hyderabadupdates.com Gallery HAL: 113 తేజస్‌ జెట్‌ ఇంజిన్ల కొనుగోలుకు హాల్‌ ఒప్పందం

HAL: 113 తేజస్‌ జెట్‌ ఇంజిన్ల కొనుగోలుకు హాల్‌ ఒప్పందం

HAL: 113 తేజస్‌ జెట్‌ ఇంజిన్ల కొనుగోలుకు హాల్‌ ఒప్పందం post thumbnail image

 
 
కేంద్ర ప్రభుత్వ హిందుస్తాన్‌ ఏరో నాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) అమెరికా రక్షణ రంగ సంస్థ జనరల్‌ ఎలక్ట్రిక్‌(జీఈ) ఏరోస్పేస్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా, ఎంకే1ఏ కార్యక్రమం కింద తేజస్‌ విమా నాలకు అవసరమైన 113 జెట్‌ ఇంజిన్లను కొను గోలు చేయనుంది. భారత ఉత్పత్తులపై ట్రంప్‌ ప్రభుత్వం 50% టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించిన వేళ ఈ ఒప్పందం కుదరడం గమనార్హం. రూ.8,870 కోట్ల విలువైన ఈ ఒప్పందం ప్రకారం జీఈ ఏరోస్పేస్‌ సంస్థ ఎఫ్‌404–జీఈ–ఐఎన్‌ 20 రకం ఇంజిన్లను హెచ్‌ఏఎల్‌కు 2027–2032 సంవత్సరాల మధ్య అందజేయాల్సి ఉంటుంది.
 
చైనా విమాన వాహక యుద్ధనౌక ఫుజియాన్‌ ప్రారంభం
 
చైనా మూడో విమాన వాహక యుద్ధనౌక ఫుజియాన్‌ను రహస్యంగా ప్రారంభించింది. ఈ ప్రారంభ కార్యక్రమానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ హాజరయ్యారు. బుధవారం దక్షిణ చైనాలోని హైనన్‌ ప్రావిన్స్‌లో ఉన్న సాన్యా పోర్టులో జిన్‌పింగ్‌ జెండా ఊపి అత్యంత అధునాతన యుద్ధనౌకను ప్రారంభించారని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే జిన్‌హువా న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. అయితే అధికారిక మీడియా మాత్రం ఫుజియాన్‌ను శుక్రవారం ప్రారంభించారని తెలిపింది.
ఇంతకుముందు చైనా 2012లో లియావోనింగ్‌, 2019లో షాన్‌డాంగ్‌ విమాన వాహక యుద్ధ నౌకలను ప్రారంభించింది. వీటికన్నా ఫుజియాన్‌ పెద్దది. దీని బరువు 80 వేల టన్నులు. చైనా మిలిటరీ కమాండర్‌ సోంగ్‌ జోంగ్‌పింగ్‌ మాట్లాడుతూ ‘‘ఫ్లాట్‌ డెక్‌తో ఉన్న చైనా తొలి ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌ ఇది. ఆధునిక పరిజ్ఞానంతో తయారైంది. ఎలక్ట్రోమ్యాగ్నెటిక్‌ క్యాటపుల్ట్స్‌, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్‌ అరెస్టింగ్‌ గేర్‌, ఎలక్ట్రిక్‌ ప్రొపల్షన్‌ వ్యవస్థ ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. అధునాతన ఫుజియాన్‌లో విద్యుదయస్కాంత విమాన ప్రయోగ వ్యవస్థ (ఈఎంఏఎల్‌ఎ్‌స)ను అమర్చారు. ఈ వ్యవస్థను అమెరికా విమాన వాహక యుద్ధనౌక యూఎస్ఎస్‌ గెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌లో మాత్రమే వినియోగించారు. చైనా ప్రవేశపెట్టిన మూడు విమాన వాహక యుద్ధనౌకల్లో సంప్రదాయ ఇంధనాన్ని మాత్రమే వినియోగిస్తున్నారు. దక్షిణ చైనా సముద్రంలోనే కాకుండా భారత్‌కు సమీపంలోని హిందూ మహాసముద్రంలోనూ, అరేబియా సముద్రంలోనూ ఫుజియాన్‌ను మోహరించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
The post HAL: 113 తేజస్‌ జెట్‌ ఇంజిన్ల కొనుగోలుకు హాల్‌ ఒప్పందం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

TG High Court: గ్రూప్‌-2 రద్దు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పుTG High Court: గ్రూప్‌-2 రద్దు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పు

    2015-16 గ్రూప్‌-2ను రద్దు చేస్తూ మంగళవారం హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నాటి ఎంపిక జాబితాను కొట్టివేసింది. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పు, సాంకేతిక కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా డబుల్‌ బబ్లింగ్, వైట్‌నర్‌ వినియోగం, తుడిపివేతలున్న పార్ట్‌-బి పత్రాలను

KCR: కాంగ్రెస్‌ మోసాలపై ప్రజల్లో ఆగ్రహం – కేసీఆర్KCR: కాంగ్రెస్‌ మోసాలపై ప్రజల్లో ఆగ్రహం – కేసీఆర్

KCR : కాంగ్రెస్‌ ప్రభుత్వ మోసాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కూడా గడవకుండానే… ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని చెప్పారు. పల్లెల్లోని రైతులే