hyderabadupdates.com Gallery Cyclone Senyar: ఏపీకి ‘సెనియార్‌’ తుపాను ముప్పు

Cyclone Senyar: ఏపీకి ‘సెనియార్‌’ తుపాను ముప్పు

Cyclone Senyar: ఏపీకి ‘సెనియార్‌’ తుపాను ముప్పు post thumbnail image

 
 
మోంథా తుఫాన్ నుండి కోలుకుంటున్న ఏపీకు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ప్రస్తుత ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారానికి దక్షిణ అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఇది 24వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా, 26, 27 తేదీల్లో తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. తుపానుగా మారిన తర్వాత దీనికి సెనియార్‌ అని పేరు పెట్టనున్నారు (యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌–యూఏఈ ఈ పేరు పెట్టనుంది).
ఈ తుపాను ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ బంగ్లాదేశ్‌ తీరానికి చేరే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ ప్రస్తుతం అంచనా వేసింది. పలు ప్రైవేటు గ్లోబల్‌ మోడల్స్‌ మాత్రం ఇది వాయవ్య దిశగా పయనించి ఏపీ, ఒడిశా, తమిళనాడు తీరాలపై ప్రభావం చూపుతుందని చెబుతున్నాయి. సముద్ర ఉష్ణోగ్రతలు అస్థిరంగా ఉండడంతో దీని కదలికలు ఇంకా అస్పష్టంగా ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.
అండమాన్‌ సముద్రం, బంగాళాఖాతంలో ప్రస్తుతం 28 నుంచి 30 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలున్నాయి. కొన్నిచోట్ల తేమ ఎక్కువగా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో ఈ తేమ తగ్గుతోంది. ఫలితంగా దాని గమనంపై అస్పష్టత నెలకొంది. 26వ తేదీ నాటికి దీని గమనంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
26 నుంచి వర్షాలు
దీని ప్రభావంతో ఈ నెల 26 నుంచి రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్‌ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, సముద్రంలో అలలు 3 నుంచి 5 మీటర్ల ఎత్తువరకు ఎగిసిపడతాయని తెలిపింది.
సెనియార్‌ అంటే
సెనియార్‌ అనే పేరును యూఏఈ(యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌) పెట్టింది. ఈ పదం అరబిక్‌ భాషకు చెందినది. దీని అర్థం ‘చేపలు పట్టేందుకు నావలో చేసే సుదీర్ఘ ప్రయాణం’
The post Cyclone Senyar: ఏపీకి ‘సెనియార్‌’ తుపాను ముప్పు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Zubeen Garg: సింగర్ జుబీన్ గార్గ్ కేసులో బిగ్ ట్విస్ట్Zubeen Garg: సింగర్ జుబీన్ గార్గ్ కేసులో బిగ్ ట్విస్ట్

    అస్సాంకు చెందిన ప్రముఖ సింగర్ జుబీన్‌ గార్గ్‌ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అతని కజిన్, అస్సాం పోలీస్ సర్వీస్‌ (APS) అధికారి సందీపన్‌ గార్గ్‌ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా

CJI BR Gavai: పూర్తి సంతృప్తితో వెళ్తున్నా – సీజేఐ జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌CJI BR Gavai: పూర్తి సంతృప్తితో వెళ్తున్నా – సీజేఐ జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌

  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రజలకు తన వంతు సేవలు అందించానని, పూర్తి సంతృప్తితో పదవీ విరమణ చేయబోతున్నానని సీజేఐ జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ పేర్కొన్నారు. న్యాయవాదిగా, న్యాయమూర్తిగా నాలుగు దశాబ్దాల ఈ ప్రస్థానం తనకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. న్యాయరంగ

కుమార స్వామిపై భ‌గ్గుమ‌న్న డీకే శివ‌కుమార్కుమార స్వామిపై భ‌గ్గుమ‌న్న డీకే శివ‌కుమార్

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ నిప్పులు చెరిగారు. ఆయ‌న కేంద్ర మంత్రి జేడీ కుమార స్వామిపై తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. త‌న గురించి లేని పోని కామెంట్స్ చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. బెంగ‌ళూరులో