hyderabadupdates.com Gallery Fake Liquor Case: నకిలీ మద్యం కేసు కీలక సూత్ర దారి జోగి రమేష్

Fake Liquor Case: నకిలీ మద్యం కేసు కీలక సూత్ర దారి జోగి రమేష్

Fake Liquor Case: నకిలీ మద్యం కేసు కీలక సూత్ర దారి జోగి రమేష్ post thumbnail image

 
 
నకిలీ మద్యం కేసులో నిందితుడు జనార్దన్‌రావు సంచలన విషయాలు బయటపెట్టాడు. వైసీపీ పాలనలో జోగి రమేశ్‌ ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారీ జరిగిందని పేర్కొన్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం రాగానే నిఘా పెరగడంతో తయారీ ఆపేసినట్లు వివరించాడు. ‘‘ఏప్రిల్‌లో జోగి రమేశ్‌ ఫోన్‌ చేసి నకిలీ మద్యం తయారు చేయాలన్నారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు సహకరించాలని కోరారు. నకిలీ మద్యం తయారీ మొదట ఇబ్రహీంపట్నంలో పెట్టాలనుకున్నాం. రమేశ్‌ ఆదేశాలతో తంబళ్లపల్లిలో తయారీ ప్రారంభించాం. తంబళ్లపల్లి అయితే చంద్రబాబుపై బురద జల్లోచ్చని చెప్పారు. ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు.
 
నన్ను కావాలనే ఆఫ్రికాలోని నా మిత్రుడి వద్దకు పంపారు. జోగి రమేశ్‌ తన మనుషులతో లీక్‌ ఇచ్చి రైడ్ చేయించారు. టీడీపీ వారిని చంద్రబాబు సస్పెండ్‌ చేయడంతో ప్లాన్‌ మార్చారు. ఇబ్రహీంపట్నంలోనూ సరకు తెచ్చి పెట్టాలన్నారు. ఇబ్రహీంపట్నం గోదాములో ముందురోజే సరకు తెచ్చిపెట్టారు. మళ్లీ లీక్‌ ఇచ్చి రైడ్‌ చేయించారు. సాక్షి మీడియాను కూడా ముందే అక్కడ ఉంచారు. పథకం ప్రకారం చంద్రబాబు సర్కారుకు చెడ్డపేరు వచ్చిందని రమేశ్‌ చెప్పారు. అనుకున్నట్టే అంతా జరిగింది… నువ్వు ఆఫ్రికా నుంచి రావొద్దని చెప్పారు. అంతా నేను చూసుకుంటా… బెయిలిప్పిస్తా అని హామీ ఇచ్చారు. ఆ తర్వాత హ్యాండిచ్చారు. నా తమ్ముడిని కూడా ఇరికించారు. జయచంద్రారెడ్డికి వచ్చే ఎన్నికల్లో సీటు రాదని జోగి రమేశ్‌ నమ్మించారు. జయచంద్రారెడ్డికి… నకిలీ మద్యం తయారీకి సంబంధం లేదు. రమేశ్‌ తో చిన్నప్పటి నుంచి నాకు పరిచయం ఉంది. నమ్మించి మోసం చేశారు. అందుకే బయటకు వచ్చి నిజం చెబుతున్నా’’ అని జనార్దన్‌రావు తెలిపాడు.
 
 
The post Fake Liquor Case: నకిలీ మద్యం కేసు కీలక సూత్ర దారి జోగి రమేష్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CM Stalin: ఎస్‌ఐఆర్‌ పై అన్నాడీఎంకే వైఖరిపై సీఎం స్టాలిన్‌ ఆగ్రహాంCM Stalin: ఎస్‌ఐఆర్‌ పై అన్నాడీఎంకే వైఖరిపై సీఎం స్టాలిన్‌ ఆగ్రహాం

    ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (సర్‌)కు మద్దతుగా అన్నాడీఎంకే సుప్రీంకోర్టును ఆశ్రయించడం సిగ్గుచేటని తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్‌ విమర్శించారు. తన సొంత నియోజకవర్గం కొళత్తూర్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశవాసులు సైతం తాము

KTR: బీఆర్ఎస్, కాంగ్రెస్‌ మధ్యే పోటీ – కేటీఆర్KTR: బీఆర్ఎస్, కాంగ్రెస్‌ మధ్యే పోటీ – కేటీఆర్

    జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక రెండే పార్టీల మధ్య జరుగుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ఆరు గ్యారంటీలను ఎగ్గొట్టి, పేదవాడి గూడు కూలగొట్టి, వాళ్ల నడుం విరగ్గొట్టి ఉపాధి లేకుండా చేస్తున్న కాంగ్రెస్‌కు… పేదవాడి కోసం ప్రభుత్వాన్ని గల్లా