Indigo : జెడ్డా నుంచి శంషాబాద్ వస్తున్న విమానంలో ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. జెడ్డా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వస్తున్న 6ఈ68 ఇండిగో విమానం(6E68 Indigo flight)లో నగరంలోని అంబర్‌పేటకు చెందిన మహ్మద్ ఖాసీం(79)కు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. మరికొద్ది సేపట్లో విమానం ల్యాండ్ అవుతుందనగా చాతీలో నొప్పి వస్తున్నట్లు ఎయిర్‌లైన్స్ సిబ్బందికి చెప్పారు. వారు అతనికి సీపీఆర్ చేశారు. ఉదయం 9.27 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ అయిన వెంటనే ఎయిర్‌పోర్టులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఖాసీంను పరిశీలించిన డాక్టర్లు అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని ప్రైవేటు అంబులెన్స్‌లో అంబర్‌పేటలోని స్వగ్రహానికి తరలించారు.
Indigo – రైల్వే ట్రాక్షన్ వ్యవస్థ అప్‌గ్రేడ్‌కు రూ.188 కోట్లు
దక్షిణ మధ్య రైల్వే జోన్ (SCR) పరిధిలోని పగిడిపల్లి-గుంటూరు, మోటమర్రి-విష్ణుపురం రైల్వే సెక్షన్లలో విద్యుత్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు రైల్వే శాఖ బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టును రూ.188.31 కోట్ల వ్యయంతో చేపడతారు. ప్రస్తుతం ఈ రెండు మార్గాల్లో 25 కేవీ విద్యుత్ వ్యవస్థ ఒక్కోటి ఉంది. వీటిని రెండు 25 కేవీ విద్యుత్ వ్యవస్థలుగా అభివృద్ధి చేయనున్నారు. పగిడిపల్లి-గుంటూరు, మోటమర్రి-విష్ణుపురం మధ్య దాదాపు 337 రూట్ కిలోమీటర్లు ఉంటుంది. ఇవి ప్రస్తుతం సింగిల్ లైన్ మార్గాలు. ఈ మార్గాల్లో ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్‌ను మెరుగుపరిస్తే అధిక వోల్టేజ్‌తో విద్యుత్ సరఫరా అవుతుంది. తద్వారా ప్రస్తుతం తిరిగే రైళ్లను అధిక వేగంతో, ఎక్కువ సామర్థ్యంతో నడపడానికి వీలవుతుంది.
రద్దీ మార్గానికి ప్రత్యామ్నాయం బలోపేతం – రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
సికింద్రాబాద్-విజయవాడ చాలా రద్దీగా ఉండే రైల్వే మార్గం. పగిడిపల్లి-గుంటూరు, విష్ణుపురం-మోటమర్రి సెక్షన్… సికింద్రాబాద్-విజయవాడ మధ్య ప్రత్యామ్నాయ మార్గంగా పనిచేస్తుంది. ఈ రెండు మార్గాల్లో మరిన్ని రైళ్లను నడపడానికి పగిడిపల్లి-గుంటూరు, విష్ణుపురం- మోటమర్రి సెక్షన్‌లో ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్‌ను మెరుగుపరచాలని నిర్ణయించాం. ఈ సెక్షన్‌ను రానున్న మూడు సంవత్సరాల్లో రూ.188 కోట్లతో మెరుగుపరుస్తాం.
Also Read : Cloud Seeding: ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్ ఫెయిల్
The post Indigo: ఇండిగో విమానంలో గుండెపోటుతో వ్యక్తి మృతి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Indigo: ఇండిగో విమానంలో గుండెపోటుతో వ్యక్తి మృతి
Categories: