Harinarayan Singh : అత్యధిక సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్లడం అనేది ప్రత్యేకమే. మన దేశంలో ఇలా 10 కంటే ఎక్కువ సార్లు శాసనసభ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలున్నారు. బిహార్‌లోనూ అలాంటి సీనియర్ మోస్ట్ నేతలు ఉన్నప్పటికీ… ఇంతవరకూ ఎవరూ 10 సార్లు విజేతగా నిలిచిన మైలురాయిని అందుకోలేకపోయారు. ఆ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు సీనియర్ ఎమ్మెల్యే హరినారాయణ్ సింగ్.
బిహార్ లో ఇప్పటివరకు హరినారాయణ్ (Harinarayan Singh) తో పాటు సదానంద్ సింగ్, రమయ్ రామ్ తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వీరిలో హరినారాయణ్ మినహా మిగతా ఇద్దరు దివంగతులయ్యారు. ప్రస్తుతం హర్నౌత్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న హరినారాయణ్… వచ్చే ఎన్నికల్లోనూ పోటీకి సిద్ధమయ్యారు. జేడీయూ తరఫున ఇదే స్థానం నుంచి మరోసారి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈసారి ఎన్నికల్లో ఆయన విజయం సాధిస్తే… బిహార్‌లో 10 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏకైక నేతగా అరుదైన ఘనత సాధించనున్నారు.
Harinarayan Singh- దేశంలో అత్యధిక సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నేతలు ఎవరో తెలుసా
కరుణానిధి: తమిళనాడు మాజీ సీఎం, డీఎంకే దివంగత నేత కరుణానిధి అసెంబ్లీ ఎన్నికల్లో 13 సార్లు విజయం సాధించారు. 1957లో తొలిసారి ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టిన ఆయన.. 2018 వరకు పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
కేఎం మణి: కేరళ కాంగ్రెస్ సీనియర్ నేత కేఎం మణి.. కేరళలో వరుసగా 13 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
జ్యోతిబసు: పశ్చిమ బెంగాల్‌కు సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన వామపక్ష నేత జ్యోతి బసు.. 11 సార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు.
గణపత్‌రావ్ దేశ్‌ముఖ్: మహారాష్ట్రకు చెందిన సీనియర్ నేత దేశ్‌ముఖ్ 11 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.
కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ 11 సార్లు, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి హరిదేవ్ జోషీ 10 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు.
Also Read : Amit Shah: సామ్రాట్ ‘బిగ్ మ్యాన్’ అవుతారు – అమిత్ షా
The post Harinarayan Singh: పదిసార్లు ఎమ్మెల్యేగా హరినారాయణ్ సింగ్ చరిత్ర సృష్టించేనా? appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Harinarayan Singh: పదిసార్లు ఎమ్మెల్యేగా హరినారాయణ్ సింగ్ చరిత్ర సృష్టించేనా?
Categories: