hyderabadupdates.com Gallery Deputy Speaker: డీజీపీకు డిప్యూటీ స్పీకర్ రఘురామ ఫిర్యాదు 

Deputy Speaker: డీజీపీకు డిప్యూటీ స్పీకర్ రఘురామ ఫిర్యాదు 

Deputy Speaker: డీజీపీకు డిప్యూటీ స్పీకర్ రఘురామ ఫిర్యాదు  post thumbnail image

 
 
కూటమి పక్షాల మధ్య, కులాల మద్య చిచ్చుపెట్టేందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారిపై డీజీపీకి పిర్యాదు చేశారు. అంభోజి వినయ్ కుమార్ పేరుతో ఫేస్‌బుక్‌లో కరుడుగట్టిన వైసీపీ సపోర్టర్ ఫేక్ పోస్టులను పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. దీని వల్ల అధికార కూటమిలో వైషమ్యాలు తీసుకురావడంతో పాటు కులాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తాను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ఎన్నడూ చేయని కామెంట్లను చేసినట్టు… సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఈ పోస్టులకు సంభందించి స్క్రీన్ షాట్‌లు, లింకులను కూడా తన ఫిర్యాదులో జత చేసినట్లు తెలిపారు. ఇలాంటి పోస్టులు పెట్టిన వారిపై భారతీయ న్యాయ సంహితలో ఉన్న సెక్షన్‌లను సైతం ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. ఈ అంశంపై తక్షణం విచారణకు ఆదేశించి ఈ ఫేక్ పోస్టుల మూలలను శోదించాలని, భాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కోరారు.
 
ఈ దశాబ్దం మోదీదే – సీఎం చంద్రబాబు
 
ఈ దశాబ్దం మోదీదే అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. ఎన్డీయే ప్రగతిశీల ప్రభుత్వమని కొనియాడారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. బిహార్ సీఎం నీతీశ్‌ కుమార్, అధికార కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తానని వెల్లడించారు.
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం సామాన్యుల సాధికారతే లక్ష్యంగా సంస్కరణలు తీసుకువస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ఎన్నికల హామీ ‘సూపర్ సిక్స్‌’ను విజయవంతంగా అమలు చేస్తోందని వెల్లడించారు. ‘‘భారత్‌లో ఎంతో ఆసక్తిని కలిగించే అంశాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధాని మోదీ 2000 సంవత్సరం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ఎల్లప్పుడూ ఎన్నికల్లో విజయం సాధిస్తూనే ఉంటారు. గతంలో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014 నుంచి 11 ఏళ్లుగా ప్రధానిగా కొనసాగుతున్నారు. మరో నాలుగు సంవత్సరాలు ఆయనే ఉంటారు. ఈ దశాబ్దం మోదీదే. అంటే ఆటోమెటిగ్గా భారతీయులదే’’ అని చంద్రబాబు వెల్లడించారు.
ఇటీవల కేంద్రం తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలపై చంద్రబాబు మాట్లాడారు. వాటివల్ల ప్రజల సేవింగ్స్‌ పెరుగుతాయని తెలిపారు. ఎంఎస్‌ఎంఈ రంగం, ఇతర వ్యాపారవేత్తలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఏ దేశ తలసరి ఆదాయంలోనైనా ఆ దేశంలో నివసించే భారతీయులదే ఆధిపత్యం అని ప్రస్తుతం దుబాయ్‌ పర్యటనలో ఉన్న ఆయన పేర్కొన్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెంచేందుకు పలువురు వ్యాపారవేత్తలతో భేటీ అయ్యారు. వచ్చే నెలలో విశాఖపట్నంలో జరిగే సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో పాల్గొనాలని ఆహ్వానించారు. వచ్చే నెలలో ఆర్సెలార్‌మిత్తల్‌ నిప్పాన్‌ స్టీల్‌ ప్లాంట్‌కు ఆంధ్రాలో శంకుస్థాపన జరగనున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ, వ్యవసాయం, ఉద్యానరంగం, లాజిస్టిక్స్‌, రాజధాని నగరం అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. 750 వరకు సేవలను వాట్సప్‌ ద్వారా అందిస్తున్నామంటూ రియల్ టైమ్ గవర్నెన్స్‌ గురించి పేర్కొన్నారు. అలాగే తెలుగు కమ్యూనిటీ గురించి మాట్లాడుతూ.. భవిష్యత్‌లో ఒకరోజు ఈ గ్రహంపై అత్యంత ప్రభావవంతమైన సమాజంగా తెలుగు కమ్యూనిటీ నిలుస్తుందని, ఆ దిశగా ప్రణాళికలు చేస్తున్నామని వెల్లడించారు. గత 15 నెలల్లో తమ ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు సేకరించిందని, మరో రూ.5లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.
The post Deputy Speaker: డీజీపీకు డిప్యూటీ స్పీకర్ రఘురామ ఫిర్యాదు  appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Supreme Court: లాయర్ రాకేష్‌ కిషోర్‌ పై సుప్రీం కోర్టులో ఆసక్తికర చర్చSupreme Court: లాయర్ రాకేష్‌ కిషోర్‌ పై సుప్రీం కోర్టులో ఆసక్తికర చర్చ

Supreme Court : తనపై షూ విసిరిన లాయర్‌(సస్పెండెడ్‌) రాకేష్‌ కిషోర్‌ (Rakesh Kishore) ను భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్‌ గవాయ్‌ క్షమించినా… న్యాయ వ్యవస్థ మాత్రం వదిలిపెట్టడం లేదు. ఆయనపై కోర్టు ధిక్కరణ కింద క్రిమినల్‌ చర్యలకు ఉపక్రమించాలని

YS Jagan: జగన్ అనకాపల్లి, విశాఖ జిల్లాల పర్యటనకు వైసీపీ విస్తృత ఏర్పాట్లుYS Jagan: జగన్ అనకాపల్లి, విశాఖ జిల్లాల పర్యటనకు వైసీపీ విస్తృత ఏర్పాట్లు

    వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం అనకాపల్లి,విశాఖ జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌ జగన్‌ పర్యటన వివరాలను వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. వైసీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసిన వివరాల