Driverless Car : అమెరికాలో వైమో సంస్థ డ్రైవర్ రహిత కార్లను (Driverless Car) ట్యాక్సీలుగా నడుపుతున్నట్లే… బెంగళూరు నగర ఆర్‌వీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు డ్రైవర్ అవసరం లేని కారు (Driverless Car) తయారీ చేపట్టారు. ఉత్తరాది మఠానికి చెందిన సత్యాత్మతీర్థ స్వామి ఇటీవల కళాశాలకు వచ్చినప్పుడు ఆ కారులో కాసేపు విహరించి సంతోషం వ్యక్తం చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. కారు ప్రాజెక్టు ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నట్లు కళాశాల యాజమాన్య ప్రతినిధులు వివరించారు. కొద్ది నెలల్లోనే దీన్ని అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు. విప్రో, భారతీయ విజ్ఞాన సంస్థ, ఆర్‌వీ ఇంజినీరింగ్ కళాశాల సంయుక్త భాగస్వామ్యంలో అధ్యయనం కొనసాగుతున్నట్లు సమాచారం.
Driverless Car – సొంత కారు లేకపోతే పిల్లనివ్వరు – డీకే శివకుమార్
సొంతకారు లేని అబ్బాయిలకు పిల్లను ఇవ్వరంటూ కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో (Bengaluru) ట్రాఫిక్ సమస్యలను తీర్చేందుకు ప్రతిపాదించిన టన్నెల్ రోడ్ ప్రాజెక్టును సమర్థిస్తూ కాంగ్రెస్ నేత ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలను బీజేపీ ఎద్దేవా చేసింది. ఈ టన్నెల్ ప్రాజెక్టును రద్దు చేసి, మాస్ ట్రాన్స్‌పోర్ట్‌ను విస్తరించాలని బీజేపీ ఎంపీ తేజస్వీసూర్య డీకేను కలిశారు.
ఈ నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ… ప్రజలు కార్లు కొనడం వెనక ఉన్న సామాజిక పరిస్థితి సూర్యకు అర్థం కాదని వ్యాఖ్యానించారు. ‘‘మీరు సొంత వాహనంలో రాకుండా నేను ఆపగలనా..? ప్రజలు వారి కుటుంబాలతో కలిసి సొంతవాహనాల్లో వెళ్లడానికే మొగ్గుచూపుతారు. వారిని కార్లు వాడొద్దని చెప్పగలమా..? అంతగా అవసరం అనుకుంటే ప్రజా రవాణా వాడుకోమని తమ నియోజకవర్గ ప్రజలకు ఎంపీలు విజ్ఞప్తి చేసుకోవచ్చు. అయితే దానిని ఎంతమంది వింటారో చూడాలి. కారులేని అబ్బాయిలకు పిల్లను ఇవ్వడానికి కూడా ప్రజలు ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది’’ అని శివకుమార్ మీడియాతో మాట్లాడారు.
దీనిపై తేజస్వి స్పందిస్తూ… ‘‘బెంగళూరు (Bengaluru) ట్రాఫిక్ సమస్యను తీర్చడానికి టన్నెల్ రోడ్ ప్రాజెక్టును తీసుకువచ్చారని ఇంతకాలం నేను అపార్థం చేసుకున్నాను. కానీ ఇది ఒక సామాజిక సమస్యను తీర్చడానికి ఉద్దేశించిందని డిప్యూటీ సీఎం స్పష్టత ఇచ్చారు. నేను ఎంత తెలివితక్కువగా ఆలోచించాను’’ అని డీకే వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఉపముఖ్యమంత్రితో భేటీ సందర్భంగా టన్నెల్ రోడ్ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయాన్ని, ప్రజారవాణాకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్రతిపాదనలు చేశానని వెల్లడించారు. అయితే వాటన్నింటిని ఆయన తిరస్కరించారని చెప్పారు. బెంగళూరు ట్రాఫిక్ సమస్యలతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఐటీ రాజధాని కష్టాలకు టన్నెల్ ప్రాజెక్ట్ ఒక మంచి పరిష్కారం అని డీకే ఎప్పటినుంచో చెప్తున్నారు. దానివల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని, ప్రజా రవాణా విషయంలో సరైన పరిష్కారం కాదని సూర్య వ్యతిరేకిస్తున్నారు.
మత్తుపై నృత్య పోరాటం
మాదకద్రవ్యాల అనర్థాలపై కేరళ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎర్నాకుళం అసిస్టెంట్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ జయరాజ్ వినూత్న పంథా ఎంచుకున్నారు. కేరళ శాస్త్రీయ నృత్యకళ ‘ఒట్టన్ తుల్లాల్’ను ఉపయోగించి డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న జయరాజ్ గత ఏడేళ్లలో 654 ప్రదర్శనలు ఇచ్చారు. ఈ నృత్యం కోసం ఆయన స్వయంగా ఓ పాట కూడా రాశారు. వాయలార్ సంతోశ్ అనే గురువు దగ్గర కొన్ని రోజుల్లోనే ఒట్టన్ తుల్లాల్ నేర్చుకొన్న జయరాజ్ ఉన్నతాధికారుల ప్రోద్బలంతో 20 నిమిషాల ఈ నృత్య ప్రదర్శన కొనసాగిస్తున్నారు. ఈ ప్రదర్శనలకు ఆయన ఎటువంటి డబ్బు తీసుకోరు. తనకు తానే మేకప్ వేసుకుంటారు. ఒక పాఠశాలలో ఈ ప్రదర్శన తర్వాత ఓ అమ్మాయి వెక్కివెక్కి ఏడ్చింది. తన బంధువు గత కొన్నేళ్లుగా లైంగికంగా వేధిస్తున్న విషయం ఆమె టీచర్లకు చెప్పడంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
Also Read : Droupadi Murmu: రఫేల్ యుద్ధ విమానంలో రాష్ట్రపతి
The post Driverless Car: బెంగళూరులో మొదటి డ్రైవర్ రహిత కారు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Driverless Car: బెంగళూరులో మొదటి డ్రైవర్ రహిత కారు
Categories: