hyderabadupdates.com Gallery Diwali: రాజస్థాన్ లో కిలో స్వీట్ రూ. 1.11 లక్షలు

Diwali: రాజస్థాన్ లో కిలో స్వీట్ రూ. 1.11 లక్షలు

Diwali: రాజస్థాన్ లో కిలో స్వీట్ రూ. 1.11 లక్షలు post thumbnail image

Diwali : పండగల వేళ.. ముఖ్యంగా దసరా, దీపావళి వేళ.. తమ సంస్థ ఉద్యోగులకు స్వీట్లు అందజేస్తాయి యాజమాన్యం. దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని సంస్థలు ఈ విధంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో దీపావళీకి మిఠాయి షాపుల్లో స్వీట్స్‌కు భారీగా డిమాండ్ ఏర్పడింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో మిఠాయి దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. అలాంటి వేళ.. దీపావళి (Diwali) వేడుకల ప్రారంభమవుతున్న సమయంలో రాజస్థాన్ రాజధాని జైపూర్‌కు చెందిన మిఠాయి వ్యాపారి అంజలి జైన్ స్వర్ణ ప్రసాదం పేరిట అత్యంత ఖరీదైన స్వీట్‌ను రూపొందించారు. దీని ధర కిలో రూ. 1.11 లక్షలుగా నిర్ణయించారు.
ఈ స్వర్ణ ప్రసాదం తయారీలో కుంకుమ పువ్వు, పైన్ గింజలతోపాటు స్వర్ణ భస్మాన్ని వినియోగించారు. అలాగే స్వచ్ఛమైన బంగారంతో పూత పోసిన ఆభరణాల తరహా పెట్టెల్లో ఈ స్వీట్లను ప్యాక్ చేస్తారు. అదీకాక కుంకుమ పువ్వు, స్వర్ణ భస్మం అత్యంత ఖరీదైన వస్తువులు. ఇవి సామాన్యంగా ప్రతి చోట లభ్యం కావు. నాణ్యమైనవి కావాలంటే.. భారీగా నగదు వెచ్చించి కొనుగోలు చేయాలి. ఆ క్రమంలో ఈ స్వీట్ ధరను రూ. లక్షకు పైగా నిర్ణయించి విక్రయిస్తున్నారు.
Diwali – ప్రత్యేక ఆకర్షణగా భోపాల్‌ ‘బంగారు మిఠాయి’
దీపావళి పండగ అంటే గుర్తొచ్చేది టపాసులు, మిఠాయిలే. దీపావళి (Diwali) రోజున తీపిని పంచుకునే సంప్రదాయం అందరికీ ఉంటుంది. పండగ దగ్గర పడుతుండడంతో వినియోదారులను ఆకర్షించేందుకు దుకాణదారులు వివిధ వెరైటీల స్వీట్స్‌ను తయారు చేస్తుంటారు. ఈసారి మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని ఓ వ్యక్తి చేసిన బంగారు స్వీట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీని విలువ కేజీ రూ.36,000. అంత ధర ఎందుకంటారా? ఆ స్వీట్‌ తయారీకి ఉపయోగించిన పదార్థాలు అలాంటివి మరి.
అఫ్గానిస్థాన్‌ నుంచి దిగుమతి చేసుకుని కశ్మీర్‌లో ఎంపిక చేసిన ప్రాంతాలలో పండించే అత్యంత ఖరీదైన పిషోరి పిస్తా పప్పులు, వాల్‌నట్‌లు.. కిన్నౌర్, కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, అఫ్గానిస్థాన్‌లలో ఉత్పత్తి చేసే అరుదైన చిల్గోజా గింజలు, స్వచ్ఛమైన కుంకుమ పువ్వులను ఉపయోగించి ఈ స్వీట్‌ను తయారు చేసినట్లు దుకాణం యజమాని తెలిపారు. అనంతరం దానిపై బంగారు పూతను పూసినట్లు తెలిపారు. అందువల్లే ఈ స్వీట్‌ అంత ఖరీదు మరి.
Also Read : TTD: మంగళూరులో శ్రీవారి ఆలయానికి భూమి మంజూరు చేసిన ప్రభుత్వం
The post Diwali: రాజస్థాన్ లో కిలో స్వీట్ రూ. 1.11 లక్షలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Local Body Elections: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేతLocal Body Elections: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేత

Local Body Elections : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు (High Court) తీర్పు నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల విడుదల చేసిన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలిపివేసినట్లు ప్రకటించింది.

Pawan Kalyan: ప్రజలకు న్యాయం చేయలేకపోతే రాజకీయాలు వదిలేస్తా – పవన్ కళ్యాణ్Pawan Kalyan: ప్రజలకు న్యాయం చేయలేకపోతే రాజకీయాలు వదిలేస్తా – పవన్ కళ్యాణ్

    నేను ఉప ముఖ్యమంత్రిగానో… ఎమ్మెల్యేగానో… ఉప్పాడకు రాలేదు. ఓ మత్స్యకారుడి బాధను అర్థం చేసుకోవడానికి వారి ఇంట్లోని సభ్యుడిగా… వారిలో ఒకడిగా వచ్చాను. నాకు మత్స్యకారులు పడుతున్న వేదన, వేట కోసం పడుతున్న యాతన తెలిసి… ఇక్కడికి వచ్చానని