రాజమండ్రి బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అరుదైన ఘనత సాధించారు. కామన్ హెల్త్ మహిళా సదస్సులో ఐదు రోజుల పాటు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో మాట్లాడటం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ సదస్సులో తనకు రెండు అరుదైన గౌరవాలు లభించాయని ఉద్ఘాటించారు. శనివారం రాజమండ్రిలో పురందేశ్వరి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.
అణుశక్తి కి సంబంధించి అణుబాంబులు తయారు చేయాలని భారతదేశం ప్రకటించిందని గుర్తుచేశారు. బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించటం ద్వారా ప్రజలు స్పష్టమైన సందేశం ఇచ్చారని చెప్పుకొచ్చారు. రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని వివరించారు. పొగాకు రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో తాను మాట్లాడానని తెలిపారు.
కొవ్వూరులో రెండు రైళ్లు, అనపర్తిలో జన్మభూమి రైలు హాల్ట్ సాధించామని నొక్కిచెప్పారు. మొంథా తుఫాను ప్రభావంతో వాటిల్లిన నష్టంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడానని పేర్కొన్నారు. అలాగే, గోదావరి పుష్కరాలపై అధికారులతో చర్చించారు. ఈ నేపథ్యంలో శాఖాపరమైన విధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గోదావరి పుష్కరాలపై వెంటనే అంచనాలు రూపొందించాలని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఆదేశాలు జారీ చేశారు.
The post Daggubati Purandeswari: కామన్ హెల్త్ మహిళా సదస్సులో పాల్గొన్న ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Daggubati Purandeswari: కామన్ హెల్త్ మహిళా సదస్సులో పాల్గొన్న ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి
Categories: