డిజిటల్ అరెస్టు పేరుతో పలువురిని సైబర్ క్రిమినల్స్ ఇటీవల మోసం చేస్తున్నారు. సైబర్ నేరస్తుల బారిన పడి బాధితులు పెద్దమొత్తంలో నష్టపోతున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ భార్యను సైతం డిజిటల్ అరెస్ట్ చేశారు కేటుగాళ్లు. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పుట్టా సుధాకర్ యాదవ్ . ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు ఏడుగురిని అరెస్ట్ చేశారు కడప జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు. డిజిటల్ అరెస్ట్‌కు పాల్పడిన నిందితుల్లో ఢిల్లీకు చెందిన ఐడీఎఫ్సీ బ్యాంక్ మేనేజర్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తమ నుంచి సైబర్ నేరస్తులు రూ. 1.7 కోట్లు మోసం చేశారని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పేర్కొన్నారు.
మరోవైపు.. డిజిటల్ అరెస్ట్‌పై ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున కూడా స్పందించారు. తమ కుటుంబంలో ఒకరు డిజిటల్ అరెస్ట్‌కు గురయ్యారని తెలిపారు. పోలీసులను ఆశ్రయిస్తే సమస్యను పరిష్కరించారని గుర్తుచేశారు. పైరసీని అరికట్టడంలో పోలీసుల కృషి అభినందనీయమని ప్రశంసించారు. ఇవాళ(సోమవారం) హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ని సినీ ప్రముఖులు కలిశారు. ఈ నేపథ్యంలోనే నాగార్జున ఈ వ్యాఖ్యలు చేశారు.
డిజిటల్ అరెస్ట్ నేరాలు తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు – సీపీ రాజశేఖర బాబు
సైబర్ నేరాలను అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా… నేరగాళ్లు మాత్రం కొత్త ఎత్తులు వేస్తున్నారని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. డిజిటల్ అరెస్ట్ నేరాలను నివారించేందుకు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వివరించారు. సైబర్ సురక్ష అనే స్లోగన్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి… సైబర్ నేరగాళ్ల ఆట కట్టిస్తామని ఆయన సోమవారం విజయవాడలో ప్రకటించారు. బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు, ప్రజల్లో అవగాహన తీసుకొచ్చే విధంగా సైబర్ సురక్షా పేరుతో నెల రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. సైబర్ నేరాలు వివిధ రూపాలలో జరుగుతున్నాయన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వారి కదలికలపై దృష్టి పెట్టి దొంగలను పట్టుకుంటున్నామని పేర్కొన్నారు.
The post Digital Arrest: ఎమ్మెల్యే భార్య డిజిటల్ అరెస్ట్ చేసిన సైబర్ నేరగాళ్ళు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Digital Arrest: ఎమ్మెల్యే భార్య డిజిటల్ అరెస్ట్ చేసిన సైబర్ నేరగాళ్ళు
Categories: