Ganta Srinivasa Rao : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం ఆలయం పైకప్పు మరమ్మతు పనులను పురాతన శాస్త్రీయ విధానంలో చేపట్టడం వల్ల మరో 200 ఏళ్లపాటు లీకేజీ సమస్యలు ఉత్పన్నం కావని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) తెలిపారు. పైకప్పు లీకేజీల నివారణ ప్రాజెక్టు పనులు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఆయన ఆలయాన్ని సందర్శించారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ… పుణెకు చెందిన లార్డ్ వెంకటేశ్వర చారిటబుల్ అండ్ రిలిజియన్ ట్రస్టు.. రూ.5 కోట్ల వ్యయంతో ఫిబ్రవరిలో ప్రారంభించిన పనులను… నిర్దేశించుకున్న గడువు కంటే ముందుగానే పూర్తి చేసిందని తెలిపారు.
కరక్కాయ, సున్నం, బెల్లం, బెండకాయ జిగురు తదితర పదార్థాల మిశ్రమాన్ని పైకప్పుమీద పూసి, సహజసిద్ధమైన రీతిలో లీకేజీలు నివారించారన్నారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి తదితర ప్రముఖ ఆలయాల్లో లీకేజీల నివారణ ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయని వివరించారు. గతంలో సిమెంట్, కాంక్రీట్‌తో లీకేజీల నివారణ పనులు చేపట్టినప్పటికీ ఫలితం ఇవ్వలేదని.. సింహాద్రి అప్పన్న ఆశీస్సులతో ఇప్పుడు దానికి పరిష్కారం లభించిందన్నారు.
Ganta Srinivasa Rao – తిరుపతి కలెక్టరేట్ కు బాంబు బెదిరింపు
తిరుపతి కలెక్టరేట్‌ను బాంబులతో పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందం కలెక్టరేట్‌లోని వివిధ విభాగాలు, పరిసర ప్రాంతాలను పరిశీలించింది. కలెక్టర్ ఛాంబర్‌తో పాటు కార్యాలయంలోని వివిధ శాఖలకు చెందిన గదులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎలాంటి పేలుడు పదార్ధాలు లేవని నిర్ధరించారు. తిరుపతి కలెక్టర్ కార్యాలయ అధికారిక మెయిల్‌కు తమిళనాడు నుంచి బెదిరింపు మెయిల్ వచ్చినట్టు గుర్తించారు. గడచిన 15 రోజులుగా బాంబు బెదిరింపుల మెయిల్స్ వరుసగా రావడం కలకలం రేపుతోంది.
Also Read : MP Mithun Reddy: ఎంపీ మిథున్ రెడ్డి విదేశీ పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్
The post Ganta Srinivasa Rao: పురాతన విధానంలో సింహాచలం ఆలయం పైకప్పు మరమ్మతులు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Ganta Srinivasa Rao: పురాతన విధానంలో సింహాచలం ఆలయం పైకప్పు మరమ్మతులు
Categories: