hyderabadupdates.com Gallery Delhi Airport: ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సాంకేతిక సమస్య ! వందల విమానాలు ఆలస్యం !

Delhi Airport: ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సాంకేతిక సమస్య ! వందల విమానాలు ఆలస్యం !

Delhi Airport: ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సాంకేతిక సమస్య ! వందల విమానాలు ఆలస్యం ! post thumbnail image

 
 
దేశ రాజధాని దిల్లీ, ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు జైపుర్, లఖ్‌నవూ, వారణాసి, ఇతర అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనూ శుక్రవారం ఇదే పరిస్థితి ఏర్పడింది. తొలుత దిల్లీ విమానాశ్రయంలో ఏర్పడిన ఈ సమస్య… తర్వాత ఇతర ఎయిర్‌పోర్టులకు ఎదురవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దిల్లీలోని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌(ఏటీసీ) వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తడంతో 800కుపైగా దేశీయ, అంతర్జాతీయ సర్వీసులపై ప్రభావం పడింది. ఇండిగో, ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, స్పైస్‌జెట్, ఆకాశ ఎయిర్‌లైన్స్‌లకు చెందిన విమానాలు ఈ జాబితాలో ఉన్నాయి.
 
దీనితో ఏ విమానం ఎప్పుడొస్తుందో తెలియక.. వచ్చిన విమానం ఎప్పుడు బయల్దేరుతుందో తెలియక.. బోర్డింగ్‌ పాస్‌లలు ఇచ్చే గేట్ల వద్ద వందలాది ప్రయాణికులు.. గంటలకొద్దీ నిరీక్షించాల్సి వచ్చింది. గంటల కొద్ది నిరీక్షించలేక ప్రయాణికుల్లో అసహనం వ్యక్తమయింది. రోజుకు 1500కు పైగా విమానాల రాకపోకలతో… దేశంలోనే అత్యంత రద్దీ కలిగిన విమానాశ్రయంగా పేరొందిన ఢిల్లీ ఎయిర్‌పోర్టులో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ‘ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ)’లో సాంకేతిక సమస్య కారణంగా వందలాది విమానాలు ఆలస్యమయ్యాయి. దేశీ, అంతర్జాతీయ సర్వీసులన్నీ కలిపి 800కు పైగా విమానాలపై ఈ ప్రభావం పడినట్టు సమాచారం.
ఇండిగో, ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌, స్పైస్‌జెట్‌, ఆకాశ ఎయిర్‌.. ఇలా అన్ని సంస్థలూ తమ విమానాలు ఆలస్యమైనట్టు ప్రకటించాయి. ఈ సమస్య ప్రభావం దేశంలోని ఇతర నగరాల్లోని ఎయిర్‌పోర్టులపైనా తీవ్రంగా పడుతోంది. రాజధాని నుంచి రావాల్సిన విమానాలు ఆలస్యం అవుతుండడంతో.. జైపూర్‌, లఖ్‌నవూ, ముంబై, వారాణసీ తదితర విమానాశ్రయాల్లోనూ పలు సర్వీసుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో ఆయా విమానాశ్రయాల అధికారులు.. ఈ ఆలస్యం గురించి ప్రయాణాకులకు ముందుగానే సమాచారం అందిస్తున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో 60కిపైగా సర్వీసులపై ఈ ప్రభావం పడింది.
 
విమానాల రాకపోకలకు అత్యంత కీలకమైన ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ డేటాకు సంబంధించి ‘ఆటోమేటిక్‌ మెసేజ్‌ స్విచింగ్‌ సిస్టమ్‌ (ఏఎంఎస్ఎస్’’లో సాంకేతిక సమస్య ఏర్పడడమే ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఈ గందరగోళానికి కారణమని విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ) తెలిపింది. గురువారం సాయంత్రం నుంచీ.. ఈ సమస్య కారణంగా ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్లకు.. విమానాల ప్రణాళికలు ఆటోమేటిగ్గా రావట్లేదు. దీంతో వారు తమకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఫ్లైట్‌ ప్లాన్స్‌ను మాన్యువల్‌గా సిద్ధం చేయాల్సి వస్తోంది. అందుకు ఎక్కువ సమయం పడుతుండడంతో విమానాలు బయల్దేరడం బాగా ఆలస్యమవుతోంది. ప్రముఖ ఫ్లైట్‌ ట్రాకింగ్‌ వెబ్‌సైట్‌ ‘ఫ్లైట్‌రేడార్‌24.కామ్‌’ ప్రకారం.. ఈ సమస్య కారణంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 300కు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి.
 
మాల్‌వేరే కారణమా ?
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రస్తుత సమస్యకు సాంకేతిక సమస్యలే కారణమని అధికారులు చెబుతున్నప్పటికీ.. ఏటీసీ ఆటోమేషన్‌ సాఫ్ట్‌వేర్‌లో ఎవరో కావాలనే మాల్‌వేర్‌ను ప్రవేశపెట్టడం వల్లే ఇలా జరిగిందని, ఇది లక్ష్యిత దాడేనని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ‘సీఎన్‌ఎన్‌-న్యూ్‌స 18’ వెబ్‌సైట్‌ ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ మాల్‌వేర్‌ సిస్టమ్‌ ఇంటర్‌ఫే్‌సలను,, రేడార్‌ సింక్రనైజేషన్‌ మాడ్యూళ్లను లక్ష్యంగా చేసుకుంటున్నట్టుగా ఆ వర్గాలు పేర్కొన్నట్టు అందులో వివరించింది. ఇటీవలికాలంలో సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేయకపోవడం, రియల్‌టైమ్‌ బ్యాకప్‌ లేకపోవడం వల్ల పరిస్థితి ఇంకా దారుణంగా తయారైనట్టు వెల్లడించింది.
The post Delhi Airport: ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సాంకేతిక సమస్య ! వందల విమానాలు ఆలస్యం ! appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Deepika Padukone Addresses Work Hours and Project ExitsDeepika Padukone Addresses Work Hours and Project Exits

Bollywood star Deepika Padukone has addressed reports regarding her withdrawal from major film projects, citing industry work culture and professional challenges. In a recent interview with international media, the actress

Delhi Air Pollution: ఢిల్లీలో రికార్డు స్థాయికి వాయు కాలుష్యంDelhi Air Pollution: ఢిల్లీలో రికార్డు స్థాయికి వాయు కాలుష్యం

  దేశ రాజధాని ఢిల్లీ వాయు కాలుష్యం కుమ్మేసింది. మంగళవారం నమోదయిన వాయు నాణ్యత నాలుగేళ్ల కనిష్టానికి పడిపోయింది. 24 గంటల సరాసరి వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) సోమవారం 4 గంటల సమయంలో 345కి పడిపోయి, వెరీ పూర్‌ విభాగంలో చేరిందని

Sabarimala: శబరిమల ఆలయంలో యోగదండం మాయం ?Sabarimala: శబరిమల ఆలయంలో యోగదండం మాయం ?

Sabarimala : శబరిమల గర్భగుడి నుండి బంగారు పూత కోసం తీసుకెళ్లిన అమూల్యమైన యోగదండం (పవిత్ర దండం) తిరిగి ఇవ్వబడలేదని సమాచారం బయటపడింది. పురాతన యోగదండం 2018లో బంగారు పూత కోసం తీసుకోబడింది. అయితే, బంగారు తాపడం తర్వాత కొత్తగా తయారు