hyderabadupdates.com Gallery IndiGo Flight: గన్నవరంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

IndiGo Flight: గన్నవరంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

IndiGo Flight: గన్నవరంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ post thumbnail image

 
 
గన్నవరం విమానాశ్రయంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఈ విమానం హుబ్లీ నుంచి తెలంగాణలోని హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. అయితే హైదరాబాద్ లో వాతావరణం అనుకూలించకపోవడంతో మంగళవారం గన్నవరం విమానాశ్రయంలో ఇండిగో ఫ్లైట్ ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. గత రెండు రోజులుగా హైదరాబాద్ లో వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. అలానే ఇవాళ(మంగళవారం) కూడా హైదరాబాద్ లో నల్లటి మేఘాలు అలుముకున్నాయి. అంతేకాక పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. ఇలా వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఇండిగో విమానాన్ని విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు.
విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్‌ సస్పెన్షన్‌
 
విద్యార్థుల చేత కాళ్లు నొక్కించుకున్న టీచర్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. మెళియాపుట్టి మండలం బందపల్లి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయురాలు సుజాతను సస్పెండ్‌ చేస్తూ సీతంపేట ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఆ ఉపాధ్యాయురాలు వారితో కాళ్లు పట్టించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోపై ప్రాథమిక విచారణ జరిపిన ఉన్నతాధికారులు.. ఆమెను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి… వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని టెక్కలి ఆర్డీఓను సీతంపేట ఐటీడీఏ పీఓ ఆదేశించారు.
The post IndiGo Flight: గన్నవరంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

RJD: బిహార్‌ ఎన్నికలకు 143 మందితో ఆర్జేడీ జాబితా విడుదలRJD: బిహార్‌ ఎన్నికలకు 143 మందితో ఆర్జేడీ జాబితా విడుదల

RJD : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ దగ్గరపడుతోంది. కానీ, ఇంతవరకూ విపక్ష ఇండియా కూటమి ‘మహాగఠ్‌బంధన్‌’లో సీట్ల పంపకాలు పూర్తికాలేదు. దీనిపై కాంగ్రెస్‌, ఆర్జేడీ మధ్య మంతనాలు కొనసాగుతోన్న వేళ.. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పార్టీ సోమవారం అభ్యర్థుల జాబితాను

Vijayawada Utsav’s Carnival Earned A place In Guinness Book of World RecordsVijayawada Utsav’s Carnival Earned A place In Guinness Book of World Records

The carnival organized on Mahatma Gandhi Road as part of Vijayawada Utsav-2025 has earned a place in the Guinness Book of World Records. To this end, the representatives of Vibrant