hyderabadupdates.com Gallery DK Shivakumar: నాయకత్వ మార్పు ఊహాగానాలపై డీకే ఆశక్తిర వ్యాఖ్యలు

DK Shivakumar: నాయకత్వ మార్పు ఊహాగానాలపై డీకే ఆశక్తిర వ్యాఖ్యలు

DK Shivakumar: నాయకత్వ మార్పు ఊహాగానాలపై డీకే ఆశక్తిర వ్యాఖ్యలు post thumbnail image

DK Shivakumar : కర్ణాటకలో నాయకత్వ మార్పు జరిగే అవకాశాలున్నాయంటూ వస్తున్న ఊహాగానాలను ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) మరోసారి కొట్టివేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో నేతలంతా ఐక్యంగా ఉన్నారని చెప్పారు. నాయకుడి కోసం మీడియానో, పార్టీలోని వారో వెతకాల్సిన అవసరం లేదని అన్నారు. నాయకత్వ మార్పు విషయంపై తాను కానీ ముఖ్యమంత్రి కానీ చెబితేనే నమ్మాలని, ఇంకెవరు చెప్పినా దానికి విలువలేదని శనివారంనాడు కంఠీరవ స్టేడియంలో మీడియాతో మాట్లాడుతూ డీకే చెప్పారు. సీఎంతో మునుపటిలాగానే చక్కటి సమన్వయం కొనసాగుతోందని, అందరూ ఐక్యంతో ఉండటం వల్లే 136 నియోజకవర్గాల్లో గెలిచి 140కి బలం పెరిగిందని చెప్పారు.
ప్రతిపాదిత టన్నెల్ రోడ్ ప్రాజెక్ట్‌ను బీజేపీ (BJP) వ్యతిరేకించడటంపై మాట్లాడుతూ, అసెంబ్లీ విపక్ష నేత ఆర్.అశోక నాయకత్వంలో టన్నెల్ రోడ్ అంశంపై కమిటీ వేయడానికి తాను సిద్ధమేనని అన్నారు. నగరంలోని మౌలిక సదుపాయాలపై రెండు పార్టీలు కలిసి పనిచేసే విషయంలో తాను ఓపెన్‌గానే ఉన్నానని, బెంగుళూరు వ్యక్తిననే కారణంగా ప్రదర్శనలకు అశోక కూర్చోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఇక్కడ నుంచి ఏడెనిమిది సార్లు ఆయన కూడా గెలిచినందున ఆయనకు కూడా బాధ్యత ఉంటుందని అన్నారు. ఆయన నాయకత్వంలో కమిటీ ఏర్పడి ప్రభుత్వానికి తగిన సూచనలు చేయవచ్చన్నారు. ఎంట్రీ పాయింట్ల విషయంలో తాను కూడా లాల్‌బాగ్ సమీపంలోని ఏరియాలో పర్యటించానని, ప్రత్నామ్యాయ రూట్లు కూడా పరిశీలిస్తున్నానని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పారు.
DK Shivakumar – ఇంగ్లీష్‌, హిందీపై సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (CM Siddaramaiah) మరోమారు బాషలకు సంబంధించిన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్రం పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేస్తూ, కన్నడను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఇంగ్లీష్, హిందీపై అతిగా ఆధారపడుతున్న కారణంగా… రాష్ట్రంలోని పిల్లల సహజ ప్రతిభ క్షీణిస్తున్నదని సిద్దరామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. త్రిభాషా విధానంపై కొనసాగుతున్న వివాదం మధ్య సీఎం వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
బెంగళూరులో జరిగిన రాజ్యోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ ఫెడరల్ ప్రభుత్వం కర్ణాటకపై నిర్లక్క్ష్య వైఖరిని చూపుతోందని ఆరోపించారు. తాము కేంద్రానికి రూ. 4.5 లక్షల కోట్ల ఆదాయాన్ని అందిస్తున్నప్పటికీ, ప్రతిఫలంగా చాలా తక్కువ మొత్తాన్ని మాత్రమే పొందుతున్నామని పేర్కొన్నారు. హిందీ, సంస్కృతం ప్రోత్సాహానికి ఉదారంగా గ్రాంట్లు మంజూరు చేస్తున్నప్పటికీ, కన్నడతో సహా ఇతర భారతీయ భాషలను పక్కనపెడుతున్నారని సీఎం ఆరోపించారు.
అభివృద్ధి చెందిన దేశాలలోని పిల్లలు తమ మాతృభాషలోనే ఆలోచిస్తారు.. నేర్చుకుంటారు..కలలు కంటారు.. కానీ ఇక్కడి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇంగ్లీష్, హిందీ బాషలు ఇక్కడి పిల్లల ప్రతిభను బలహీనపరుస్తున్నాయని సిద్దరామయ్య పేర్కొన్నారు. ప్రారంభ పాఠశాల విద్యలో మాతృభాష విద్యను తప్పనిసరి చేసేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిద్ధరామయ్య పిలుపునిచ్చారు. మాతృభాషను బోధనా మాధ్యమంగా ప్రవేశపెట్టడానికి చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read : Murder: హత్యకు దారి తీసిని నైట్ షిఫ్ట్‌ ఉద్యోగుల గొడవ.
The post DK Shivakumar: నాయకత్వ మార్పు ఊహాగానాలపై డీకే ఆశక్తిర వ్యాఖ్యలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ప్ర‌జా యుద్ద‌నౌక గ‌ద్ద‌ర్ కు నివాళిప్ర‌జా యుద్ద‌నౌక గ‌ద్ద‌ర్ కు నివాళి

హైద‌రాబాద్ : తెలంగాణ మ‌ట్టిలో మొల‌కెత్తిన గొంతుక‌, ప్ర‌జా స్వ‌ర‌పేటిక గుమ్మ‌డి విఠ‌ల్ రావు అలియాస్ గ‌ద్ద‌ర్ జ‌యంతి ఇవాళ‌. ఆయ‌న మ‌న మ‌ధ్య లేరు. కానీ త‌ను పాడిన పాట‌లు ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ ఉంటాయి. మ‌న‌ల్ని గాయ‌ప‌రుస్తూనే ఉంటాయి. చ‌ని

APEPDCL: మొంథా తుపాను ప్రభావంతో ఏపీఈపీడీసీఎల్ కు 10 కోట్లు నష్టంAPEPDCL: మొంథా తుపాను ప్రభావంతో ఏపీఈపీడీసీఎల్ కు 10 కోట్లు నష్టం

  మొంథా తుపాను కారణంగా దెబ్బతిన్న విద్యుత్తు సరఫరా వ్యవస్థను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నామని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ తెలిపారు. బుధవారం కోనసీమ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు విద్యుత్‌ పునరుద్ధరణ చర్యల పురోగతిని ఆయన వివరించారు. అన్ని సెక్షన్ కార్యాలయాలకు జనరేటర్లు,

Sonakshi Sinha Breaks Silence on Pregnancy Rumours with A Witty ResponseSonakshi Sinha Breaks Silence on Pregnancy Rumours with A Witty Response

Bollywood actress Sonakshi Sinha has finally addressed the persistent rumours surrounding her pregnancy in a humorous way. The actress, who recently attended an event with her husband Zaheer Iqbal, found