hyderabadupdates.com Gallery DK Shivakumar: కిరణ్‌ మజుందార్‌ షా పై డీకే వ్యంగ్యాస్త్రాలు

DK Shivakumar: కిరణ్‌ మజుందార్‌ షా పై డీకే వ్యంగ్యాస్త్రాలు

DK Shivakumar: కిరణ్‌ మజుందార్‌ షా పై డీకే వ్యంగ్యాస్త్రాలు post thumbnail image

 
 
బెంగళూరు రోడ్ల పరిస్థితిపై ఇటీవల తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ విషయంపై బయోకాన్ లిమిటెడ్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజుందార్ షా విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ విషయంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ వ్యంగ్యంగా బదులిచ్చారు. మజుందార్‌ షా రోడ్లను అభివృద్ధి చేయాలనుకుంటే చేయొచ్చంటూ డీకే పేర్కొన్నారు. ఆమె వచ్చి అడిగితే… ఆ గుంతలు పూడ్చేందుకు నిధులు కేటాయిస్తామన్నారు. ఈ సందర్భంగా బెంగళూరు నగర అభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిందన్నారు.
గత కొంతకాలంగా బెంగళూరు రోడ్ల పరిస్థితిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బయోకాన్‌ పార్క్‌కు వచ్చిన ఓ విదేశీ విజిటర్‌… నగరంలోని రోడ్లు, చెత్తపై చేసిన వ్యాఖ్యలతో తాను ఇబ్బందిపడ్డానని ఆమె ఓ పోస్టులో వెల్లడించారు. ఇది కాస్త వైరల్‌ అయ్యింది. దీనిపై కర్ణాటక మంత్రి ప్రియాంక్‌ ఖర్గే స్పందించారు. బెంగళూరులో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందన్నారు. మౌలిక సదుపాయాలకు అవసరమైనవన్నీ చేస్తున్నామన్నారు. ఈ విషయంపై బ్లాక్‌బక్‌’ అనే కంపెనీ సీఈఓ రాజేశ్‌ యాబాజీ కూడా గతంలో ఓ పోస్టు పెట్టారు.
అంతకుముందు, కర్ణాటక రాజధాని బెంగళూరులో అస్తవ్యస్త పరిస్థితులను బయోకాన్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజుందార్‌ షా ట్విట్టర్‌ వేదికగా..‘చెత్త కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లోని ఏ మున్సిపాల్టీ కూడా దీనిని పరిష్కరించడం లేదు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు లాంటి నగరాల్లో ఈ చెత్త సమస్య చాలా చాలా దయనీయంగా ఉంది’ అని పేర్కొన్నారు. దీంతో, ఆమె పోస్టు వైరల్‌ అయ్యింది.
 
The post DK Shivakumar: కిరణ్‌ మజుందార్‌ షా పై డీకే వ్యంగ్యాస్త్రాలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CM Chandrababu: కుటుంబసభ్యులతో సీఎం చంద్రబాబు దీపావళి సంబరాలుCM Chandrababu: కుటుంబసభ్యులతో సీఎం చంద్రబాబు దీపావళి సంబరాలు

    ఆంధ్రప్రదేశ్‌లో దీపావళి సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పల్లె, పట్టణాలు, నగరాలు అని తేడా లేకుండా వీధులన్నీ ప్రజలతో నిండిపోయాయి. సోమవారం సాయంత్రం నుంచే వయసుతో సంబంధం లేకుండా ప్రజలంతా రోడ్లపైకి వచ్చి టపాసులు పేలుస్తూ ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారు.

CM MK Stalin: విజయ్‌ ఆలస్యంగా రావడం వలనే తొక్కిసలాట జరిగింది – స్టాలిన్‌CM MK Stalin: విజయ్‌ ఆలస్యంగా రావడం వలనే తొక్కిసలాట జరిగింది – స్టాలిన్‌

CM MK Stalin : టీవీకే (TVK) పార్టీ అధ్యక్షుడు విజయ్‌ కరూర్‌లో నిర్వహించిన ప్రచార ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా తమిళనాడు అసెంబ్లీలో చర్చజరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌