Family Suicide : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులను చంపి తండ్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు (Family Suicide). ఆలమూరు మండలం చిలకలపాడులో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఎస్సై నరేశ్ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఇంట్లో పావులూరి కామరాజు (35), అభిరామ్ (10), గౌతమ్ (7) విగతజీవులుగా పడి ఉండటాన్ని గుర్తించారు. కామరాజు గతంలో వాలంటీర్‌గా పనిచేశారు. 2020లో ఆయన భార్య ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి ఇద్దరు పిల్లలతో కలిసి కామరాజు ఉంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Family Suicide – మహిళలకు బహిరంగంగా క్షమాపణ చెప్పండి
‘ఆడవాళ్లంతా తాగుబోతులు’ అంటూ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ తీవ్రంగా ఖండించారు. బ్రహ్మనాయుడి వ్యాఖ్యలపై మీడియాలో దుమారం రేగడంతో ఆమె స్పందించారు. మహిళలను అవమానపరుస్తూ చేసిన ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి మచ్చగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలను బట్టి ఆయనకు మహిళల పట్ల ఉన్న చులకనభావం అర్థమవుతోందన్నారు. మహిళలను అగౌరవపరిచినందుకు బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉందని, అలా చేయకుంటే కమిషన్ తీవ్రంగా పరిగణిస్తుందని హెచ్చరించారు.
Also Read : Minister Nara Lokesh: అభివృద్ధిలో బులెట్ ట్రైన్‌లా దూసుకెళ్తున్నాం – మంత్రి నారా లోకేశ్
The post Family Suicide: కోనసీమ జిల్లాలో విషాదం! ఇద్దరు చిన్నారులను చంపి తండ్రి ఆత్మహత్య ! appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Family Suicide: కోనసీమ జిల్లాలో విషాదం! ఇద్దరు చిన్నారులను చంపి తండ్రి ఆత్మహత్య !
Categories: