hyderabadupdates.com Gallery IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు post thumbnail image

 
 
రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మొత్తం 31 మంది అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా గురువారం ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో వివిధ సంస్థల డైరెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు ఉన్నారు.
 
వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్: కేవీఎన్ చంద్రశేఖర్‌బాబు
వ్యవసాయశాఖ డైరెక్టర్‌: మనజీర్ జిలానీ సమూన్‌
ఏపీపీఎస్‌సీ సెక్రటరీ: పి.రవి శుభాష్
ఏపీఎస్‌పీడీసీఎస్ చైర్మన్ అండ్ ఎండీ: శివశంకర్ లోతేటి
ఏపీ పౌరసరఫరాల కార్పొరేషన్ వైస్ చైర్మన్, ఎండీ: ఎస్.ఢిల్లీరావు
ఇంటర్ విద్య డైరెక్టర్‌: పి.రంజిత్ బాషా
ఏపీ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ వైస్ చైర్మన్, ఎండీ: పి.అరుణ్‌బాబు
అడిషనల్ సీసీఎల్‌ఏ అండ్ సెక్రటరీ: జేవీ మురళి
అడిషనల్ సీసీఎల్‌ఏ అండ్ జాయింట్ సెక్రటరీగా టీఎస్ చేతన్
ఏపీ వేర్‌ హౌసింగ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, ఎండీ: బి.నవ్య
 
ఏపీ ఎయిర్ పోర్టు డెవలెప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండి: సి.వి.ప్రవీణ్ ఆదిత్య
ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్, ఎక్స్ అఫీషియో డిప్యూటీ సెక్రటరీ జనరల్ అడ్మినిష్ట్రేషన్: కె.ఎస్. విశ్వనాథ్
కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్, అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్: నూరూల్ కోమర్
రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌: రాహూల్ మీనా
కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్, అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్టేట్: అపూర్వ భరత్
శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్, అడిషనల్ డిస్ట్రిట్ మెజిస్ట్రేట్: మంత్రి మౌర్య భరద్వాజ్
హౌసింగ్ డిపార్టుమెంట్ డిప్యూటీ సెక్రటరీ: సహదిత్ వెంటక్ త్రివినాగ్
ఏపీ డైయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ, ఏపీ అమూల్ ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్‌: మురళీధర్ కొమ్మిశెట్టి (ఐఆర్ఎస్ అధికారి)
ఏపీ లెథర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వీసీ ఎండీ: ప్రసన్న వెంకటేష్
యువజన సర్వీసులు ఎండీ, ఏపీ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయిమెంట్ ప్రమోషన్‌ కమిషనర్ భరణి (ఐఎఫ్ఎస్ అధికారి)
అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్ కలెక్టర్, అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్: తిరుమణి శ్రీపూజిత
 
ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌
 
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చే ఏడాది జనవరిలో మరో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. అదే ఏడాది మార్చిలోనే పరీక్షలు నిర్వహించి ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది. మరోవైపు ఈ ఏడాది నవంబర్‌ లో టెట్‌ నిర్వహించాలని నిర్ణయించింది. గురువారం విద్యాశాఖపై మంత్రి నారాలోకేశ్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్సీ వివరాలను వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం.. ఇక నుంచి ఏటా డీఎస్సీ నిర్వహించనున్నట్లు చెప్పారు. విద్యా విధానంపై అధ్యయనానికి 78 మంది ఉత్తమ టీచర్లను సింగపూర్‌ పంపిస్తామన్నారు.
The post IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Sabarimala: శబరిమల ఆలయంలో యోగదండం మాయం ?Sabarimala: శబరిమల ఆలయంలో యోగదండం మాయం ?

Sabarimala : శబరిమల గర్భగుడి నుండి బంగారు పూత కోసం తీసుకెళ్లిన అమూల్యమైన యోగదండం (పవిత్ర దండం) తిరిగి ఇవ్వబడలేదని సమాచారం బయటపడింది. పురాతన యోగదండం 2018లో బంగారు పూత కోసం తీసుకోబడింది. అయితే, బంగారు తాపడం తర్వాత కొత్తగా తయారు

Cabinet Sub Committee: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం కీలక చర్చలుCabinet Sub Committee: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం కీలక చర్చలు

Cabinet Sub Committee : సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఉద్యోగ సంఘాలతో మంత్రి వర్గ ఉపసంఘం (Cabinet Sub Committee) శనివారం సమావేశమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రుల స్ధాయిలో తొలిసారి సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రులు పయ్యావుల కేశవ్,