hyderabadupdates.com Gallery Delhi: ఢిల్లీ పేలుడు ఘటనలో వెలుగులోకి సంచలన విషయాలు

Delhi: ఢిల్లీ పేలుడు ఘటనలో వెలుగులోకి సంచలన విషయాలు

Delhi: ఢిల్లీ పేలుడు ఘటనలో వెలుగులోకి సంచలన విషయాలు post thumbnail image

 
 
ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనతో కేంద్ర ఇంటెలిజన్స్ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. అయితే, ఈ ఘటనలో పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ బాంబు బ్లాస్ట్ ఘటనలో ఇప్పటివరకు ఎనిమిదిమంది మృతిచెందగా, పలువురికి గాయాలైనట్లు తెలిపారు. ఈ ఘటన అనంతరం ఎల్‌ఎన్‌జేపీ హాస్పిటల్‌కు 15 మంది క్షతగాత్రులని తరలించినట్లు వివరించారు. ప్రస్తుతం ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిలో క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. నిన్న(సోమవారం) సాయంత్రం 6:52 గంటలకు పేలుడు ఘటన జరిగిందని అన్నారు. ఈ ఘటనలో 24 మందికి తీవ్రగాయాలు కాగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని కేంద్ర ఇంటెలిజన్స్ అధికారులు తెలిపారు.
 
పేలుడు ధాటికి 10 వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని తెలిపారు. ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ స్థలంలో మూడు గంటల పాటు ఐ20 కారు నిలిపి ఉంచారని వివరించారు. ఈ కారు నిన్న మధ్యాహ్నం 3:19 గంటలకు పార్కింగ్ స్థలంలోకి వచ్చినట్లు గుర్తించారు. ఐ20 కారు నిన్న సాయంత్రం 6:48 గంటలకు పార్కింగ్ స్థలం నుంచి బయలుదేరిందని తెలిపారు. ఆ తర్వాత కాసేపటికే పేలుడు సంభవించిందని పేర్కొన్నారు కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు.
ఢిల్లీ ఎర్రకోట పేలుడులో ఉపయోగించిన కారు గురుగ్రామ్ ఆర్టీవో వద్ద రిజిస్ట్రర్ చేశారని వెల్లడించారు. ఈ కారు HR26CE7674 రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఉందని తెలిపారు. ఈ కారు మహమ్మద్ సల్మాన్ పేరుతో రిజిస్ట్రర్ చేశారని చెప్పుకొచ్చారు. ఈ కేసులో మహ్మద్ సల్మాన్‌ అనే వ్యక్తిని అరెస్టు చేసి విచారించామని తెలిపారు. ఐ20 కారుని తారిక్ పుల్వామా నివాసికి అమ్మేసినట్లు మహ్మద్ సల్మాన్‌ తెలిపారని అన్నారు. అయితే ఈ ఘటనకు కారణమైన కారులో ఉన్న వ్యక్తి వైద్యుడైన మహ్మద్ ఉమర్ అయి ఉంటాడని అధికారులు అనుమానిస్తున్నారు. ఆయనకి ఫరీదాబాద్ మాడ్యూల్‌తో సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్నారు కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు.
ఎర్రకోట వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కారు బాంబు పేలిన సంఘటన స్థలంలో క్లూస్ టీమ్స్ ఆధారాలు సేకరిస్తున్నాయి. ఎర్రకోట పరిసర ప్రాంతంలో పూర్తిగా మెట్రోలను మూసివేశారు అధికారులు. ఢిల్లీలోని పర్యటక ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో నిఘా పెంచారు పోలీసులు. ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు. పేలుడుకు కారణమైన ఐ20 కారుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి రావడంతో ఈ కేసుని కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు సీరియస్‌గా తీసుకుని విచారిస్తున్నారు.
The post Delhi: ఢిల్లీ పేలుడు ఘటనలో వెలుగులోకి సంచలన విషయాలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Amaravati: అమరావతి, గన్నవరంలో మెగా రైల్‌ టెర్మినళ్లుAmaravati: అమరావతి, గన్నవరంలో మెగా రైల్‌ టెర్మినళ్లు

Amaravati : అమరావతి, గన్నవరంలలో మెగా టెర్మినళ్లు నిర్మించేందుకు రైల్వేశాఖ ప్రణాళిక సిద్ధంచేసింది. అమరావతి (Amaravati) మీదుగా భవిష్యత్‌లో పెద్దఎత్తున రైళ్ల రాకపోకలు సాగనుండటంతో… వాటికి అనువుగా 8 ప్లాట్‌ఫాంలతో టెర్మినల్‌ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడ రైళ్ల నిర్వహణ పనులు

Rabri Devi: కుమారుల పోటీపై రబ్రీదేవి సంచలన వ్యాఖ్యలుRabri Devi: కుమారుల పోటీపై రబ్రీదేవి సంచలన వ్యాఖ్యలు

Rabri Devi : బీహార్‌లో ఎన్నికల వేడి కొనసాగుతోంది. రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో మునిగితేలుతున్నాయి. ఇంతలో ఆర్జేడీ చీఫ్‌ లాలూ భార్య రబ్రీదేవి (Rabri Devi) తన కుమారుల పోటీపై వ్యాఖ్యానించారు. తన కుమారుడు, జనశక్తి జనతాదళ్ (జేజేడీ)అధినేత తేజ్ ప్రతాప్

IndiGo Flight: గన్నవరంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్IndiGo Flight: గన్నవరంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

    గన్నవరం విమానాశ్రయంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఈ విమానం హుబ్లీ నుంచి తెలంగాణలోని హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. అయితే హైదరాబాద్ లో వాతావరణం అనుకూలించకపోవడంతో మంగళవారం గన్నవరం విమానాశ్రయంలో ఇండిగో ఫ్లైట్ ను ఎమర్జెన్సీ ల్యాండింగ్