రాష్ట్రంలో ఎంతోమంది కొలిచే చాముండేశ్వరి, మారెమ్మ ఆలయాలు కాంగ్రెస్ వారికి ఇష్టం కావని… ఢిల్లీలోని ఇటలీ టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేసి కప్పం కడితేనే డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని ప్రతిపక్షనేత అశోక్(Ashok) వ్యాఖ్యానించారు. దావణగెరెలో ఆయన గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డీకే శివకుమార్ దారితప్పిన బిడ్డలా ప్రవర్తిస్తున్నారని బెంగళూరు రోడ్లలో గుంతలు పూడ్చడం మాని టెంపుల్‌రన్ చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పెద్ద దేవాలయానికి వెళ్ళకుండా సీఎం కాలేరన్నారు.
నవంబర్ క్రాంతి గురించి తన వాఖ్యలతో కాంగ్రెస్‌లో అల్లకల్లోలం అయ్యిందంటూనే సిద్దరామయ్య సంధ్యా కాలం గురించి కుమారుడు యతీంద్రనే బహిరంగం చేశారన్నారు. బీహార్ ఎన్నికలకు కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన టార్గెట్‌ను తెలిపేందుకే మంత్రులకు సీఎం విందు ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నింటా విఫలం చెందిందన్నారు. కాగా యతీంద్ర సిద్దరామయ్య వ్యాఖ్యలపై రామనగర్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుసేన్ మాట్లాడుతూ యతీంద్రకు ఇంకా మాట్లాడటం రాదని ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉందన్నారు.
The post D. K. Shivakumar: డీకే శివకుమార్‌పై ప్రతిపక్ష నేత అశోక్ సంచలన కామెంట్స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
D. K. Shivakumar: డీకే శివకుమార్‌పై ప్రతిపక్ష నేత అశోక్ సంచలన కామెంట్స్
Categories: