచనా వేసింది. పలు ప్రైవేటు గ్లోబల్‌ మోడల్స్‌ మాత్రం ఇది వాయవ్య దిశగా పయనించి ఏపీ, ఒడిశా, తమిళనాడు తీరాలపై ప్రభావం చూపుతుందని చెబుతున్నాయి. సముద్ర ఉష్ణోగ్రతలు అస్థిరంగా ఉండడంతో దీని కదలికలు ఇంకా అస్పష్టంగా ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.
అండమాన్‌ సముద్రం, బంగాళాఖాతంలో ప్రస్తుతం 28 నుంచి 30 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలున్నాయి. కొన్నిచోట్ల తేమ ఎక్కువగా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో ఈ తేమ తగ్గుతోంది. ఫలితంగా దాని గమనంపై అస్పష్టత నెలకొంది. 26వ తేదీ నాటికి దీని గమనంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
26 నుంచి వర్షాలు
దీని ప్రభావంతో ఈ నెల 26 నుంచి రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్‌ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, సముద్రంలో అలలు 3 నుంచి 5 మీటర్ల ఎత్తువరకు ఎగిసిపడతాయని తెలిపింది.
సెనియార్‌ అంటే
సెనియార్‌ అనే పేరును యూఏఈ(యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌) పెట్టింది. ఈ పదం అరబిక్‌ భాషకు చెందినది. దీని అర్థం ‘చేపలు పట్టేందుకు నావలో చేసే సుదీర్ఘ ప్రయాణం’
The post Cyclone Senyar: ఏపీకి ‘సెనియార్‌’ తుపాను ముప్పు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

RJD: బిహార్‌ ఎన్నికలకు 143 మందితో ఆర్జేడీ జాబితా విడుదలRJD: బిహార్‌ ఎన్నికలకు 143 మందితో ఆర్జేడీ జాబితా విడుదల

RJD : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ దగ్గరపడుతోంది. కానీ, ఇంతవరకూ విపక్ష ఇండియా కూటమి ‘మహాగఠ్‌బంధన్‌’లో సీట్ల పంపకాలు పూర్తికాలేదు. దీనిపై కాంగ్రెస్‌, ఆర్జేడీ మధ్య మంతనాలు కొనసాగుతోన్న వేళ.. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పార్టీ సోమవారం అభ్యర్థుల జాబితాను

Vruksha Maate: 114 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన వృక్షమాత తిమ్మక్కVruksha Maate: 114 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన వృక్షమాత తిమ్మక్క

    వృక్షమాతగా గుర్తింపు పొందిన ‘సాలుమరద’ తిమ్మక్క (114) శుక్రవారం తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె… బెంగళూరు జయనగరలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని ఆమె దత్తపుత్రుడు ఉమేశ్‌ వెల్లడించారు. వివాహమైన తర్వాత పాతికేళ్లయినా సంతానం