hyderabadupdates.com Gallery IndiGo Flight: గన్నవరంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

IndiGo Flight: గన్నవరంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

IndiGo Flight: గన్నవరంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ post thumbnail image

 
 
గన్నవరం విమానాశ్రయంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఈ విమానం హుబ్లీ నుంచి తెలంగాణలోని హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. అయితే హైదరాబాద్ లో వాతావరణం అనుకూలించకపోవడంతో మంగళవారం గన్నవరం విమానాశ్రయంలో ఇండిగో ఫ్లైట్ ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. గత రెండు రోజులుగా హైదరాబాద్ లో వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. అలానే ఇవాళ(మంగళవారం) కూడా హైదరాబాద్ లో నల్లటి మేఘాలు అలుముకున్నాయి. అంతేకాక పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. ఇలా వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఇండిగో విమానాన్ని విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు.
విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్‌ సస్పెన్షన్‌
 
విద్యార్థుల చేత కాళ్లు నొక్కించుకున్న టీచర్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. మెళియాపుట్టి మండలం బందపల్లి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయురాలు సుజాతను సస్పెండ్‌ చేస్తూ సీతంపేట ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఆ ఉపాధ్యాయురాలు వారితో కాళ్లు పట్టించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోపై ప్రాథమిక విచారణ జరిపిన ఉన్నతాధికారులు.. ఆమెను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి… వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని టెక్కలి ఆర్డీఓను సీతంపేట ఐటీడీఏ పీఓ ఆదేశించారు.
The post IndiGo Flight: గన్నవరంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

అన‌కాప‌ల్లి ఉత్స‌వ్ థీమ్ సాంగ్ ఆవిష్క‌ర‌ణఅన‌కాప‌ల్లి ఉత్స‌వ్ థీమ్ సాంగ్ ఆవిష్క‌ర‌ణ

విశాఖ‌పట్నం జిల్లా : అన‌కాప‌ల్లి ఉత్స‌వ్ థీమ్ సాంగ్ ను ఆవిష్క‌రించారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని అన‌కాప‌ల్లిలో అన‌కాప‌ల్లి ఉత్స‌వ్ ను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించేందుకు నిర్ణ‌యం తీసుకుంది ఏపీ స‌ర్కార్. ఇందులో భాగంగా

AP Government: విశాఖ ఆర్డీవో, డీఆర్వోపై బదిలీ వేటుAP Government: విశాఖ ఆర్డీవో, డీఆర్వోపై బదిలీ వేటు

  విభేదాలతో రోడ్డెక్కిన విశాఖ ఆర్డీవో పి.శ్రీలేఖ, డీఆర్వో (జిల్లా రెవెన్యూ అధికారి) బీహెచ్‌ భవానీ శంకర్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్డీవో, డీఆర్వోల మధ్య ఉన్న విభేదాలు ఇటీవల తీవ్రంగా మారాయి. తహసీల్దార్‌

“KCR Confident: Jubilee Hills Victory ‘Inevitable,’ Holds Key Conclave”“KCR Confident: Jubilee Hills Victory ‘Inevitable,’ Holds Key Conclave”

The BRS party has taken the Jubilee Hills by-election with great pride. In this context, party chief Kalvakuntla Chandrasekhar Rao himself has been busy strategizing. He held a key meeting