hyderabadupdates.com Gallery Harish Rao: పత్తికి మద్దతు ధర ఇవ్వకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం – హరీష్ రావు

Harish Rao: పత్తికి మద్దతు ధర ఇవ్వకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం – హరీష్ రావు

Harish Rao: పత్తికి మద్దతు ధర ఇవ్వకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం – హరీష్ రావు post thumbnail image

 
 
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు వార్నింగ్ ఇచ్చారు. పత్తి రైతుకు మద్దతు ధర ఇవ్వకపోతే తెల్ల బంగారాన్ని రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్యాలస్ ముందు పోసి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. మంగళవారం ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ను హరీష్ రావు, బీఆర్‌ఎస్ నేతలు పరిశీలించారు. అనంతరం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడుతూ… పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైఖరితో రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. సీసీఐ తుగ్లక్ చర్యల వల్ల రైతులు రోడ్డున పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు విధిలేక దళారులకు అమ్ముకుంటున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలను నిలువునా ముంచుతున్నాయని మాజీ మంత్రి విమర్శించారు.
 
రేవంత్ రెడ్డి అరవై సార్లు ఢిల్లీకి వెళ్లారని.. మూటలు పంపుతున్నారు గానీ రైతుల సమస్యలు బడేబాయ్‌కు చెప్పరా అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్‌లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టారని.. మరి రైతులకు మద్దతు ధర ఇప్పించరా అంటూ నిలదీశారు. కపాస్ యాప్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎనిమిది మంది తెలంగాణ బీజేపీ ఎంపీలకంటే పంటపొలాల్లో దిష్టి బొమ్మలు నయమంటూ వ్యాఖ్యలు చేశారు. విదేశాల నుంచి పత్తి దిగుమతి చేసుకునేందుకు నిబంధనలు సడలించారని.. కానీ రైతులకు మాత్రం న్యాయం చేయడం లేదని మండిపడ్డారు.
ఇప్పటి వరకూ 406 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. రైతులు కన్నీళ్లు పెట్టుకుంటుంటే సీఎం రేవంత్ రెడ్డి విజయోత్సవాలు జరుపుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తుఫానుతో పంటలు నష్టపోయిన రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని రైతులకు న్యాయం చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. కాగా.. హరీష్ రావుతో పాటు పత్తియార్డును బీఆర్ఎస్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, మధుసూదనాచారి, చల్లా ధర్మారెడ్డి, మాలోత్ కవిత పరిశీలించారు.
The post Harish Rao: పత్తికి మద్దతు ధర ఇవ్వకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం – హరీష్ రావు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఇక ఆన్‌లైన్ రోడ్డు భద్రతా పరీక్ష త‌ప్ప‌నిస‌రిఇక ఆన్‌లైన్ రోడ్డు భద్రతా పరీక్ష త‌ప్ప‌నిస‌రి

హైద‌రాబాద్ : వాహ‌న దారుల‌కు బిగ్ షాక్ ఇచ్చింది తెలంగాణ స‌ర్కార్. లెర్నర్ లైసెన్స్‌కు ముందు ఆన్‌లైన్ రోడ్డు భద్రతా పరీక్షను త‌ప్ప‌నిస‌రి చేసింది . దీంతో వాహ‌నదారుల‌కు కోలుకోలేని షాక్ త‌గిలింది. దరఖాస్తుదారుల కోసం మూడు గంటల అవగాహన మాడ్యూల్‌ను

Mumbai Hostage: పిల్లల నిర్బంధం ఘటనపై మరాఠీ నటి సంచలన పోస్ట్‌Mumbai Hostage: పిల్లల నిర్బంధం ఘటనపై మరాఠీ నటి సంచలన పోస్ట్‌

Mumbai Hostage : మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని (Mumbai) ఓ యాక్టింగ్‌ స్టూడియోలో పట్టపగలే చిన్నారులను నిర్బంధించడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పై తాజాగా మరాఠీ నటి రుచితా విజయ్‌ జాదవ్‌ స్పందిస్తూ సంచలన విషయాలు

Delhi Airport: ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సాంకేతిక సమస్య ! వందల విమానాలు ఆలస్యం !Delhi Airport: ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సాంకేతిక సమస్య ! వందల విమానాలు ఆలస్యం !

    దేశ రాజధాని దిల్లీ, ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు జైపుర్, లఖ్‌నవూ, వారణాసి, ఇతర