hyderabadupdates.com Gallery Fire Crackers: దీపావళి ముందు సిక్కింలో బాణాసంచాపై నిషేధం

Fire Crackers: దీపావళి ముందు సిక్కింలో బాణాసంచాపై నిషేధం

Fire Crackers: దీపావళి ముందు సిక్కింలో బాణాసంచాపై నిషేధం post thumbnail image

 
 
దీపావళికి ముందు ఈశాన్య రాష్ట్రమైన సిక్కిం బాణాసంచాను నిషేధించింది. అన్ని రకాల సౌండ్, ఫైర్‌క్రాకర్ల తయారీ, విక్రయం, పేల్చడాన్ని పూర్తిగా నిషేధించింది. అదే సమయంలో పండుగ సందర్భంగా సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌ల వాడకాన్ని నివారించాలని కూడా ప్రజలకు పిలుపునిచ్చింది. బదులుగా లైట్ డిస్‌ప్లేలు, డియోలు, ఇతర పర్యావరణ హితమైన లైటింగ్స్ వాడుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. దీపావళి అక్టోబర్ 20న జరగనున్న సందర్భంగా ఇది అమలులోకి వస్తుంది.
 
పర్యావరణ రక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఈ నిషేధాలు విధించారు. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం, ఆకాశ, వాయు, ధ్వని కాలుష్యాలను నివారించడమే లక్ష్యంగా ఈ బాణాసంచా నిషేద నిర్ణయం తీసుకున్నారు. ఫైర్‌క్రాకర్లు పేలడం వల్ల రాత్రి ధ్వని, వాయు కాలుష్యం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని, సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌లు మట్టి, నీటి కాలుష్యానికి కారణమవుతాయని బోర్డు స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు ఇటీవల (అక్టోబర్ 15) ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో ‘గ్రీన్ ఫైర్‌క్రాకర్లు’కు మాత్రమే పరిమిత అనుమతి ఇచ్చినప్పటికీ, సిక్కిం పూర్తి నిషేధాన్ని విధించాలని నిర్ణయించడం విశేషం. పర్యావరణ హితమైన పండుగలకు సూచనలు కూడా ఈ సందర్భంగా రాష్ట్ర పర్యావరణ కంట్రోల్ బోర్డ్ చేసింది. ప్రజలు ఫైర్‌క్రాకర్లకు బదులు లైట్ డిస్‌ప్లేలు, డియోలు, ఇతర పర్యావరణ హితమైన విధానాలతో దీపావళిని జరుపుకోవాలని ఎస్‌పీసీబీ పిలుపునిచ్చింది. ‘పండుగ సంబరాలను పర్యావరణానికి హాని చేయకుండా ఆసక్తికరంగా చేయాలి’ అని బోర్డు ప్రకటనలో పేర్కొన్నారు.
సుప్రీం కోర్టు బెంచ్ (సిజేఐ బీఆర్ గావాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రా) మాటల్లో… ‘పర్యావరణ సమస్యలను దెబ్బతీయకుండా, సమతుల్య విధానంతో మితంగా పండుగ చేయాలి’ అని సూచించారు. కాగా, ప్రపంచంలోనే మొదటి.. పూర్తి ప్లాస్టిక్-ఫ్రీ రాష్ట్రంగా పేరు తెచ్చుకున్న సిక్కిం ఇప్పుడు.. దీపావళి టపాసులు వాడకం మీదా కఠిన నిర్ణయం తీసుకుంది.
The post Fire Crackers: దీపావళి ముందు సిక్కింలో బాణాసంచాపై నిషేధం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Trump Junior: తాజ్‌మహల్‌ను సందర్శించిన జూనియర్ ట్రంప్Trump Junior: తాజ్‌మహల్‌ను సందర్శించిన జూనియర్ ట్రంప్

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ తాజ్ మహల్‌ను సందర్శించారు. సుమారు గంటసేపు తాజ్ ఆవరణలో గడిపారు. గురువారం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఆగ్రాకు చేరుకున్న ఆయన… అక్కడి డయానా బెంచ్‌ సహా

Harsh Goenka: కిరణ్‌ మజుందార్‌ షాకు హర్ష్‌ గొయెంకా మద్దతుHarsh Goenka: కిరణ్‌ మజుందార్‌ షాకు హర్ష్‌ గొయెంకా మద్దతు

Harsh Goenka : భారత సిలికాన్‌ వ్యాలీగా అభివర్ణించే బెంగళూరులో రోడ్ల దుస్థితిపై బయోకాన్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజుందార్‌ షా ఇటీవల చేసిన పోస్టులు రాజకీయంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ఆమెపై వ్యంగ్యాస్త్రాలు