hyderabadupdates.com Gallery Donald Trump: ప్రధాని మోదీపై ట్రంప్‌ ప్రశంసల వర్షం

Donald Trump: ప్రధాని మోదీపై ట్రంప్‌ ప్రశంసల వర్షం

Donald Trump: ప్రధాని మోదీపై ట్రంప్‌ ప్రశంసల వర్షం post thumbnail image

Donald Trump : భారత ప్రధాని నరేంద్ర మోదీతో అంత ఈజీ కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. త్వరలో భారత్‌తో వాణిజ్య చర్చలకు సిద్ధమవుతున్న ట్రంప్‌… దక్షిణకొరియా వేదికగా ట్రంప్ (Donald Trump)… మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. దీనితో భారత్‌ తో స్నేహ హస్తాన్ని కాదనుకుంటే తమకే ముప్పు తప్పదని ట్రంప్‌ గ్రహించారా అనే విధంగా ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.
దక్షిణకొరియా వేదికగా ట్రంప్ (Donald Trump) మాట్లాడుతూ… ‘నాకు మోదీతో (PM Modi) మంచి రిలేషన్‌ ఉంది. ఆయన చూడటానికి చాలా సౌమ్యంగా కనిపిస్తారు. తండ్రిలా కనిపిస్తారు. కానీ ఆయనతో అంత ఈజీ కాదు. మోదీ అంటే నరకం కంటే కఠినం. ఆయనొక ‘కిల్లర్‌’’ అంటూ కొనియాడారు. ఇక్కడ కిల్లర్‌ అనే కాస్త వివాదాస్పదంగా కనిపిస్తున్నప్పటికీ ఎక్కడా కూడా వెనుకడుగేసి నైజం మోదీలో లేదనేది ట్రంప్‌ చెప్పకనే చెప్పేశారు. దక్షిణ కొరియాలోని గ్యోంగ్జులో జరిగిన ఆసియన్‌-పసిఫిక్‌ ఎకనామిక్‌ కో ఆపరేషన్‌ (APEC) సీఈఓల సమ్మిట్‌లోట్రంప్ మాట్లాడుతూ… మోదీని ఆకాశానికెత్తేశారు. భారత–అమెరికా వాణిజ్య ఒప్పందం త్వరలోనే జరిగే అవకాశముందని చెప్పారు ట్రంప్‌.- పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల సమయంలో మోదీతో జరిగిన సంభాషణను సైతం వివరించారు ట్రంప్‌. ఆ సమయంలో మోదీ తనతో మాట్లాడిన శైలిని సైతం ట్రంప్‌ అనుకరించారు.
Donald Trump – ప్రపంచానికి దారిదీపం భారత్‌ – మారిటైమ్‌ లీడర్స్‌ సదస్సులో ప్రధాని మోదీ
అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు, వాణిజ్యంలో అంతరాయాలు, సరకు రవాణా గొలుసుల్లో విపరీత మార్పుల వంటి ప్రతికూల పరిణామాల నేపథ్యంలో ప్రపంచానికి భారత్‌ ఒక స్థిరమైన దారిదీపంగా నిలుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) చెప్పారు. వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి, శాంతి, సమగ్రాభివృద్ధికి భారత్‌ ఒక ప్రతీకగా మారిందని హర్షం వ్యక్తంచేశారు. బుధవారం ముంబైలో ఇండియా మారిటైమ్‌ వీక్‌–2025 సందర్భంగా మారిటైమ్‌ లీడర్స్‌ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. మహోన్నతమైన రాజ్యాంగం, విశ్వసనీయత అనేవి మన దేశాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయని స్పష్టంచేశారు. నేటి అంతర్జాతీయ ఒడిదొడుకుల పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు ఒక దారిదీపం కోసం ఎదురు చూస్తున్నాయని, తెలిపారు. గొప్ప బలంతో మన దేశం ఆ దారిదీపం పాత్రను పోషిస్తోందని వివరించారు.
భారత సముద్రయాన రంగం అత్యధిక వేగం, శక్తితో ముందుకు దూసుకెళ్తోందని పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో మన ఓడరేవులు గొప్ప సామర్థ్యం కలిగినవిగా గుర్తింపు పొందాయని వెల్లడించారు. మన సముద్రయానం, వాణిజ్య కార్యక్రమాలు విస్తృతమైన దార్శనికతలో భాగమని చెప్పారు. భవిష్యత్తులో నూతన వాణిజ్య మార్గాలకు ఇండియా–మిడిల్‌ ఈస్ట్‌–యూరప్‌ ఎకనామిక్‌ కారిడార్‌ ఒక ఉదాహరణ అని స్పష్టంచేశారు.
బ్రిటిష్‌ కాలం నాటి నౌకాయాన చట్టాలను రద్దు చేశామని, 21వ శతాబ్దానికి అవసరమైన నూతన చట్టాలను ప్రవేశపెట్టామని ప్రధాని మోదీ గుర్తుచేశారు. దీంతో స్టేట్‌ మారిటైమ్‌ బోర్డులు మరింత బలోపేతం అయ్యాయని, పోర్ట్‌ మేనేజ్‌మెంట్‌లో డిజిటల్‌ టెక్నాలజీకి ప్రాధాన్యం లభిస్తోందని తెలియజేశారు. మారిటైమ్‌ ఇండియా విజన్‌లో భాగంగా 150 ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. దీనివల్ల సముద్రయాన రంగంలో గణనీయమైన పురోగతి సాధ్యమవుతోందని వెల్లడించారు. మనదేశంలోని ప్రధానమైన ఓడరేవుల సామర్థ్యం రెండు రెట్లు పెరిగిందన్నారు.
క్రూయిజ్‌ టూరిజం గొప్పగా వృద్ధి చెందుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఓడల్లో సరుకు రవాణా 700 శాతానికిపైగా పెరిగిందన్నారు. ప్రధానమైన జల రవాణా మార్గాల సంఖ్య 32కు చేరిందన్నారు. భారతదేశ అభివృద్ధికి మారిటైమ్‌ రంగం ప్రధాన చోదక శక్తిగా మారిందని ప్రధానమంత్రి స్పష్టంచేశారు. 21వ శతాబ్దంలో త్రైమాసికం ముగిసిందని, రాబోయే 25 ఏళ్లు అత్యంత కీలకమని సూచించారు. సముద్ర వనరుల ఆధారిత ఆర్థిక వ్యవస్థ, సుస్థిర తీర ప్రాంత అభివృద్ధిపై మరింతగా దృష్టి కేంద్రీకరించాలని స్పష్టంచేశారు.
Also Read : Amit Shah: తనయుల కోసం సోనియా, లాలూ ఆరాటం – అమిత్ షా
The post Donald Trump: ప్రధాని మోదీపై ట్రంప్‌ ప్రశంసల వర్షం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CM Chandrababu: జనవరి నుంచి క్వాంటం కంప్యూటింగ్‌ సేవలు – సీఎం చంద్రబాబుCM Chandrababu: జనవరి నుంచి క్వాంటం కంప్యూటింగ్‌ సేవలు – సీఎం చంద్రబాబు

    యూఏఈ పర్యటనలో భాగంగా రెండో రోజు అబుదాబీలో… అబుదాబీ ఛాంబర్‌ ఛైర్మన్‌ అహ్మద్‌ జాసిమ్‌ అల్‌ జాబీ, జీ 42 సీఈవో మాన్సూరీతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ నుంచి స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌

Vijayawada Utsav’s Carnival Earned A place In Guinness Book of World RecordsVijayawada Utsav’s Carnival Earned A place In Guinness Book of World Records

The carnival organized on Mahatma Gandhi Road as part of Vijayawada Utsav-2025 has earned a place in the Guinness Book of World Records. To this end, the representatives of Vibrant

APCC chief Sharmila threatens fast unto death if Aarogyasri services are not restored immediatelyAPCC chief Sharmila threatens fast unto death if Aarogyasri services are not restored immediately

APCC President YS Sharmila protested at Andhra Ratna Bhavan in Vijayawada on Wednesday demanding the immediate release of Arogya Sri funds in the wake of the government failing to pay Aarogyasri (NTR