hyderabadupdates.com Gallery Infectious Diseases: భారత్‌లో పెరుగుతున్న అంటువ్యాధులు

Infectious Diseases: భారత్‌లో పెరుగుతున్న అంటువ్యాధులు

Infectious Diseases: భారత్‌లో పెరుగుతున్న అంటువ్యాధులు post thumbnail image

Infectious Diseases : భారత్‌లో అంటువ్యాధుల వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. ఐసీఎంఆర్‌ (ICMR) నివేదిక ప్రకారం ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అంటువ్యాధుల వ్యాప్తి 10.7 శాతంగా నమోదవగా… రెండో త్రైమాసికంలో ఇది 11.5 శాతానికి పెరిగింది. ఐసీఎంఆర్‌ అధ్యయనంలో భాగంగా దేశవ్యాప్తంగా పరీక్షించిన ప్రతి 9 మందిలో ఒకరిలో సంక్రమిత వ్యాధికారకాలు ఉన్నట్టు తేలింది. ఐసీఎంఆర్‌ (ICMR) నెట్‌వర్క్‌ కింద ఉన్న ల్యాబ్‌ల్లో 4.5 లక్షల మందిని పరీక్షించగా 11.1 శాతం మందిలో వ్యాధికారక సూక్ష్మజీవులు ఉన్నట్టు కనుగొన్నారు. అక్యూట్‌ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్‌ (ఏఆర్‌ఐ) కేసుల్లో ఇన్‌ఫ్లుయెంజా-ఏ, తీవ్రమైన జ్వరం, రక్తస్రావం కేసుల్లో డెంగీ వైరస్‌, కామెర్ల కేసుల్లో హెపటైటి్‌స-ఏ, డయేరియా కేసుల్లో నోరోవైరస్‌, అక్యూట్‌ ఎన్సిఫాలిటిస్‌ సిండ్రోమ్‌ (ఏఈఎస్‌) కేసుల్లో హెర్పస్‌ సింప్లెక్స్‌ వైరస్‌ (హెచ్‌.ఎస్.వీ)లను టాప్‌-5 వ్యాధికారకాలుగా గుర్తించారు.
Infectious Diseases – దిల్లీ గాలి కాలుష్యంపై తక్షణమే చర్యలు తీసుకోండి – ప్రియాంకా గాంధీ
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. గత రెండు వారాలుగా అక్కడ గాలి నాణ్యత బాగా క్షీణించింది. ఆదివారం కూడా అలాంటి పరిస్థితే కన్పించింది. అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 400 దాటిపోయిందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) వెల్లడించింది. కాలుష్య తీవ్రతపై కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, దిల్లీ సీఎం రేఖా గుప్తాను ట్యాగ్‌ చేస్తూ ఈ మేరకు ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు. బిహార్‌లో ఎన్నికల ప్రచారం అనంతరం దిల్లీకి తిరిగి వచ్చిన ప్రియాంక.. దేశ రాజధానిని కాలుష్యం బూడిద రంగు కవచంలా కప్పివేయడం చూసి దిగ్బ్రాంతికి గురైనట్లు చెప్పారు.
రాజకీయాలతో సంబంధం లేకుండా.. నాయకులందరూ కలిసి దీనిపై చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ భయంకర పరిస్థితిని తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకునే ఏ చర్యలకైనా మద్దతు ఇవ్వాలని రాజకీయ నేతలను కోరారు. ఏటా దిల్లీ పౌరులపై ఈ విష వాయువులు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయని పేర్కొన్నారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు, పాఠశాలకు వెళ్లే పిల్లలు, వృద్ధులతో పాటు తాము కూడా ఈ విష వాయువునే పీల్చుకుంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తక్షణమే జోక్యం చేసుకుని, చర్యలు చేపట్టాలని అభ్యర్థించారు.
Infectious Diseases – క్లౌడ్‌ సీడింగ్‌ అనేది ఒక క్రూరమైన జోక్‌ – జైరాం రమేశ్‌
క్లౌడ్‌ సీడింగ్‌ కారణంగా ఒకటి లేదా రెండు రోజులు పరిమిత ప్రాంతంలో గాలి నాణ్యతలో స్వల్ప మెరుగుదల కనిపించిందన్న దిల్లీ ప్రభుత్వ ప్రకటనను ‘క్రూరమైన జోక్‌’గా కాంగ్రెస్‌ అభివర్ణించింది. ఈ మేరకు కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి జైరాం రమేశ్‌ ఎక్స్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. శీతాకాలంలో గాలినాణ్యతను మెరుగుపరిచేందుకు క్లౌడ్‌ సీడింగ్‌తో ప్రయోజనం ఉండదని గతేడాది డిసెంబరులో కమిషన్‌ ఫర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్, సీపీసీబీ, ఐఎండీ మొదలైన సంస్థలు స్పష్టమైన సలహా ఇచ్చాయని గుర్తుచేశారు. అయినప్పటికీ ప్రభుత్వం రూ.34 కోట్లు ఖర్చుచేయడం నాటకీయంగా కనిపిస్తుందన్నారు.
Also Read : YS Jagan: మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటన
The post Infectious Diseases: భారత్‌లో పెరుగుతున్న అంటువ్యాధులు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Nitish Kumar: బిహార్‌ ఎన్డీయే శాసనసభాపక్షనేతగా నీతీశ్‌ కుమార్‌Nitish Kumar: బిహార్‌ ఎన్డీయే శాసనసభాపక్షనేతగా నీతీశ్‌ కుమార్‌

    బిహార్‌లో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తదుపరి ముఖ్యమంత్రిగా నీతీశ్‌ కుమార్‌ ఖరారయ్యారు. ఈ మేరకు ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు… తమ కూటమి నేతగా నీతీశ్‌ను ఎన్నుకున్నారు. అనంతరం గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ను

Zubeen Garg: సింగర్ జుబీన్ గార్గ్ కేసులో బిగ్ ట్విస్ట్Zubeen Garg: సింగర్ జుబీన్ గార్గ్ కేసులో బిగ్ ట్విస్ట్

    అస్సాంకు చెందిన ప్రముఖ సింగర్ జుబీన్‌ గార్గ్‌ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అతని కజిన్, అస్సాం పోలీస్ సర్వీస్‌ (APS) అధికారి సందీపన్‌ గార్గ్‌ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా

Water Awards: ‘జల్‌ సంచయ్‌ జన్‌ భాగీదారీ’లో తెలంగాణ జయకేతనం !Water Awards: ‘జల్‌ సంచయ్‌ జన్‌ భాగీదారీ’లో తెలంగాణ జయకేతనం !

    జల సంరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన 6వ జాతీయ జల అవార్డులు–2024లో తెలంగాణ ఏకంగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ‘జల్‌ సంచయ్‌ జన్‌ భాగీదారీ’విభాగంలో తెలంగాణ టాప్‌లో నిలిచి సత్తా